Don't Miss!
- Sports PBKS vs MI: ఆ తప్పిదంతోనే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: సామ్ కరణ్
- News పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అఖిల్: తదుపరి చేయబోయే చిత్రంలో పాత్ర ఇదే
హైదరాబాద్ : నాగార్జున కుమారుడు అఖిల్ తన తొలి చిత్రాన్ని వివి వినాయిక్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ లోగా అఖిల్ తన తదుపరి చిత్రం సైన్ చేసాడని సమాచారం. ఆ దర్శకుడు మరెవరో కాదు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ మేరకు రీసెంట్ గా కూడా నాగార్జున...చర్చలు జరిపాడని తెలుస్తోంది. నాగార్జున కు, త్రివిక్రమ్ కు ఉన్న అనుబంధంతో వెంటనే ఓకే చేసాడని చెప్పుకుంటున్నారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఈ మేరకు అఖిల్ కు త్రివిక్రమ్ ఓ కథని నేరేట్ చేసాడని చెప్పుకున్నాడు. ఈ చిత్రంలో అఖిల్ ...ఓ స్పోర్ట్స్ పర్శన్ గా కనిపిస్తాడని అంటున్నారు. అఖిల్ నిజ జీవితంలోనూ స్పోర్ట్స్ పర్శన్ కావటంతో అదే పాత్రను తెరపై చూపబోతున్నాడని అంటున్నారు.
ఇక అక్కినేని అఖిల్ తాజా చిత్రం విశేషాలు
..ట్విట్టర్ సాక్షిగా...ఎప్పటికప్పుడు అభిమానులకు చేరుతూనే ఉన్నాయి. సినిమా షూటింగ్ మొదలైంది మొదలు ఎక్కడెక్కడ ఏమేమి చిత్రీకరిస్తున్నారో అఖిల్ సోషల్ మీడియా ద్వారా వివరిస్తూనే ఉన్నాడు.
ఓల్డ్ సిటీలో షూటింగ్ ముచ్చట్లు, ఆ మధ్య స్పెయిన్ లో జరిగిన షూటింగ్ వివరాలు కూడా అభిమానులకు తెలిపాడు. అయితే ఇటీవల థాయ్ లాండ్ కు ప్రయాణం అయిన అఖిల్ త్వరలోనే వీడియో ఒకటి విడుదల చేస్తానంటూ ఫ్యాన్స్ కు మాట ఇచ్చాడు. అఖిల్ ఇచ్చిన మాటను చిత్ర నిర్మాత నితిన్ నిలబెట్టుకుంటూ శనివారం మేకింగ్ వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా అధికారికంగా చిత్ర నిర్మాత నితిన్ విడుదల చేసిన వీడియోతో ఈ మూవీలో యాక్షన్ ఎపిసోడ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అర్థమైంది! స్పెయిన్ వీధుల్లో చిత్రీకరించిన ఛేజింగ్ సీన్ లో అఖిల్... ఎంతో రిస్క్ తీసుకుని నటించాడు. అంతేకాదు... ఇటు యూనిట్ సభ్యులతో పాటు... అటు దర్శకుడు వీవీ వినాయక్ తోనూ సూపర్ అనిపించుకున్నాడు.
ఇటు డాన్స్, అటు ఫైట్స్ విషయంలో అఖిల్ అదరగొడుతున్నాడు సరే... ఇంతకూ సినిమా పేరేమిటి? ఎప్పుడొస్తుందన్నది చెప్పమంటున్నారు అఖిల్ అభిమానులు.
యాక్షన్ సీన్లు మాత్రమే కాదు...డాన్స్ విషయంలో అఖిల్ కేక పెట్టించబోతున్నాడు. టాలీవుడ్లో అక్కినేని నాగేశ్వరరావు అప్పట్లో మంచి డాన్సర్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత వచ్చిన నాగార్జున, నాగ చైతన్య మాత్రం తమ పోటీ స్టార్లతో పోలిస్తే డాన్స్ విషయంలో ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్నారు. అయితే అఖిల్ అక్కినేని మాత్రం డాన్స్ విషయంలో ఇరగదీస్తుండటంపై ప్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. సినిమాలో అఖిల్ డాన్స్ స్టెప్పులు వేసిన వీడియో ఆ మధ్య లీకైంది కూడా.
శ్రేష్ఠ్ మూవీస్ బేనర్లో యాక్టర్ నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అఖిల్ అక్కినేని, సాయేషా సైగల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, మహేష్ మంజ్రేకర్, వెన్నెల కిషోర్, సప్తగిరితోపాటు మరి కొంతమంది ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: అమోల్‌రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.