twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాకింగ్: అక్కినేని ఫ్యామిలీ వైజాగ్ షిప్టవుతోందా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చెన్నై నుండి హైదరాబాద్ షిప్టవ్వడానికి....ప్రధాన భూమిక పోషించిన వారిలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో స్థాపించి తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధిలో తనవంతు సేవ చేసారు. స్టూడియోను అభివృద్ధి చేయడానికి ఆయన తనయులు అక్కినేని వెంకట్, నాగార్జున తమ శక్తి మేర శ్రమించారు. ఎంతో మంది కొత్త దర్శకులు, కొత్త నటీనటులు, టెక్నీషియన్స్‌కు సినీజీవితాన్ని ప్రసాదించింది అక్కినేని ఫ్యామిలీ.

    తెలుగు సినీ పరిశ్రమలో మంచి పలుకుబడి, గౌరవ మర్యాదలు ఉన్న అక్కినేని ఫ్యామిలీ.... 62 కోట్ల అప్పు చెల్లించలేక అన్నపూర్ణ స్టూడియోకు సంబంధించిన 7 ఎకరాలను పోగొట్టుకోవడం హాట్ టాపిక్ అయింది. ఆంధ్ర బ్యాంక్, ఇండియన్ బ్యాంకు అన్నపూర్ణ స్టూడియోకు సంబంధించిన ఈ భూమిని స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. అయితే ఈ పరిణామాలను సినీ ప్రేమికులు జీర్ణించుకోలేక పోతున్నారు.

    ఈ పరిణామాల నేపథ్యంలో ఫిల్మ్ నగర్లో ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత అక్కినేని ఫ్యామిలీ కొన్ని పరిస్థితుల కారణంగా హైదరాబాద్ నుండి వైజాగ్ షిప్టవ్వడానికి ప్లాన్ చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఆస్తులు అమ్మినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.

    Akkineni family Shifting to Vizag?

    వైజాగ్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందే అవకాశాలు ఉండటంతో....అక్కినేని ఫ్యామిలీ అక్కడే సెటిలవ్వడానికి ఆసక్తి చూపుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న ఈ ప్రచారంలో నిజం ఎంత? అనేది తేలాల్సి ఉంది.

    అన్నపూర్ణ స్టూడియోస్‌కు సంబంధించిన 7.5 ఎకాల స్థలాన్ని ఈ నెల 20న స్వాధీనం చేసుకున్నట్లు ఆంధ్రా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ సంయుక్తంగా ప్రముఖ తెలుగు దిన పత్రికలో ఓ ప్రకటన జారీ చేసారు. మొత్తం వడ్డీతో కలిసి వీరు బ్యాంకుకు రూ. 62 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది.

    2/1/2014న బ్యాంకు వారు నోటీసులు కూడా జారీ చేసారు. 60రోజుల్లోపు కట్టాల్సిందిగా అన్నపూర్ణ స్టూడియోస్ కి గత యేడాది నోటీసులు పంపించారట బ్యాంకు అధికారులు. సంవత్సరం దాటినా ఆ నోటీసుకు వారు స్పందించలేదు. దాంతో 7 ఎకరాలను హ్యాండోవర్ చేసుకోవాల్సి వచ్చిందని బ్యాంకు వర్గాలు పేర్కొన్నాయి.

    ఈ లోన్ కి గ్యారంటీయర్లుగా నాగార్జున, సుప్రియ, వై.సురేంద్ర పేర్లు ఉండగా, నాగసుశీల, వెంకట్ రొడ్డం, నిమ్మగడ్డ ప్రసాద్, అన్నపూర్ణ స్టూడియోతో కలిసి లోన్ తీసుకున్నవారి జాబితాలో ఉన్నారు. ఈ వ్యవహారం వెనక పెద్ద స్టోరీనే ఉందని స్పష్టమవుతోంది. అయితే నాగ్ అండ్ కో మాత్రం ఈవిషయాలు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. త్వరలో అన్ని విషయాలు వెల్లడికానున్నాయి.

    English summary
    A strange talk has began to make rounds in Film Nagar that Nagarjuna family is planning to shift Vizag, Andhra Pradesh as they are forecasting different futuristic situations after bifurcation. So, he might go for selling out Akkineni properties in Hyderabad one after other before beginning new investment in a new destination of Andhra Pradesh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X