twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చేతులెత్తేసిన రామ్ చరణ్ నిర్మాత, రంగంలోకి అల్లు అరవింద్?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తమిళంలో సూపర్ హిట్టయిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ‘థాని ఓరువన్' చిత్రాన్ని తెలుగులో రామ్ చరణ్ హీరోగా రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ చిత్రాన్ని మెగాసూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత ఎన్వీ ప్రసాద్, డివివి దానయ్య కలిసి నిర్మించాలని అనుకున్నారు.

    అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డివివి దానయ్య తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ స్థానంలో అల్లు అరవింద్ నిర్మాతగా కొనసాగనున్నట్లు సమాచారం. ఇటీవల రామ్ చరణ్ తో ‘బ్రూస్ లీ' నిర్మించిన దానయ్య ఆ సినిమా సరిగా ఆడక పోవడంతో ఫైనాన్షియల్ గా టైట్ పొజిషన్లో ఉన్నట్లు టాక్. అందుకే ‘థాని ఓరువన్' సహ నిర్మాతగా తప్పుకున్నట్లు చెబుతున్నారు.

    ram charan

    ఆ సంగతి పక్కన పెడితే..అయితే ఈ చిత్రంలో అత్యంత కీలకమైన విలన్ పాత్రలో ఎవరు నటిస్తున్నారనేది హాట్ టాపిక్ అయింది. తమిళంలో విలన్ పాత్రలో అరవిందస్వామి నటించారు. తెలుగులో విలన్ పాత్ర కోసం ఇప్పటికే పలువురి పేర్లు వినిపించాయి. తెలుగు స్టార్ నాగార్జున పేరు కూడా వినిపించింది. అయితే నాగార్జున ఈ రోల్ చేయడం లేదని తేలిపోయింది. గత కొంత కాలంగా నటుడు మాధవన్ పేరు ప్రచారంలో ఉంది.

    మాధవన్ తెలుగు ప్రేక్షకులు లవర్ బాయ్ గానే పరిచయం. ఆయన హీరోగా వచ్చిన రన్, సఖి, చెలి చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. చాలా కాలం తర్వాత మళ్లీ మాధవ్ తెలుగు తెరపై, అందులోనూ పవర్ ఫుల్ విలన్ పాత్రలో, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో సినిమాలో కనిపిస్తున్నాడనే వార్తలు ఆసక్తిని రేకెత్తించాయి.

    అయితే.... ఈ వార్తల నేపథ్యంలో మాధవన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. తాను ప్రస్తుతం ‘సాల ఖాదూస్', ‘ఇర్రుది సత్రు' సినిమాల్లో నటిస్తున్నాను. ఇవి తప్ప ఏ లాంగ్వేజ్ లోనూ, మరే సినిమాకు కూడా కమిట్ కాలేదు అని ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. మరి మెయిన్ విలన్ పాత్రలో ఎవరు నటిస్తారనేది హాట్ టాపిక్ అయింది. ‘థాని ఓరువన్' చిత్రం రీమేక్ రైట్స్ భారీగా ధరకు కొనుగోలు చేసారు. తమిళంలో ఈ చిత్రం జయం రవి, నయనతార, అరవింద స్వామి ప్రధాన పాత్రల్లో ఎం.రాజా దర్శకత్వంలో తెరకెక్కింది.

    English summary
    Looks like Allu Aravind has stepped in the place of producer Danayya to co-produce the remake of Thani Oruvan. Earlier NV Prasad of Megasupergood movies and Danayya were planning to produce the movie but now Allu Aravind has reportedly stepped in.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X