» 

అల్లు అరవింద్ వద్దన్నాడనే కట్ చేసారు

Posted by:
Give your rating:

హైదరాబాద్: 'హృదయకాలేయం' టీజర్లతో యూట్యూబులో, సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో అందరి దృష్టిని ఆకర్షించిన సంపూర్ణేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన పనిలేదు. తనకు తానుగానే 'బర్నింగ్ స్టార్' అనే బిరుగు తగిలించుకుని ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ హీరోకు ఆ మధ్యన కొత్త జంట చిత్రంలో ఫుల్ లెంగ్త్ రోల్ దొరికిందని ఆయన అభిమానులంతా మురసిపోయారు. అయితే షూటింగ్ పూర్తయ్యాక అల్లు అరవింద్ ఆ సీన్స్ తీసేయమని ఆర్డర్ చేసి మరీ తీయంచేసారని పాపులర్ ఇంగ్లీష్ డైలీ రాసుకొచ్చింది.

తన కుమారుడు అల్లు శిరీష్ హీరోగా చేస్తున్న కొత్త జంట చిత్రంలో సంపూర్ణేష్ బాబు రోల్ పూర్తిగా డామినేషన్ గా ఉందని,ఫోకస్ అతని వైపుకే షిప్ట్ అవుతోందని స్వయంగా తీయించాడని చెప్తున్నారు. ఇప్పుడు ఆ సీన్స్ తీసేసిన ప్లేస్ ని వెన్నెల కిషోర్,పోసాని లతో షూట్ చేసి కలుపుతున్నారు. సినిమా చాలా బాగా వచ్చిందని, ఈ సినిమాతో అల్లు శిరీష్ నిలదొక్కుకుంటాడని అంటున్నారు.

గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు శిరీష్, రెజీనా జంటగా మారుతి దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'కొత్త జంట'. ఈ చిత్రం ఆడియోని ఈ నెల మూడో వారంలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆడియోని భారీగా,సినీ పెద్దల సమక్షంలో జరపాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆడియో విడుదల తర్వాత పూర్తి ప్రమోషన్ ఏక్టివిటీస్ ప్రారంభించి విడుదల తేదీని ప్రకటించనున్నారు. బన్ని వాసు నిర్మాత. అల్లు అరవింద్‌ సమర్పకులు. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

మారుతి మాట్లాడుతూ... నేను.. నా జీవితం ఇంకేమీ వద్దు. డబ్బుంటేనే జీవితం... అది లేకపోతే ఇంకేమీ లేదు. ఇలాంటి మనస్తత్వం వారిద్దరిదీ. అనుకోకుండా కలుసుకున్నారు.. మనసులు కలుపుకొన్నారు. కానీ వారి ఆలోచనలు మాత్రం అలానే ఉన్నాయి. ఆ జంట కథే మా 'కొత్తజంట' అన్నారు . 'ఈరోజుల్లో' సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకొన్నారు మారుతి. 'బస్‌స్టాప్‌', 'ప్రేమ కథాచిత్రమ్‌' సినిమాలు విజయాల్ని సాధించాయి. ప్రస్తుతం అల్లు శిరీష్‌ హీరోగా నటిస్తున్న 'కొత్త జంట' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు శిరీశ్‌ని చాలా కాలంగా తెలిసినవాణ్ణి కాబట్టి అతని ప్లస్‌లూ, మైనస్‌లూ నాకు తెలుసు. అతని ప్లస్‌లను ఉపయోగించుకుంటూ ఈ సినిమా చేస్తున్నా అంటున్నారు దర్శక,నిర్మాత మారుతి.

నిర్మాత మాట్లాడుతూ ''ఇద్దరు స్వార్థపరులు ప్రేమిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూడొచ్చు. మారుతి నుంచి వస్తున్న మరో వినోదాత్మక చిత్రమిది. ఈ నెల మూడోవారంలో పాటల్ని విడుదల చేస్తాము. శిరీష్ బాడీలాంగ్వేజ్‌కు సరిపోయే కథతో, కొత్త లుక్‌తో దర్శకుడు చిత్రాన్ని వైవిధ్యంగా పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు''అన్నారు.

ఈ చిత్రంలో చిరంజీవి హిట్..ఖైదీ నెంబర్ 786లోని ఇటు అమలాపురం..అటు పెద్దాపురం అనే పాటను రీమిక్స్ చేస్తున్నారు. ఈ పాటను...సిల్క్ స్మిత అప్పట్లో చేసింది. మధురిమ, మధు, రావు రమేష్‌, పోసాని కృష్ణమురళి, రోహిణి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కెమెరా: రీచర్డ్ ప్రసాద్, నిర్మాత: బన్నీవాసు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మారుతి.

Read more about: sampoornesh babu, allu aravind, maruthi, allu sirish, madhurima, kotha janta, సంపూర్ణేష్ బాబు, అల్లు అరవింద్, మారుతి, అల్లు శిరీష్, మధురిమ, కొత్త జంట
English summary
The first version of Kotha Janta film had Sampoornesh Babu, and, according to source, Allu Aravind, after seeing the film, felt that the focus shifts completely to him after his entry. Now the film has extended Vennela Kishore and Posani Krishna Murali’s characters and has come out well, says our source.
Please Wait while comments are loading...
 
X

X
Skip Ad
Please wait for seconds

Bringing you the best live coverage @ Auto Expo 2016! Click here to get the latest updates from the show floor. And Don't forget to Bookmark the page — #2016AutoExpoLive