twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అనుష్కకు మనవడుగా అల్లు అర్జున్ లేదా మహేష్

    By Srikanya
    |

    హైదరాబాద్ : 'రుద్రమదేవి'ని స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన గుణశేఖర్‌ తదుపరి కొనసాగింపు సినిమాకోసం 'ప్రతాపరుద్రుడు - ది లాస్ట్‌ ఎంపరర్‌' అనే టైటిల్‌ని కూడా రిజిస్టర్‌ చేయించారు. 'రుద్రమదేవి' చివర్లో తదుపరి చిత్రానికి సంబంధించి కొన్ని సన్నివేశాలు చూపించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఈ నేపధ్యంలో మరి తెరపై 'ప్రతాపరుద్రుడు'గా ఎవరు నటించబోతున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మహేష్‌బాబుతోకానీ, అల్లు అర్జున్‌తోకానీ ఆ సినిమాని తీసే ఆలోచనలో గుణశేఖర్‌ ఉన్నట్టు తెలుస్తోంది.

    సూపర్ హిట్ 'బాహుబలి'కి 'బాహుబలి2' తెరకెక్కనుండగా, ఇప్పుడు 'రుద్రమదేవి'కి కూడా కొనసాగింపుగా 'ప్రతాపరుద్రుడు' పేరుతో మరో సినిమాని తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నారు. కాకతీయ సామ్రాజ్యపు చివరి చక్రవర్తి ప్రతాపరుద్రుడు. రుద్రమదేవికి మనవడు అవుతాడు. ఆయన కథతోనే సినిమా తెరకెక్కబోతోంది. అంటే అనుష్క కు మనవడుగా చేసేది అల్లు అర్జున్ లేదా మహేష్ తేలాలి.

    Allu Arjun or Mahesh will be as Pratap Rudrudu

    'రుద్రమదేవి' విషయనికి వస్తే..

    అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'రుద్రమదేవి'. అల్లు అర్జున్‌, రానా, కృష్ణంరాజు కీలక పాత్రలు పోషించారు. గుణశేఖర్‌ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. భారతదేశపు తొలి స్టీరియోస్కోపిక్‌ త్రీడీ ద్విభాషా చిత్రమిది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. తుది దశ వీఎఫ్‌ఎక్స్‌ పనులు చేపడుతున్నారు.

    దర్శకనిర్మాత మాట్లాడుతూ '' సాంకేతికంగా సినిమాని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు మరి కొంత సమయం తీసుకుంటున్నాం. ప్రస్తుతం విజువల్‌ ఎఫెక్ట్స్‌ పనులు దేశవిదేశాల్లో చేపడుతున్నాం. తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ మెప్పించేలా ఉంటుంది. రుద్రమదేవిగా అనుష్క, పోరుగడ్డపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన కాకతీయ వీరఖడ్గం గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్‌ అభినయం ఆకట్టుకుంటుంది'' అన్నారు.

    మరో ప్రక్క గుణశేఖర్ తన తాజా చిత్రం 'రుద్రమదేవి' కి కొత్త ప్రయోగంతో ముందుకు వస్తున్నారు. కళ్లద్దాలు లేని త్రీడిలో తమ సినిమాని చూడెపడతాను అంటున్నారు. ఆ ఎక్సపీరియన్స్ పూర్తి డిటేల్స్ ఇక్కడ...

    సాధారణంగా త్రీడి సినిమాలను చూడడానికి ప్రత్యేక కళ్లజోళ్లను పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే కళ్లజోళ్లు అవసరం లేకుండానే త్రీడీ సినిమా చూడగలిగితే అనే ఆలోచనను నిజం చేయబోతున్నారు. అలాంటి ఎక్సపీరియన్స్ నే 'రుద్రమదేవి' సినిమా ఇవ్వనుంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో సరికొత్త సాంకేతిక విధానాన్ని వినియోగించారు దర్శకుడు గుణశేఖర్‌.

    'ఎన్‌హ్యాన్స్‌డ్‌ డెప్త్‌ సొల్యూషన్‌' (ఈడీఎస్‌) అనే విధానం ఉపయోగిస్తున్నారు. అమెరికాకు చెందిన 'యింగ్‌ గ్రూప్‌' సంస్థ ఆధ్వర్యంలో జేమ్స్‌ ఆష్‌బే, మైల్స్‌ ఆడమ్స్‌ బృందం ఈ పనులు నిర్వహిస్తోంది. 'కింగ్‌ కాంగ్‌', 'కుంగ్‌ ఫూ పాండా', 'ఇన్‌సెప్షన్‌', 'అవతార్‌' వంటి చిత్రాలకు త్రీడీ విభాగంలో ఈ సంస్థ పని చేసింది.

    గుణశేఖర్ మాట్లాడుతూ ''రుద్రమదేవి'ని టూడీ, త్రీడీ విధానాల్లో తెరకెక్కించారు. అయితే త్రీడీలో సినిమా చూసే అవకాశం అందరికీ ఉండదు. అన్ని ప్రాంతాల్లో థియేటర్లకు త్రీడీ కళ్లద్దాలను అందించలేని పరిస్థితి. అందుకే అందరికీ త్రీడీ అనుభూతి కలిగించాలని యింగ్‌ గ్రూప్‌ను సంప్రదించాం. వాళ్లకు త్రీడీ విధానంలో మంచి అవగాహన ఉంది. టూడీ థియేటర్లలోనూ త్రీడీ సినిమా చూస్తున్న అనుభూతిని కలిగించే ఈడీఎస్‌ విధానం గురించి చెప్పారు. అలా టూడీలో చిత్రీకరించిన సినిమాను ఈడీఎస్‌ ద్వారా మార్పు చేశాం'' అని వివరించారు.

    ఈడీఎస్‌ విధానంలో ఫొటో డెప్త్‌ను పెంచాల్సి ఉంటుంది. ఇలా చేయడానికి ప్రతి ఫ్రేమ్‌ మీద రెండు సార్లు పనిచేయాల్సి ఉంటుంది. అయితే డెప్త్‌ పెంచే క్రమంలో రీల్‌లోని బొమ్మల రంగులు మారాయి. దాంతో మరింత శ్రద్ధ తీసుకుని ఆ తేడా కనిపించకుండా చేశారు. ఫైట్ సీన్స్ విషయంలో ఈడీఎస్‌ మార్పు కష్టమైంది. అయినా జాగ్రత్తగా కొనసాగించారు. సుమారు ఎనిమిది నెలలుగా ఈ కార్యక్రమం సాగుతోంది.

    ఈడీఎస్‌ ద్వారా మార్చిన రీల్‌లో ఇమేజ్‌ షార్ప్‌నెస్‌ కొద్దిగా తగ్గినట్టు అనిపించినా సన్నివేశాలన్నీ సహజంగా కనిపిస్తాయి. మరోవైపు కళ్లజోళ్లు పెట్టుకుని చూసేలా కూడా కొన్ని ప్రింట్లను రూపొందిస్తున్నారు. మొత్తానికి 'రుద్రమదేవి' సినిమాను రెండు విధాలుగా చూడొచ్చన్నమాట.

    సుమన్‌, ప్రకాష్‌రాజ్‌, నిత్య మేనన్‌, కేథరిన్‌, ప్రభ, జయప్రకాష్‌రెడ్డి, ఆదిత్య మేనన్‌, అజయ్‌ తదితరులు నటించారు. చిత్రానికి సంగీతం: ఇళయరాజా, కళ: తోట తరణి, ఛాయాగ్రహణం: అజయ్‌ విన్సెంట్‌, మాటలు: పరుచూరి బ్రదర్స్‌, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సమర్పణ: రాగిణీగుణ.

    English summary
    Allu Arjun or Mahesh babu will be seen as Pratapa Rudrudu directed by Guna Shekar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X