» 

అల్లు శిరీష్ నెక్ట్స్ ఆ దర్శకుడుతో...

Posted by:
Give your rating:

హైదరాబాద్: ప్రస్తుతం తాను చేస్తున్న కొత్త జంట చిత్రం షూటింగ్ పూర్తై, రిలీజ్ కి దగ్గరపడుతూండటంతో తన తదుపరి చిత్రానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. రీసెంట్ గా ఓ కథ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, గీతా ఆర్ట్స్ పతాకంపై ఆ చిత్రం నిర్మించనున్నారని సమాచారం. ఆ దర్శకుడు మరెవరో కాదు ప్రేమ...ఇష్క్..కాదల్ చిత్రంతో పరిచయమైన పవన్ సాదినేని. ప్రేమ..ఇష్క్..కాదల్ చిత్రం ప్లాప్ అయినా అతని పనితనం ఓ వర్గాన్ని ఆకట్టుకుంది. దాంతో అల్లు శిరీష్ ఆ చిత్రం చూసి నచ్చి,ఈ దర్శకుడు విన్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఆ మేరకు స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఇక కొత్త జంట విషయానికి వస్తే.. ఈ చిత్రం ఆడియోని ఈ నెల మూడో వారంలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆడియోని భారీగా,సినీ పెద్దల సమక్షంలో జరపాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆడియో విడుదల తర్వాత పూర్తి ప్రమోషన్ ఏక్టివిటీస్ ప్రారంభించి విడుదల తేదీని ప్రకటించనున్నారు. బన్ని వాసు నిర్మాత. అల్లు అరవింద్‌ సమర్పకులు. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

మారుతి మాట్లాడుతూ... నేను.. నా జీవితం ఇంకేమీ వద్దు. డబ్బుంటేనే జీవితం... అది లేకపోతే ఇంకేమీ లేదు. ఇలాంటి మనస్తత్వం వారిద్దరిదీ. అనుకోకుండా కలుసుకున్నారు.. మనసులు కలుపుకొన్నారు. కానీ వారి ఆలోచనలు మాత్రం అలానే ఉన్నాయి. ఆ జంట కథే మా 'కొత్తజంట' అన్నారు . 'ఈరోజుల్లో' సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకొన్నారు మారుతి. 'బస్‌స్టాప్‌', 'ప్రేమ కథాచిత్రమ్‌' సినిమాలు విజయాల్ని సాధించాయి. ప్రస్తుతం అల్లు శిరీష్‌ హీరోగా నటిస్తున్న 'కొత్త జంట' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు శిరీశ్‌ని చాలా కాలంగా తెలిసినవాణ్ణి కాబట్టి అతని ప్లస్‌లూ, మైనస్‌లూ నాకు తెలుసు. అతని ప్లస్‌లను ఉపయోగించుకుంటూ ఈ సినిమా చేస్తున్నా అంటున్నారు దర్శక,నిర్మాత మారుతి.


నిర్మాత మాట్లాడుతూ ''ఇద్దరు స్వార్థపరులు ప్రేమిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూడొచ్చు. మారుతి నుంచి వస్తున్న మరో వినోదాత్మక చిత్రమిది. ఈ నెల మూడోవారంలో పాటల్ని విడుదల చేస్తాము. శిరీష్ బాడీలాంగ్వేజ్‌కు సరిపోయే కథతో, కొత్త లుక్‌తో దర్శకుడు చిత్రాన్ని వైవిధ్యంగా పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు''అన్నారు.

Read more about: allu sirish, kotha janta, prema ishq kaadal, అల్లు శిరీష్, ప్రేమ ఇష్క్ కాదల్, కొత్త జంట
English summary
Pavan Sadineni has got a chance to work with the prestigious Geeta Arts banner. Pavan will soon be directing a film with Allu Sirish.
Please Wait while comments are loading...
 
X

X
Skip Ad
Please wait for seconds

Bringing you the best live coverage @ Auto Expo 2016! Click here to get the latest updates from the show floor. And Don't forget to Bookmark the page — #2016AutoExpoLive