twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జగన్ మీద బాలయ్య పంచ్‌ డైలాగులు అంటూ ప్రచారం?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన ‘లయన్' చిత్రం ఈ రోజు గ్రాండ్ గా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలయ్య సీబీఐ ఆఫీసర్ పాత్ర పోషించారు. బాలయ్య పాత్ర అప్పట్లో వైఎస్ జగన్ కేసులో కీలక పాత్ర పోషించిన సీబీఐ జేడి లక్ష్మీనారాయణ తరహాలో ఉంటుందని....సినిమాలో జగన్ మీద పరోక్షంగా పంచ్ డైలాగులు పేలాయంటూ ప్రచారం జరుగుతోంది.

    గత కొంతకాలం నుండి ‘లయన్' సినిమాపై ఇలాంటి ప్రచారం ఉండటంతో....... సినిమాలో ఎలాంటి డైలాగులు ఉన్నాయి? ఎవరిని ఉద్దేశించి ఉన్నాయనే విషయం తెలుసుకోవడానికి పలువురు ఆస్తిగా థియేటర్ల వైపు అడుగులు వేస్తున్నారు. మొత్తానికి ఈ ప్రచారం సినిమాకు కలిసొస్తుందని అంటున్నారు.

    Balakrishna's Lion movie

    సినిమా గురించి..
    బాలకృష్ణ నటించిన 98వ చిత్రం ‘లయన్‌'. నూతన దర్శకుడు సత్యదేవ్‌ డైరెక్షన్‌లో రూపొంది ఈ రోజు విడుదలయింది. ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం బోస్(బాలకృష్ణ) పాత్ర చుట్టూ తిరుగుతుంది. కోమాలో ఉన్న బోస్...పద్దెనిమిది నెలల తర్వాత బయిటకు వస్తాడు. అతను రికవరీ కాగానే అందరూ అతన్ని గాడ్సే అనుకుంటూంటారు. అప్పుడు బోస్..తాను గాడ్సే ని కానని... తనకో కథ ఉందని చెప్తాడు. ఇంతకీ బోస్ ఎవరు...గాడ్సే కు ...సంభధం ఏమిటి...ఈ కన్ఫూజన్ ఏంటి... రాధికా ఆప్టే, త్రిష లకు కథలో పాత్రలేమిటి...అనేది మిగతా కథ.

    నిజాయతీని నమ్ముకొన్న సీబీఐ అధికారి అతను. అయితే 'చట్టం తనపని తాను చేసుకుపోతుంది..' తరహా రొటీన్‌ డైలాగులు చెప్పడు. చట్టం కంటే వేగంగా స్పందిస్తాడు. న్యాయస్థానాలు, న్యాయశాస్త్రాలపై నమ్మకం ఉన్నా.. తనే ఓ న్యాయస్థానమై న్యాయమూర్తిగా తీర్పులిచ్చాడు. దుర్మార్గుల్ని శిక్షించాడు. అతని కథేంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. నందమూరి బాలకృష్ణ శక్తిమంతమైన సీబీఐ అధికారిగా భిన్నకోణాల్లో నటించారు. నీతి, నిజాయతీలను ప్రాణంగా భావించే ఆయన కథ ఇది. ఆయన సమాజానికి మంచి చేయాలనే సంకల్పంతో ఓ కేసు విషయంలో అవినీతి పరుల కు వ్యతిరేకంగా పోరాడి...నాయకుడిలా మారి అక్రమార్కుల గుండెల్లో గుబులు రేకెత్తిస్తారు.

    English summary
    In th Lion movie CBI officer's role of Balakrishna is heard to be an inspiration of CBI JD Lakshminarayana, who turned responsible for YS Jagan Mohan Reddy's arrest on the charges of corruption.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X