»   » చిరు ఫ్యామిలీ వల్లే రాజమౌళిలో ఆ కసి?

చిరు ఫ్యామిలీ వల్లే రాజమౌళిలో ఆ కసి?

Posted by:
Subscribe to Filmibeat Telugu

మెగా స్టార్ చిరంజీవి వంటి పెద్ద హీరోలతో, స్టార్ హీరోలతో నేను సినిమాలు చేయను...నాని లాంటి చిన్న హీరోలతోనే వారితోనే ఇకముందు చేస్తానంటూ దర్శక ధీరుడు, టాలీవుడ్ నెం.1 డైరెక్టర్ రాజమౌళి సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. సాధారణంగా టాప్ దర్శకులంతా టాప్ స్టార్లతోనే సినిమాలు తీయాలని చూస్తారు. ప్రస్తుతం ఏ సినీ పరిశ్రమలో చూసినా అదే జరుగుతుంది. కానీ రాజమౌళి అలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటి? స్టార్ హీరోలను ఆయన ఎందుకు పక్కన పెట్టదలుచుకున్నారు? ఇందుకు ఏమైనా బలమైన కారణం ఉందా? అనే విషయాలు ఇప్పడు పరిశ్రమలో చర్చనీయాంశం అయ్యాయి.

సినీ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుసలను బట్టి మెగా ఫ్యామిలీ చేసిన నిర్వాకం వల్లనే రాజమౌళి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. 2009లో రామ్ చరణ్ హీరోగా రాజమౌళి 'మగధీర'చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తెలుగు సినీ పరిశ్రమ రికార్డులన్నీ బద్దలు కొట్టి నెం.1 హిట్ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంలోని నటీనటులు నటనతో చేసిన కృషి 20 శాతం అయితే మిగతా 80 శాతం కథ, రాజమౌళి దర్శకత్వం, విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్ అని చెప్పక తప్పదు.

అయితే సినిమా హిట్టయిన తర్వాత చిరు ఫ్యామిలీ రాజమౌళికి ప్రాధాన్యం తగ్గించే ప్రయత్నం చేసిందని, క్రెడిట్ అంతా రామ్ చరణ్‌కే దక్కేలా పబ్లిసిటీ స్టంట్ చేశారని, మెగాస్టార్ వారసత్వం వల్లే సినిమా హిట్టయిందనే ఒక వాతావరణం సృష్టించారని, ఆ కారణంగానే రాజమౌళి తన పంథాను మార్చుకున్నాడని చర్చించుకుంటున్నారు. తన ఆలోచనలకు తగిన విధంగా ఆ తర్వాత కమెడియన్ సునీల్‌ను హీరోగా పెట్టి 'మర్యాద రామన్న' చిత్రం తీసి హిట్ కొట్టాడు రాజమౌళి. తాజాగా హీరోనే లేకుండా 'ఈగ' చిత్రం తీసి సినిమా హిట్ కావాలంటే దర్శకుడిలో సత్తా ఉండాలని నిరూపించారు.

స్వయంగా చిరంజీవి పేరు ఎత్తి అలాంటి పెద్ద హీరోలకు దర్శకత్వం చేయను అని ప్రకటించడం ద్వారా......తనలో ఇంతకాలం రగులుతున్న కసిని ఆయన పరోక్షంగా వ్యక్తి పరిచాడని, తొక్కేయాలని చూస్తే నేలకు కట్టిన బంతిలా ఎగిసి పడి తన సత్తా చాటాడని పలువురు రాజమౌళి అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.

English summary
Buzz is that Rajamouli has made statement against Chiranjeevi and other star heroes as he faced bad experience regarding Ram Charan's Magadheera.
Please Wait while comments are loading...