twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘జ్యోతి లక్ష్మీ’ అవతారం ఎత్తబోతున్న చార్మి?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: హీరోయిన్‌గా అనుకున్న స్థాయికి ఎదగలేక పోయిన చార్మి....లేడీ ఓరియెంటెడ్ చిత్రాల విషయంలో మాత్రం దూసుకెలుతోంది. ఇప్పటిక మంత్ర, మంగళ లాంటి చిత్రాల్లో నటించి అలరించిన ఆమె ప్రస్తుతం 'మంత్ర 2' చిత్రం చేస్తోంది. తాజాగా ఆమెకు మరో లేడీ ఓరియంటెడ్ సినిమా చేసే అవకాశం వచ్చిందని తెలుస్తోంది.

    పూరి జగన్నాథ్ దగ్గర అసోసియేట్‌గా పని చేసిన ఓ డైరెక్టర్ చార్మికి ఈ చిత్రం కథ చెప్పినట్లు సమాచారం. దీనికి 'జ్యోతిలక్ష్మీ' అనే టైటిల్ కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. టైటిల్ బట్టి ఇది నిన్నటితరం ఐటం గర్ల్ జ్యోతి లక్ష్మి జీవితం గురించిన సినిమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

    Charmi next movie 'Jyothi Lakshmi'

    ప్రస్తుతం ఆమె నటిస్తున్న మంత్ర-2 విషయానికొస్తే..ఈ చిత్రానికి ఎస్.వి.సతీష్ దర్శకత్వం వహిస్తున్నారు. గ్రీన్ ఫిలిమ్స్ పతాకంపై కె.ఎ.రవికుమార్‌రెడ్డి సమర్పణలో పి.శౌరీరెడ్డి, వి.యాదగిరిరెడ్డి, బోనాల శ్రీకాంత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ...20 రోజులపాటు నిరవధికంగా రాత్రి సమయాల్లో షూటింగ్ చేశామని, హీరోయిన్ ఛార్మి అందిస్తున్న సహకారం మరువలేమని అన్నారు. సంగీత దర్శకుడు చక్రి అందిస్తున్న సంగీతం ఈ చిత్రానికి ప్లస్ అవుతుందని, హర్రర్, సస్పెన్స్, థ్రిల్లర్‌గా రూపొందే ఈ చిత్రాన్ని చేయడం ఆనందంగా వుందని, ఇంతవరకూ ఇలాంటి సబ్జెక్ట్‌తో ఎవరూ టచ్ చేయలేదని తెలిపారు.

    సినిమా పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తయిన తర్వాత మిగతా వివరాలు వెల్లడించనున్నారు. తనికెళ్ల భరణి, చేతన్, రాహుల్‌దేవ్, ఉత్తేజ్, ఛత్రపతి శేఖర్, ఢిల్లీ రాజేశ్వరి, వేణు, టివి-5 వేణు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: గాంధీ మనోహర్, కెమెరా: తనికెళ్ల రాజేంద్ర, సంగీతం: చక్రి, ఎడిటింగ్: సిద్ధంశెట్టి బాబు, ప్రొడక్షన్ డిజైనర్: దేశినేని శ్రీనివాస్, దర్శకత్వం: ఎస్.వి.సతీష్.

    English summary
    Film Nagar source said, Charmi next movie 'Jyothi Lakshmi'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X