twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగా స్టార్ పేరుతో డబ్బు వసూళ్లు.. రంగంలోకి పవన్ కళ్యాణ్?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుక తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు చర్చనీయాంశం అయ్యాయి. మెగా స్టార్ పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా నిర్వహించాలనే పేరుతో కొందరు అభిమానుల నుండి రూ. 5 వేల చొప్పున వసూలు చేస్తున్నట్లు, రూ. 50 లక్షల నుండి రూ. 1 వరకు టార్గెట్ పెట్టుకుని వసూలు చేస్తున్నట్లు ఫ్యాన్స్ సర్కిల్ లో ప్రచారం జరుగుతోంది.

    ఈ విషయం పవన్ కళ్యాణ్ చెవిన కూడా పడిందని సమచారం. ఇలాంటి వసూళ్ల వల్ల ఏదైనా తేడా వస్తే అన్నయ్య పేరు చెడిపోయే ప్రమాదం ఉన్నందున పవన్ కళ్యాన్ ఈ అంశం మీద దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఎవరు వసూలు చేస్తున్నారనే విషయాలు ఆరా తీసినట్లు టాక్.

    కాగా...మెగాస్టార్‌ చిరంజీవి 60వ జన్మదిన వేడుకలను ఆగస్టు 22న ఘనంగా నిర్వహించాలని అఖిల భారత చిరంజీవి యువత జాతీయ అధ్యక్షుడు స్వామినాయుడు చెప్పారు. చిరంజీవి యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అమిరిశెట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బుధవారం గుంటూరు జిల్లా చినకాకాని హాయ్‌ల్యాండ్‌లో చిరంజీవి యువత, అభిమాన సంఘాల ముఖ్య నేతల సమావేశం జరిగింది.

    Chiranjeevi 60th birthday celebration details

    ఆగస్టు 2న హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లాల ముఖ్య పట్టణాల్లో చిరంజీవి జన్మదిన వేడుకలను ప్రారంభించాలని నిర్ణయించారు. జిల్లాస్థాయిలో, రాష్ట్రస్థాయిలో పాటలు, నృత్య పోటీలు నిర్వహించాలన్నారు. సమావేశంలో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల నుంచి చిరంజీవి అభిమాన సంఘాల నాయకులు పాల్గొన్నారు.

    ఈ వసూళ్ల గొడవ పక్కన పెట్టి చిరంజీవి 150వ సినిమా వ్యవహారంలోకి వెళితే.... ఈ సినిమా ఆయన పుట్టిన రోజున అంటే ఆగస్టు 22 న ఈ చిత్రం ప్రారంభం జరగనుందని సమాచారం. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయన 150 వ చిత్రం గురించి ఎన్నో కథలు,కథనాలు మీడియాలో వచ్చాయి...వస్తూనే ఉన్నాయి. నేటికీ చిరంజీవి అవుననలేదు...కాదనలేదు. ఆయన మాత్రం తన శరీరాన్ని సినిమాకు తగినట్లు మార్చుకునే పనిలో పడిపోయారు. అదే స్పీడులో స్క్రిప్టుని సైతం ఓకే చేసి రోజూ ఆ స్క్రిప్టు పై కూర్చుంటున్నట్లు సమాచారం.

    చిరంజీవి 150వ చిత్రానికి పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. అందుకే 'ఆటోజానీ' టైటిల్‌ను పూరి రిజిస్టర్‌ చేయించారు. ఈ కథను ప్రముఖ రచయిత బీవీఎస్‌ రవి అందిస్తారు. గత కొంతకాలంగా ఈ కథపై చిరు, పూరి, రవి కసరత్తులు చేస్తున్నారని తెలిసింది. ఇప్పుడు కథ పూర్తిస్థాయిలో సిద్ధమైందట.

    English summary
    Chiranjeevi 60th birthday celebration in grand way. It is believed that Chiru’s family, especially his son Ram Charan and wife are very keen on celebrating Chiru’s ‘Shashtipurthi’ on a lavish scale.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X