»   » ఆ నిర్మాతలు గోల: కొత్త నోట్లే కావాలి, కానీ వైట్ గా వద్దంటున్నారు,ఎక్కడనుంచి తెస్తాం

ఆ నిర్మాతలు గోల: కొత్త నోట్లే కావాలి, కానీ వైట్ గా వద్దంటున్నారు,ఎక్కడనుంచి తెస్తాం

స్టార్ హీరోలే కాకుండా ఓ మాదిరి నటీ నటులకు సైతం ఏ రోజు ఏ రైడ్ జరుగుతుందని భయపడుతున్నారట.

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు, ఆ తర్వాత పరిణామాలు సినీ జనాలను భయబ్రాంతలను చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా బ్లాక్ మనీతో నడిచే నడిచే ఇండస్ట్రీగా పేరు తెచ్చుకున్న గత కొద్ది రోజులుగా ఇబ్బందులును ఎదుర్కొంటోంది. ఇదిలా ఉంటే మరో ప్రక్క సిని సెలబ్రెటీలకు ఇనకం టాక్స్ రైడ్స్ భయం పట్టుకుందని సమాచారం.

మన తెలుగు స్టార్ హీరోలు కొందరు ఈ విషయమై ఇప్పటికే తమ ఆడిటర్స్ తో చర్చలు జరిపారని చెప్పుకుంటున్నారు. అయితే ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటునేదాన్ని బట్టి కేవలం స్టార్ హీరోలకే కాకుండా ఓ మాదిరి నటీ నటులకు సైతం ఇదే భయం ఏర్పడింది. ఏ రోజు ఏ రైడ్ జరుగుతుందని భయపడుతున్నారట.దాంతో కొందరు బిజేపి వైపు అడుగులు వేసే ఆలోచనలో ఉన్నారట.

Cinema celebrities feared about Income Tax raids

మరో ప్రక్క బాహుబలి పై ఐటీ రైడ్ తర్వాత బడా నిర్మాతలు సైతం భయభ్రాంతలు అవుతున్నారట. పెద్ద సినిమా చేసేటప్పుడు భారీ ఎత్తున డబ్బు అవసరం అవుతుంది. లెక్కలు అవి సినిమా రిలీజ్ అయ్యాక మెల్లిగా ఇన్నాళ్లూ చూసుకుంటాం..మధ్యలో ఇలా రైడ్ లు చేసి, లెక్కలు చెప్పమంటే చాలా కష్టం. పబ్లిసిటీ నుంచి సెట్ లో లైట్ బోయ్ దాకా అందరూ వైటే కావాలంటే ఎలా చచ్చేది..ఎక్కడ నుంచి తెచ్చేది అని నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు.

ముఖ్యంగా రిలీజ్ కు తమ సినిమాలు దగ్గరపడిన వారి పరిస్దితి మరీ ఘోరం, మీడియా వాళ్లు సైతం తమ పత్రికలలో, తమ టీవి ఛానెల్స్ లో పబ్లిసిటీకు కొత్త నోట్లు అడుగుతున్నారని, పరిస్దితి బయిట ఎలా ఉందో తెలిసినా వారు మాత్రం కొత్త నోట్లు కావాలని, అదీ లెక్క చూపని మనీ కావాలంటున్నారని వాపోతున్నారు.

English summary
After Demonetisation, Cinema celebrities feared about Income Tax raids and trying to join in BJP.
Please Wait while comments are loading...