twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ సెటైర్స్ అన్నీ రామ్ చరణ్ ని ఉద్దేశించేనా?

    By Srikanya
    |

    హైదరాబాద్: గతంలో రామ్ చరణ్ ని ఉద్దేశించి వ్యంగ్య బాణాలు వదిలిన దర్శకరత్న దాసరి నారాయణ రావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి కూడా అవి రామ్ చరణ్ సినీ ఇండస్ట్రీలో వినపడుతోంది. ఆయన సెటైర్స్ ...రీసెంట్ గా విడుదలైన రామ్ చరణ్ చిత్రం గోవిందుడు అందరి వాడేలే గురించి అని అంటున్నారు. గోవిందుడు విడుదల కోసం లౌక్యం థియోటర్స్ తీసేసారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే దాసరి ఇలా సెటైర్స్ విసిరారని అంటున్నారు.

    దాసరి ..ఇండస్ట్రీలో గూండాయిజం నడుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. 'లౌక్యం' సినిమా విజయవంతంగా నడుస్తున్నప్పటికీ ఓ అగ్ర హీరో సినిమా కోసం దాన్ని తీసివేశారని ఆరోపించారు. అయితే, ఆ సినిమా మూడు రోజులు కూడా ఆడలేదని ఎద్దేవా చేశారు. ఇలాంటి పరిస్థితులను గతంలో తానెన్నడూ చూడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాదులో 'లక్ష్మీ రావే మాయింటికి' అనే సినిమా ఫంక్షన్లో పాల్గొన్న దాసరి ఈ వ్యాఖ్యలు చేశారు.

    దాసరి మాట్లాడుతూ -‘‘ప్రస్తుతం చిత్రపరిశ్రమలో రౌడీయిజం నడుస్తోంది. పెద్ద సినిమాల కోసం చిన్న సినిమాలను బలి చేస్తున్నారు. ఆ మధ్య విడుదలైన ‘లౌక్యం' సినిమా అద్భుతమైన వసూళ్ల రాబడుతూ, ముందుకెళుతున్న సమయంలో ఓ పెద్ద హీరో కోసం ఐదో రోజున 37 సెంటర్లలో ఆ సినిమా తీసేశారు. కానీ, ఆ హీరో సినిమా మూడు రోజులు కూడా ఆడలేదు. దాంతో మళ్లీ ‘లౌక్యం' చిత్రాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టారు'' అన్నారు.

    Dasari attacks Ram Charan yet again!!

    సినిమా పరిశ్రమకు వారసులే కాదు ఎవరైనా రావొచ్చని దాసరి అన్నారు. ‘‘వారసులు రావడం తప్పు కాదు. కానీ, సినిమా మీద సినిమా తీసి వాళ్లను జనాల మీద రుద్దడం తప్పు. ‘అసలు ప్రస్తుతం పరిశ్రమ ఉన్న పరిస్థితుల్లో సినిమా తీయడం గొప్ప కాదు. థియేటర్లు దక్కించుకోవడం ముఖ్యం'' అని దాసరి పేర్కొన్నారు.

    మరి దీనికి రామ్ చరణ్ ఏం కౌంటర్ ఇస్తాడో చూడాలి అంటున్నారు. అక్టోబర్ 1న విడుదలైన 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం మార్నింగ్ షోకే మిక్సెడ్ టాక్ తెచ్చుకుంది. మెగాభిమానులు సైతం ఈ చిత్రం హిట్టా...ఫ్లాఫ్ అన్న విషయం తేల్చుకోలేనంత సందిగ్దంలో పడేసింది. మరో ప్రక్కన నిర్మాత బండ్ల గణేష్ మాత్రం అటువంటి సందేహాలు ఏమీ పెట్టుకోవద్దంటూ నలభై కోట్ల మార్కు దాటేసిందని చెప్పారు.

    అయితే ట్రేడ్ వర్గాల్లో చెప్పుకునేదాన్ని బట్టి ఈ చిత్రం ఇరవై నుంచి ముఫ్పై శాతం దాకా లాస్ తెచ్చి పెట్టిందని చెప్పుకుంటున్నారు. దానికి తోడు ప్రమేషన్ ఆపు చేయటం, తుఫాన్ ఎఫెక్టు కూడా సినిమాని కలెక్షన్ వైజ్ గా దెబ్బ తీసాయంటున్నారు. ఎంటర్టైన్మెంట్ పెంచి, పాటలు బాగుండి ఉంటే ఖచ్చితంగా లాభాలు వచ్చేవని చెప్తున్నారు. మొదట్లో శెలవలు వచ్చినా తర్వాత ఫలితం లేకుండా పోయిందంటున్నారు.

    చిత్రం కథలో ...లండన్‌లో పుట్టి పెరిగి అక్కడి సంస్కృతి, సంప్రదాయాలకు అలవాటు పడిన అభిరామ్ అనే యువకుడు తన మూలాల్ని వెతుక్కుంటూ ఓ అందమైన తెలుగు పల్లెకు వస్తాడు. అక్కడ అతను సరికొత్త జీవితాన్ని దర్శిస్తాడు. పల్లె అప్యాయతలు, అనుబంధాలకు ముగ్ధుడవుతాడు. అభిరామ్ అందరివాడనిపించుకుంటాడు. విడిపోయిన తన కుటుంబాన్ని కలుపుతాడు. తన తాతని, తండ్రిని, బాబాయిని ఏకం చేస్తాడు. ఈ క్రమంలో జరిగే భావోద్వేగభరిత సంఘటనల సమాహారమే గోవిందుడు అందరివాడేలే చిత్ర ఇతివృత్తం.

    ఆయన దర్శకత్వంలో రామ్‌చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మించారు. శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ ముఖ్య పాత్రల్ని పోషించారు. అయితే కామెడీ పెద్దగా లేకపోవటం, ఆడియో కూడా పెద్ద ఆదరణ పొందకపోవటం ఈ చిత్రం విజయానికి ప్రధాన అడ్డంకిగా మారాయి.

    ప్రకాష్‌రాజ్, జయసుధ, ఎం.ఎస్.నారాయణ, పరుచూరి వెంకటేశ్వరరావు, రఘుబాబు, పోసాని తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సమీర్ రెడ్డి, సంగీతం: యువన్‌శంకర్‌రాజా, ఆర్ట్: అశోక్‌కుమార్, ఎడిటింగ్: నవీన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, రామ్‌లక్ష్మణ్, రచన: పరుచూరి బ్రదర్స్, దర్శకత్వం: కృష్ణవంశీ.

    English summary
    Darsakaratna targeted Ram Charan yet again.Dasari: " Despite fantastic reports, 'Loukyam' has been removed from 37 main centres on Day 5 just because a so called Star Hero's film has arrived. The star studded flick didn't even run for more than 3 days and 'Loukyam' has replaced it then. I am speaking truth but not exaggerating".
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X