twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    `పిల్లా నువ్వు లేని జీవితం' ...టెమ్ట్ అయితే సర్వ నాశనం

    By Srikanya
    |

    హైదరాబాద్ : సాయిధరమ్‌తేజ్‌ హీరోగా లాంచ్ అవుతూ చేసినచిత్రం `పిల్లా నువ్వు లేని జీవితం' మొన్న శుక్రవారం విడుదల అయ్యిది. రెజీన హీరోయిన్ గా చేసిన ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్-శ్రీ వెంకటేశ్వర క్రియేషన్‌‌స సంయుక్తంగా నిర్మించాయి. బన్ని వాసు-శ్రీ హర్షిత్‌ నిర్మాతలు. ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి దర్శకుడు. అనూప్‌ రూబెన్‌‌స సంగీతం అందించారు. ఈ చిత్రం మార్నింగ్ షోకే మంచి టాక్ తెచ్చుకుంది. దాంతో థియోటర్ కు వెళ్లలేని లేదా వెళ్లటం ఇష్టపడని ఉత్సాహవంతులు కొందరు...టోరెంట్ సైట్స్ ని ఎప్పటిలాగే వెతకసాగారు.

    అక్కడ వారికి రెండు గంటల ఇరవై నిముషాలు ఉన్న కెమెరా ప్రింట్ ఉంది. దాన్ని చూసిన వారు ఉత్సాహంతో డౌన్ లోడ్ చేసుకున్నారు. తర్వాతే అసలు ట్విస్ట్ పడింది. దాన్ని డౌన్ లోడ్ చేసుకున్న వారి సిస్టమ్ లు క్రాష్ అయ్యాయి. అంతేకాకుండా హార్డ్ డిస్క్ లోని మ్యాటర్ సైతం దొంగతనం జరిగింది. ఏంటా అని విషయం ఆరా తీస్తే...ఆ సినిమా పేరుతో ... ఓ భయంకరమైన వైరస్ ని అప్ లోడ్ చేసారని సమాచారం. దాంతో టెమ్ట్ అయ్యిన వారు సిస్టమ్ లు సర్వ నాశనమవుతున్నాయి..కాబట్టి అలాంటి టోరెంట్ లు జోలికి వెళ్లక పోవటమే ఉత్తమం. సాధ్యమైనంతవరకూ థియోటర్ లో చూడండి..పైరసీ ని ఎంకరేజ్ చేయకండి..చేసి ఇలాంటి సమస్యల పాలు కాకండి.

     Deadly Virus In The Name Of Pilla Nuvvu Leni Jeevitham

    ఈ చిత్రం కథలో గంగ ప్రసాద్(షాయీజీ షిండే), ప్రభాకర్(ప్రకాష్ రాజ్) ఇద్దరూ పొలిటీషన్స్...బద్ద శత్రవులు. సిఎం పోస్ట్ కోసం పోటీ పడుతూంటారు. ఈ లోగా వై ఛానెల్ ఇన్విస్టిగేటివ్ జర్నలిస్టు షఫీ... వీరిద్దరు గురించి కొన్ని నిజాలు వెలికి తీస్తాడు. దాంతో ఆ జర్నలిస్టు ని, మరో అమ్మాయిని చంపేయటానికి ఓ రౌడీ మైసమ్మ(జగపతిబాబు)కి సుపారి ఇస్తారు. దాంతో మైసమ్మవారిని చంపేయటానికి వెతుకుతూంటాడు. ఈ లోగా పాలకొల్లు నుంచి వచ్చిన శ్రీను(సాయి ధరమ్ తేజ) మైసమ్మ డైన్ లోకి వచ్చి తనని చంపేయమని అంటాడు. షాకైన మైసమ్మ ఎందుకలా అన్నావు అనిడిగే... తనకు సిరి(రెజీనా)తో ఉన్న లవ్ స్టోరీ ని చెప్తాడు. అంతేకాకుండా... ఓ షాకింగ్ ట్విస్ట్ ని రివిల్ చేస్తాడు. ఆ షాకింగ్ ట్విస్ట్ ఏమిటి... మైసమ్మ చంపుదామనుకున్న అమ్మాయి ఎవరు.. అసలు దీని వెనక ఉన్న అసలు నిజం ఏమిటనేది మిగతా కథ.

    ఇక ఈ చిత్రం 400 థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం రిలీజైంది. ఈ సినిమాపై రిలీజ్ కు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నిర్మాతగా 50 సినిమాలు తెరకెక్కించా. నేను నిర్మించిన 50సినిమాలు ఒక ఎత్తు. పిల్లా నువ్వు లేని జీవితం ఇంకో ఎత్తు. పెద్ద విజయం సాధిస్తుంది అన్నా మెగా నిర్మాత అల్లు అరవింద్‌. ఈ సినిమా గొప్ప ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరి. సాయిధరమ్‌ తేజ్‌ హీరోనే కాదు స్టార్‌ మెటీరియల్‌ అని నిరూపించే సినిమా ఇది. తప్పక విజయం సాధిస్తామని ధీమాగా చెబుతున్నారాయన.

    మరో నిర్మాత దిల్‌రాజు సైతం సాయిధరమ్‌పై పెద్ద రేంజులో ప్రశంసలు కురిపించారు. బన్నికి `ఆర్య'లా, నితిన్‌కి `దిల్‌'లా, చరణ్‌కి `మగధీర' లా సాయిధరమ్‌కి `పిల్లా నువ్వు లేని జీవితం' అంటూ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సాయిధరమ్‌ డ్యాన్సింగ్‌ స్టయిల్‌, ఎనర్జీ ఈ సినిమాకి పెద్ద అస్సెట్‌ అవుతాయని రెజీన చెబుతోంది. ఇద్దరు అభిరుచి ఉన్న నిర్మాతల కలయికలో వచ్చిన సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి.

    English summary
    Some miscreants have uploaded deadly 'virus' programs in the name of "Pilla Nuvvuleni Jeevitham".
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X