twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాహుబలి-2 : దిల్ రాజును ఎందుకు తప్పించారు? కావాలనే చేసారా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: 'బాహుబలి-ది బిగినింగ్' గతేడాది విడుదలై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమలోని అన్ని రికార్డులను ఈ సినిమా బద్దలు కొట్టింది. బాహుబలి పార్ట్-1ను నైజాం ఏరియాకు సంబంధించి దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దక్కించుకున్నాడు. దీని ద్వారా దిల్ రాజు భారీగానే లాభాలు ఆర్జించాడు కూడా.

    అయితే బాహుబలి-2 నైజాం రైట్స్ దిల్ రాజుకు దక్కలేదు. ఏషియన్ ఎంటర్‌ప్రైజెస్ వారు భారీ ధరకు కొనుగోలు చేసారు. నైజాం రైట్స్ ఏషియన్ ఎంటర్‌ప్రైజెస్ అధినేతలు నారాయణదాస్ నారంగ్, సునీల్ నారంగ్ రూ. 50 కోట్ల ఫ్యాన్సీ రేటుకి దక్కించుకున్నారు. ఇంత భారీ మొత్తానికి హక్కులను దక్కించుకోవడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

    దిల్ రాజును కావాలనే తప్పించారా?

    దిల్ రాజును కావాలనే తప్పించారా?

    బాహుబలి-2 రైట్స్ కూడా దిల్ రాజే దక్కించుకుంటాడని అంతా అనుకున్నారు. ఏషియన్ వారు దక్కించుకోవడంతో అంతా షాకయ్యారు. దిల్ రాజుకు రూ. 50 కోట్లు పెట్టే సత్తా ఉన్నా ఎందుకు? వెనక్కి తగ్గారో అంటూ జనాలు చర్చించుకున్నారు. కానీ తాజాగా ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. కావాలనే బాహుబలి-2 నిర్మాతలు దిల్ రాజుకు ఇవ్వలేదనే వార్తలు వినిపిస్తున్నాయి.

    దిల్ రాజు చేతులారా చేసుకున్నాడా?

    దిల్ రాజు చేతులారా చేసుకున్నాడా?

    దిల్ రాజుకు బాహుబలి-2 రైట్స్ దక్కక పోవడానికి కారణం.... దిల్ రాజు తీరే అని ఫిల్మ్ నగర్ టాక్. బాహుబలి పార్ట్-1 బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్ తర్వాత నైజాం ఏరియాలో సినిమా ఎంత వసూలు చేసిందనే విషయమై సరైన వివరాలు నిర్మాతలకు ఇవ్వలేదట దిల్ రాజు. ఈ విషయంలో దిల్ రాజుపై నిర్మాతలు గుర్రుగా ఉన్నారట.

    అందుకే తప్పించారా?

    అందుకే తప్పించారా?

    సాధారణంగా ఏ సినిమా అయినా ఎంత వసూలు చేసిందనే వివరాలు డిస్ట్రిబ్యూటర్.... నిర్మాతలకు తెలియజేయాల్సి ఉంటుంది. దిల్ రాజు ఈ విషయంలో తేడాగా ప్రవర్తించడంతో నిర్మాతలతో విబేధాలు వచ్చాయని, అందుకే దిల్ రాజుకు బాహుబలి-2 రైట్స్ కావాలనే ఇవ్వలేదని అంటున్నారు.

    బాహుబలి పార్ట్-1 నైజాం షేర్

    బాహుబలి పార్ట్-1 నైజాం షేర్

    గతంలో దిల్ రాజు నైజాం ఏరియా బాహుబలి రైట్స్ రూ. 25 కోట్లకు కొనుగోలు చేయగా రూ. 43 కోట్ల షేర్ వసూలు చేసింది. అందుకే ఈ సారి నిర్మాతలు బాహుబలి-2 రైట్స్ రూ. 50 కోట్లకు ఫిక్స్ చేసారు.

    ఓవర్సీస్

    ఓవర్సీస్

    ఇప్పటికే ఉత్తర అమెరికా (ఓవర్సీస్)లో ‘బాహుబలి-2' సినిమా హక్కులను రూ.45 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

    విడుదల తేదీ

    విడుదల తేదీ

    బాహుబలి-2 రిలీజ్ డేట్ ఆల్రెడీ ఖరారైంది. బాహుబలి రెండో పార్ట్ హిందీ వర్షెన్ 2017, ఏప్రిల్ 28న విడుదలవుతున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు. రాజమౌళి దర్శకత్వంలో గతేడాది వచ్చిన పార్ట్ 1 'బాహుబలి-ది బిగినింగ్' చూసిన ప్రతి ఒక్కరూ.... పార్ట్ 2 'బాహుబలి-ది కంక్లూజన్' ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    ‘బాహుబలి-2' ఫుల్ స్టోరీ లీక్... సోషల్ మీడియాలో వైరల్!

    ‘బాహుబలి-2' ఫుల్ స్టోరీ లీక్... సోషల్ మీడియాలో వైరల్!

    <strong>‘బాహుబలి-2' ఫుల్ స్టోరీ లీక్... సోషల్ మీడియాలో వైరల్.... పూర్తి వివరాలకోసం క్లిక్ చేయండి.</strong>‘బాహుబలి-2' ఫుల్ స్టోరీ లీక్... సోషల్ మీడియాలో వైరల్.... పూర్తి వివరాలకోసం క్లిక్ చేయండి.

    English summary
    Dil Raju missed out Baahubali, what is the reason?. Earlier Raju has bought Nizam rights of Baahubali: The Beginning for a whopping 23 crores on NRA basis. Later the film has made nearly 40 crores share from Nizam alone, thereby pushing Raju into massive profits.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X