twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కుర్ర డైరక్టర్ కు అడ్వాన్స్ లు...ఆఫర్స్

    By Srikanya
    |

    హైదరాబాద్ : శుక్రవారం వచ్చిదంటే సినిమావాళ్ల జాతకాలలో మార్పులు వస్తాయి. ఓ సినిమా బాగుందని టాక్ వస్తే... ఆ చిత్రం దర్శకుడు ఎవరనేది ఎంక్వైరి చేయటం...కాదనలేని ఆఫర్ తో వారిని తమ ప్రాజెక్టులోకి తీసుకోవటం ఇండస్ట్రీ నైజం.అలాంటి పరిస్ధితినే కార్తికేయ దర్శకుడు చందు మొండేడి ఎదుర్కొంటున్నాడని ఇన్ సైడ్ టాక్. ఇంతకుముందు మారుతి, సుధీర్ వర్మ, మేర్లపాక మురళి, విరించి వర్మ ఇలాంటి క్రేజ్ ని తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ చిన్న చిత్రంతో దర్శకుడు జాతకం మారబోతోందని అంటున్నారు.

    రీసెంట్ గా నాగార్జున కార్తికేయ చిత్రం చూసి తన అన్నపూర్ణ స్టూడియోస్ కి వచ్చి కథ చెప్పమని దర్శకుడుకి ఆఫర్ ఇచ్చాడని టాక్. కథ నచ్చితే తను కానీ నాగచైతన్య గానీ చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా అశ్వనీదత్ వంటి పెద్ద ప్రొడ్యూసర్ సైతం ఈ చిత్రం దర్శకుడుకు ఫోన్ చేసి ఆఫర్ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. లౌక్యం నిర్మాత ఆనంద ప్రసాద్ సైతం ఈ దర్శకుడుతో చేయటానికి ఆసక్తి చూపిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు చెప్తున్నాయి. అయితే వీటిలో ఎంత నిజముందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

    నిఖిల్, స్వాతి జంటగా నటించిన సినిమా ‘కార్తికేయ'. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ సినిమా తెలుగు వెర్షన్ దీపావళి కానుకగా అక్టోబర్ 24న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ట్రైలర్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై అంచనాలు బాగా ఏర్పడ్డాయి. అందువలనే ఈ సినిమా నిఖిల్ కెరీర్లోనే అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. అయితే టాక్ మాత్రం డివైడ్ గా వచ్చింది. ఊహించినంత థ్రిల్ మాత్రం చిత్రం ఇవ్వలేకపోయిందని చాలా మంది పెదవి విరిచారు. అయితే దర్శకుడు కథని డీల్ చేసిన విధానం బాగుందని,ముఖ్యంగా టెక్నికల్ గా చాలా సౌండ్ గా ఉందని, డైలాగులు బాగున్నాయని ఇనానమస్ గా చెప్పుకోవటం ఇప్పుడు దర్శకుడుకి కలిసి వస్తోంది.

     Director Chandoo Mondeti Getting too Many Calls

    నిఖిల్ సూపర్ హిట్ సినిమా అయిన ‘స్వామి రారా' సుమారు 130 థియేటర్స్ లో విడుదలైంది. ఇప్పుడు వస్తున్న కార్తికేయ దానికి డబుల్ గా అనగా సుమారు 250కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. ఇక్కడ మాత్రమే కాకుండా యుఎస్ లో కూడా ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేసారు.

    ఆంధ్ర - తమిళనాడు బార్డర్లో ఒక టెంపుల్ చుట్టూ తిరిగే ఈ థ్రిల్లర్ కథలో విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఈ సినిమా ద్వారా చందు మొండేటి దర్శకుడిగా పరిచయం అయ్యారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించారు.

    అలాగే ఈ రోజు (మంగళవారం) హైదరాబాద్ లోని థియేటర్లలో ‘కార్తికేయ' మూవీ టీం సందడి చేయనున్నారు. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు విమర్శకుల ప్రసంశలతో పాటు ప్రేక్షకుల ఆదరణ లభించింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కూడా బాగున్నాయి. ఇంతటి ఘనవిజయం అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేయడానికి సిటీ టూర్ ప్లాన్ చేశారు.

    ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ లో గల దేవి థియేటర్లో మార్నింగ్ షో టికెట్స్ ను నిఖిల్ & టీం సేల్ చేయనున్నారు. తర్వాత శ్రీరాములు, శివపార్వతి, మేఘ, ప్రసాద్ ఐ మాక్స్ థియేటర్లను విజిట్ చేస్తారు. ఈ విషయాన్ని హీరో నిఖిల్ ట్విట్టర్ లో వెల్లడించారు. ‘స్వామి రా రా' సినిమా విజయం తర్వాత నిఖిల్ అదే తరహా జోనర్ లో ‘కార్తికేయ'తో మంచి హిట్ అందుకున్నాడు.

    English summary
    As per reports many top production houses showing interest to rope Chandoo Mondeti( who thrilled audience with his directorial skills in Karthikeya) for their productional ventures and Nagarjuna who known for encouraging new talent reportedly gave call to Chandoo.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X