twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అఖిల్ లాంచింగ్ వాయిదా...దర్శకుడి తల్లి అనారోగ్యం??

    By Srikanya
    |

    హైదరాబాద్ : అఖిల్ లాంచింగ్ ఎపుడెప్పుడా అని అక్కినేని అభిమానులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. నవంబర్ 14 న లాంచింగ్ అవుతుందనుకున్నాకు ఆ దిసగా ప్రయత్నాలు ఏమీ కనపడటం లేదు. ఎందుకంటే వాయిదా వేసారని తెలిసింది. ఈ నేపధ్యంలో లేటుకు అసలు కారణమంటూ ఓ వార్త వచ్చింది. అది దర్శకుడుగా ఎంపిక కాబడ్డ వినాయిక్ తల్లికి హెల్త్ బాగోలేందంటూ...అయితే అది ఎంతవరకూ నిజమో తెలియదు. మీడియాలో,సినీ వర్గాల్లో వినిపిస్తున్న మాట ఇది.

    మరో ప్రక్క అఖిల్ ఫిజిక్ ని కూడా పికప్ చేయమన్నాడని చెప్తున్నారు. తమ సబ్జెక్టులో అఖిల్ ఫైట్స్ అవీ చేస్తాడు కాబట్టి దానికి తగ్గ ఫిజిక్ ఉంటే బాగుంటుందని, ఫొటో షూట్ చేసిన వినాయిక్ భావించి, ఆ దిసగా అఖిల్ ని ప్రిపేర్ అవమన్నాడని మరో వర్గం అంటోంది. అయితే ఇందులో ఏది నిజమో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

    ఇక ఈ చిత్రాన్ని నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి కో ప్రొడ్యూసర్ గా నిర్మించనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రూపొందనుంది. ఈ చిత్రానికి వెలగొండ కథ అందిస్తూంటే, కోన వెంకట్ మాటలు అందిస్తున్నట్లు వినికిడి. ఈ చిత్రం కోసం వినాయిక్ 15 కోట్లు వరకూ డిమాండ్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.

    ఇక రామ్ చరణ్ ...మనంలో అఖిల్ ని చూసి ప్రశంశల్లో ముంచెత్తారు. అఖిల్ యు వర్ సూపర్బ్ అన్నారు. మంచు మనోజ్ అయితే ఐ యామ్ ఎ ఫ్యాన్ ఆఫ్ అఖిల్ నౌ అంటున్నాడు. నితిన్ మాట్లాడుతూ...అఖిల్ మై బ్యూటీ...ఐ లవ్ యూ అని ట్వీట్ చేసారు నితిన్.

    Director’s mother health caused delay for Akhil

    మహేష్ బాబు కూడా ఇదే రకమైన స్పందన తన ట్విట్టర్ ద్వారా వెలుబుచ్చారు. ‘ సినిమా చివర్లో అఖిల్ అతిథి పాత్రలో ఎంట్రీ ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ కుర్రాడి స్క్రీన్ ప్రజెన్స్ అద్భుతంగా ఉంది. భవిష్యత్‌లో స్టార్‌గా ఎదుగుతాడు' అంటూ మహేష్ బాబు ట్వీట్ చేసారు.

    అఖిల్ మాట్లాడుతూ...ఇక ఇప్పటికే నటనలో శిక్షణ పొందాను. థాయ్‌లాండ్‌లో తైక్వాండో శిక్షణ తీసుకున్నాను. రెండేళ్ల నుంచి డ్యాన్స్‌ తరగతుల్లో పాల్గొంటున్నాను. క్రికెట్‌ కూడా ఆడుతున్నాను. డ్యాన్స్‌, క్రికెట్‌ బాడీ స్వింగ్‌కు బాగా ఉపయోగపడతాయి. ఏం చేసినా పరిశ్రమలో అగ్రస్థానానికి చేరాలన్నదే నా కల. అందుకే కాస్త ఆలస్యమైనా అన్నింటా మేటిగా తయారై వస్తున్నాను అన్నారు.

    'మనం'లో అఖిల్‌ కనిపించేది 30 సెకన్లే. అది చూసి అంచనాకు రాలేం. 30 సెకన్ల వాణిజ్యప్రకటనలో అందరూ అందంగానే కనిపిస్తారు. పూర్తిస్థాయి హీరోగా ఎలా రాణిస్తాడో చూడాలి అంటున్నారు నాగార్జున. ఆయన రెండో కుమారుడు అఖిల్ హీరోగా లాంచ్ కాబోయే చిత్రం పై అంతటా ఎక్సపెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. ఈ నేపధ్యంలో నాగార్జున పుత్రోత్సాహంతో ఇలా స్పందించారు.

    అలాగే నవ్వుతూ... ''అఖిల్‌ మరో మహేష్‌ అవుతాడు.. అంటుంటే అంతకంటే ఆనందం ఉంటుందా? ఇంకొంతమంది చైతూకి పోటీ వస్తున్నాడా? అని అడుగుతున్నారు. చైతన్య సంగతి పక్కన పెట్టండి. అఖిల్‌కి పోటీగా నేనున్నాను కదా.? నన్ను దాటమనండి.అఖిల్‌కి తనపై తనకు నమ్మకం ఎక్కువ. చిన్నతనం నుంచి ఇలాగే కాన్ఫిడెన్స్‌గా ఉండేవాడు. అఖిల్‌ సినిమాకి నేనే నిర్మాత అని అన్నారు.

    English summary
    VV Vinayak wil direct the Akhil debut movie and the makers planning to launch it on grand scale on Nov 14 th. But now, we learnt that this event is postponed by few more days because of Vinayak mother’s unhealthy condition.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X