twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగు పెద్ద హీరోలు- శాటిలైట్ రేట్స్ (ఫోటో ఫీచర్)

    By Srikanya
    |

    హైదరాబాద్ : తెలుగు సినిమాల శాటిలైట్‌ హక్కులకూ గిరాకీ బాగుంది. పవన్‌ కల్యాణ్‌, మహేష్‌బాబు, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌.. వీరికే కాదు అల్లరి నరేష్‌లాంటి హీరోల సినిమాలకూ మంచి ధరే లభిస్తోంది. ఇక్కడ బుల్లితెర వీక్షకులు వినోదాత్మక చిత్రాలకు ఓటేస్తున్నారు. 'అత్తారింటికి దారేది', '1' చిత్రాలకు అత్యధిక రేటు లభించిందని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు చెబుతున్నాయి. నాగార్జున 'భాయ్‌' కూడా మంచి రేటు పలికింది. ''పెద్ద సినిమాలకు శాటిలైట్‌ మార్కెట్‌ ఎలాగూ బాగుంటుంది. ఈమధ్య చిన్న సినిమాలకూ ఆకర్షణీయమైన మొత్తం లభిస్తోంది. అది నిర్మాతలకు కొండంత భరోసా ఇస్తోంది. శాటిలైట్‌ ద్వారా సగం పెట్టుబడి రాబట్టుకొంటే చాలు. చిన్న సినిమాలకు వూపిరి పోసినట్టే'' అని విశ్లేషకులు చెబుతున్నారు.

    తెలుగు సినిమా వ్యాపారం కొత్త పుంతలు తొక్కుతోంది. తన మార్కెట్‌ని ఎప్పటికప్పుడు విస్తృతపరచుకొంటోంది. ఆడియోకి మార్కెట్‌ లేదు.. వాటి వల్ల పైసా కూడా రావడం లేదని గగ్గోలు పెడుతున్నారు గానీ, రింగుటోన్లు హలో ట్యూన్లు అంటూ కొత్త మార్గాలు అన్వేషించుకొంటూనే ఉన్నారు. ట్రైలర్‌, టీజర్‌ అంటూ అభిమానుల్ని వూరిస్తున్నారు. అవి కూడా నిర్మాతలకు ఆదాయ మార్గాలే. నిర్మాతలకు అతి ప్రధానమైన ఆదాయ వనరు... శాటిలైట్‌.

    ఇది వరకు, బుల్లితెర మాధ్యమం ఇంత విస్తారంగా లేని రోజుల్లో శాటిలైట్‌ హక్కులకు అంత డిమాండ్‌ ఉండేది కాదు. 'ఎంతో కొంత వచ్చిందిలే' అనుకొనేవారు. ఇప్పుడు ఛానళ్లు పుట్టగొడుగుల్లా పెరిగాయి. దాంతో శాటిలైట్‌ మార్కెట్‌కు రెక్కలొచ్చాయి. సినిమా హక్కుల్ని కోట్లుపోసి కొంటున్నారు. కేవలం శాటిలైట్‌ హక్కుల కోసమే సినిమాలు తీసే నిర్మాతలూ ఉన్నారు. టాలీవుడ్‌లో అయితే ఏ సినిమా ఎప్పుడు వస్తుందా? అని ఛానళ్లు ఎదురుచూస్తున్నాయి. ఈ నేపధ్యంలో శాటిలైట్ లో క్రేజ్ తెచ్చుకున్న లేటెస్ట్ క చిత్రాలు పరికిస్తే చాలా వాస్తవాలు షాకిస్తాయి.

    షాకిచ్చే మిగతా తెలుగు చిత్రాల శాటిలైట్ రైట్స్ ... స్లైడ్ షో లో...

    (గమనిక : ఇక్కడ చెప్పే శాటిలైట్ రైట్స్ కేవలం ట్రేడ్ లో,మీడియాలో ప్రచారంలో ఉండి వినపడేవి మాత్రమే..అధికారికంగా చెప్పబడేవి కాదు)

    ‘అత్తారింటికి దారేది'

    ‘అత్తారింటికి దారేది'

    పవన్‌కళ్యాణ్‌ ‘అత్తారింటికి దారేది' 7.3 కోట్లకి శాటిలైట్‌ హక్కుల్ని విక్రయించారు. ఆ మొత్తంతో పోలిస్తే మహేష్ ‘వన్‌'ని రెట్టింపు మొత్తానికి అమ్మినట్టే అంటున్నారు. అయితే వాస్తవమైన ఫిగర్స్ ఏమీ బయిటకు రావటానికి కొంత టైమ్ పడుతుంది.

    బాద్షా...

    బాద్షా...

    ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చి విడుదలైన బాద్షా చిత్రం శాటిలైట్ పరంగా రికార్డ్ క్రియేట్ చేసింది. 7.5 కోట్లకు ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ అమ్ముడు పోయినట్లు చెప్పుకున్నారు. చిత్రం కలెక్షన్స్ పరంగా ఓకే అనిపించుకున్నా..శాటిలైట్ మార్కెట్ ద్వారా...నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు.

    'చెన్నై ఎక్స్‌ప్రెస్'

    'చెన్నై ఎక్స్‌ప్రెస్'

    బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్ తాజా చిత్రం 'చెన్నై ఎక్స్‌ప్రెస్' ప్రమోషన్లు ఫుల్ స్వింగ్‌తో నడుస్తుండగా, ఇంకోవైపు ఆయన ఒక కార్యక్రమం తర్వాత ఇంకో కార్యక్రమానికి హాజరవుతున్నాడు. విడుదలకు ముందుగానే 'చెన్నై ఎక్స్‌ప్రెస్' సంచలనాలు సృష్టింది. దాని శాటిలైట్ హక్కులు ఏకంగా రూ. 48 కోట్లకు అమ్ముడుపోయాయి! కొత్తగా వచ్చిన 'ఎండ్ ఫిలిమ్స్' అనే చానల్ ఈ హక్కుల్ని సొంతం చేసుకుంది. 'చెన్నై ఎక్స్‌ప్రెస్' కనుక బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల మార్కు దాటితే శ్లాబ్ ప్రకారం మరింత ఎక్కువ చెల్లించే అవకాశం ఉంది.

    ఎవడు

    ఎవడు

    రామ్ చరణ్ తాజా చిత్రం ఎవడు కూడా శాటిలైట్ పరంగా రికార్డ్ క్రియేట్ చేసిందని వినికిడి. అయితే అసలు రేట్ ఎంత అనేది బయిటకు రాలేదు. ఈ చిత్రం హిందీ డబ్బింగ్ రైట్స్ (శాటిలైట్ రైట్స్ ) కూడా 3.60 కోట్లకు అమ్ముడై అందరినీ ఆశ్చర్యపరిచింది. మెగా ఫ్యామిలీ సన్నిహితుడు గంటా శ్రీనివాసరావు ఈ రైట్స్ తీసుకున్నట్లు చెప్పారు.

    జులాయి

    జులాయి

    అల్లు అర్జున్ హీరోగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై త్రివిక్రమ్ రూపొందించిన చిత్రం ‘జులాయి'. ఇలియానా హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ 5 కోట్ల డబ్బై లక్షలు పలికినట్లు సమాచారం. మాటీవీ ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని తీసుకుంది. ఇద్దరమ్మాయిలతో చిత్రం కూడా మంచి రేట్ కు వెళ్లింది.

    ‘తుఫాన్'

    ‘తుఫాన్'

    రామ్ చరణ్ తేజ్ తొలి బాలీవుడ్ మూవీ ‘జంజీర్' చిత్రం తెలుగులో ‘తుఫాన్' పేరుతో విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. తెలుగు వెర్షన్ ‘తుఫాన్' శాటిలైట్ రైట్స్ జెమినీ టీవీ వారు సొంతం చేసుకున్నారు. ఇందుకోసం వారు రూ. 7 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ఒక ద్విభాషా చిత్రం తెలుగు శాటిలైట్స్ ఈ రేంజిలో రావడం ఇదే తొలిసారి అంటున్నారు ట్రేడ్ నిపుణులు. రామ్ చరణ్ స్టార్ ఇమేజ్ వల్ల ఇంత ధర పలికిందని అభిప్రాయ పడుతున్నారు.

    ‘భాయ్'

    ‘భాయ్'

    అక్కినేని నాగార్జున నటిస్తున్న ‘భాయ్' మూవీ శాటిలైట్ రైట్స్ జీటీవీ సంస్థ రికార్డు ధరకు సొంతం చేసుకుంది. రూ. 6 కోట్లకు ఈ చిత్రాన్ని సొంతం చేసుకుంది. నాగార్జున కెరీర్లో ఇంతకు ముందు ఏ చిత్రానికి కూడా ఈ రేంజిలో శాటిలైట్ రైట్స్ రాలేదు. పూలరంగడు, అహనా పెళ్లంట ఫేమ్ వీరభద్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘భాయ్'. రీచాగోపాధ్యాయ్ హీరోయిన్. నాగార్జున పుట్టినరోజును పురస్కరించుకుని ఆగస్టు 29న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ మరియు ఎంటర్టెన్మెంట్ జోడించి ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

    మిర్చి

    మిర్చి

    ప్రభాస్ హీరోగా రూపొంది విజయవంతమైన ‘మిర్చి' చిత్రానికి శాటిలైట్ డబ్బింగ్ రైట్స్ అదిరిపోయే రేంజిలో వచ్చాయి. 5 కోట్ల 75 లక్షలు చెల్లించి మాటీవి రైట్స్ తీసుకుంది. అలాగే ఈ చిత్రం హిందీ శాటిలైట్ రైట్స్ ని ఓ ప్రముఖ హిందీ టీవీ ఛానల్ రూ. 2.75 కోట్లు చెల్లించి దక్కించుకున్నట్లు తెలుస్తోంది. నేషనల్ హిందీ ఛానల్స్‌లో బాలీవుడ్ సినిమాల తర్వాత ఎక్కువ టీఆర్పీ రేటింగులు వస్తున్న సినిమాలు తెలుగు సినిమాలే. అందుకే చాలా ఛానల్స్ తెలుగు సినిమాలను కొని వాటిని హిందీలోకి అనువదించి అక్కడ టీవీల్లో రిలీజ్ చేసి బాగా సొమ్ము చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాష్ ‘మిర్చి' సినిమాకు భారీ మొత్తంలో రేటు పలికినట్లు తెలుస్తోంది.

    నాయక్ సైతం...

    నాయక్ సైతం...

    రామ్ చరణ్ తేజ్ నటించిన ‘నాయక్' మూవీ శాటిలైట్ రైట్స్ ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకు లేని విధంగా భారీ మొత్తం రాబట్టింది. ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం ‘నాయక్' చిత్రం శాటిలైట్ రైట్స్ ప్రముఖ సౌతిండియా ఛానల్ జెమినీ టీవీ రూ. 7.5 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నట్లు తెలిసింది.

    ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'

    ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'

    ప్యామీలీ ఎంటర్టైన్మెంట్స్ కు టీవీ లో ఉన్న డిమాండే వేరు..ఆ విషయం మహేష్ అతుడు చిత్రం ఎప్పటికప్పుడు ఎన్ని సార్లు వేస్తున్నా శాటిలైట్ రికార్డ్ లు క్రియేట్ చేస్తూ ప్రూవ్ చేస్తూనే ఉంది. తాజాగా మహేష్, వెంకటేష్ కాంబినేషన్ లో రూపొంది సంక్రాంతి కానుకగా విడుదలై చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఈ చిత్రం ఘన విజయంతో ముందుకు దూసుకుపోతూండటంతో ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ కు విపరీతమైన కాంపిటేషన్ ఏర్పడింది. అయితే ఈ కాంపిటేషన్ లో ...జెమినీ టీవి వారు మంచి రేటు పెట్టి ఈ చిత్రం రైట్స్ తీసుకున్నట్లు సమాచారం. ట్రేడ్ లో వినపడుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ...ఎనిమిదిన్నర కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. మల్టి స్టారర్ చిత్రం కావటం..మహేష్ కు టీవీలో విపరీతమైన పాపులారిటీ ఉండటం, చిత్రం ఘన విజయం సాధించటం వంటి కారణాలతో ఈ చిత్రానికి ఆ రేటు పలికింది. ఇది తెలుగు సినిమాల్లో ఆల్ టైమ్ రికార్డు అని చెప్తున్నారు.

    గబ్బర్ సింగ్

    గబ్బర్ సింగ్

    హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్' చిత్రం టీఆర్పీ రేటింగ్స్ విషయంలో అత్యధిక పాయింట్లు సాధించడమే కాదు... గత రికార్డులను బద్దలు కొట్టేసింది. గతంలో బుల్లితెర టీఆర్పీ రేటింగ్ రికార్డు రాజమౌళి దర్వకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన ‘మగధీర' చిత్రంపై ఉండేది. తాజాగా ఆ రికార్డును గబ్బర్ సింగ్ తిరగరాసాడు. ఇటీవల సంక్రాంతి సందర్భంగా టీవీల్లో ప్రసారం అయిన గబ్బర్ సింగ్ చిత్రానికి అత్యధికంగా 24 పాయింట్ల టీఆర్పీ రేటింగ్ సాధించి నెం.1 స్థానంలో నిలిచింది.. దీంతో మగధీర చిత్రం నెం.2 స్థానానికి వెళ్లి పోయింది. ఈ చిత్రం రైట్స్ నిమిత్తం 6 కోట్ల రూపాయలు ఛానెల్ వారు చెల్లించినట్లు సమాచారం.

    ‘1' (నేనొక్కడినే)

    ‘1' (నేనొక్కడినే)

    మహేష్‌ హీరోగా గా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘1, నేనొక్కడినే' శాటిలైట్‌ బిజినెస్‌ మోతెక్కించిం దని సమాచారం. ఈ సినిమా ఇంకా ఆడియో రిలీజ్‌ కాకముందే రూ.13కోట్ల భారీ మొత్తా నికి విక్రయించారని ప్రచారం సాగుతోంది. వన్‌ టీజర్‌, ఫస్ట్‌లుక్‌కి జనాల నుంచి విశేష స్పందన వచ్చింది. అయితే ఈ స్థాయిలో శాటిలైట్‌ అమ్మకాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. సన్ నెట్ వర్క్ కు చెందిన జెమినీ ఛానెల్... ‘1' (నేనొక్కడినే) తమిళ,మళయాళ డబ్బింగ్ వెర్షన్ రైట్స్ ని కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి టీజర్స్ ద్వారా వచ్చిన క్రేజ్ రేటు పెరగటానికి కారణమైందని చెప్తున్నారు. స్టైలిష్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా 2014 జనవరి 10న ప్రేక్షకుల ముందుకురానుంది.

    English summary
    It seems there is a good competition is running between various television channels in Telugu. While some channels try to woo the audiences with gold and other gifts, some other channels try to grab their attention with serials of different kinds.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X