twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఖైదీ నంబర్‌ 150’ కలెక్షన్లను‘గౌతమిపుత్ర శాతకర్ణి’ దాటేసిందా...ఎంతవరకూ నిజం?

    ఖైదీ చిత్రం కలెక్షన్స్ ను గౌతమి పుత్ర శాతకర్ణి దాటేసిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

    By Srikanya
    |

    హైదరాబాద్ : సంక్రాంతి సందర్భంగా విడుదలైన చిరంజీవి 'ఖైదీ నంబర్‌ 150', బాలకృష్ణ 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రాలు అమెరికాలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగా హిందీ చిత్రాల హవా నడుస్తూ ఉంటుంది. ఇందుకు భిన్నంగా ఈ సంక్రాంతికి తెలుగు స్టార్ హీరోల చిత్రాలు ఒక్కసారిగా తమదైన శైలిలో అలరిస్తున్నాయి.

    జనవరి 11న విడుదలైన చిరు 'ఖైదీ నంబర్‌ 150' అమెరికాలో మంచి టాక్‌ను తెచ్చుకుంది. దాదాపు 10ఏళ్ల తర్వాత చిరంజీవి నటిస్తున్న సినిమా కావడటంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. వెండితెరపై చిరంజీవి రీఎంట్రీని చూసి అభిమానులు ఆనందంతో ఉబ్బి తబ్బిబైపోయారు.

    'గౌతమిపుత్ర శాతకర్ణి' సైతం ని తెలుగువారిని విశేషంగా ఆకట్టుకుంటోంది. బాలకృష్ణ నటన, క్రిష్‌ దర్శకత్వ ప్రతిభకు ప్రవాసులు మంత్ర ముగ్దులవుతున్నారు. హేమమాలిని, శ్రియల నటన, యాక్షన్‌ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది.

    కలెక్షన్స్ విషయానికి వస్తే...ట్రేడ్ లో ప్రచారం జరుగుతున్న దాని ప్రకారం... ఖైదీ చిత్రం ..తొలిరోజు రికార్డు కలెక్షన్లను ఖైదీ సొంతం చేసుకుంది. అయితే.. సంక్రాంతి రోజున ఖైదీ.. శాతకర్ణి రెండు సినిమాల కలెక్షన్లను కొత్త లెక్కల్ని తెర మీదకు వచ్చాయి. ఈ లెక్కలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

    అమెరికాలో ఈ రెండు సినిమాలు సంక్రాంతి రోజున కొల్లగొట్టిన వసూళ్లు చూస్తే.. ఖైదీని శాతకర్ణి అధిగమించిన వైనం కనిపిస్తుంది. సంక్రాంతి రోజు ఖైదీకి 45వేల డాలర్ల(సుమారు రూ.30.65లక్షలు) కలెక్షన్లు రాగా.. శాతకర్ణికి 49వేల డాలర్లు (సుమారు రూ.33.40లక్షలు) వచ్చినట్లుగా తేల్చి చెప్తున్నారు. డాలర్ల లెక్కలో చెప్పాలంటే ఖైదీ కంటే శాతకర్ణి నాలుగువేల డాలర్లు అధికంగా రాబట్టినట్లుగా చెబుతున్నారు. అయితే ఇది కావాలని చేస్తున్న ప్రచారమో లేక, నిజంగానే ఈ స్దాయిలో ఖైదీని దాటిందో తెలియాలంటే అధికారిక కలెక్షన్స్ బయిటకు రావాలి.

     Gautamiputra Satakarni domination Continues at US Box Office

    అయితే సినీ విశ్లేషకుడు తరుణ్‌ ఆదర్శ్‌ లెక్కలు వేరుగా ఉన్నాయి. కలెక్షన్ల పరంగా 'ఖైదీ..' 2 మిలియన్‌ డాలర్లకు చేరువైందని ఆయన చెప్తన్నారు. శనివారం నాటికి 1,923,764 డాలర్లు(సుమారు రూ.13.11కోట్లు) వసూలు చేసినట్లు తెలిపారు.

    ఇక బాలకృష్ణ 100వ చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' అమెరికాలో శనివారానికి ఈ చిత్రం కలెక్షన్ల పరంగా ఒక మిలియన్‌ డాలర్ల మార్కును దాటి, 1,015,237 డాలర్లు (సుమారు రూ.6.92కోట్లు) వసూలు చేసినట్లు తరుణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు.

    సంక్రాంతి సందర్భంగా విడుదలైన శర్వానంద్‌ 'శతమానం భవతి' కూడా అమెరికాలో మంచి టాక్‌ తెచ్చుకుంది. అంతకాకుండా 89.89 శాతం వృద్ధితో కలెక్షన్ల పరంగా ముందుకు వెళ్తొంది. కుటుంబ విలువలను చాటి చెప్పే చిత్రంగా సతీష్‌ వేగ్నేశ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఇక చిత్రం 277,292 డాలర్లు(సుమారు రూ.1.89కోట్లు) వసూలు చేసిందట.

    English summary
    Gautamiputra Satakarni (GPSK) has made better collection than Khaidi No 150 and Shatamanam Bhavati at the US box office.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X