» 

నారా రోహిత్ నెక్ట్స్ ఆ స్టార్ డైరక్టర్ తో కన్ఫర్మ్!

Posted by:
 
మీ సోషల్ నెట్‌వర్క్‌లో దీన్ని షేర్ చేయండి
         దీన్ని షేర్ చేయండి          దీన్ని ట్వీట్ చేయండి          దీన్ని షేర్ చేయండి         మెయిల్ చేయండి

'బాణం' చిత్రంతో హీరోగా తెరంగ్రేటం చేసిన నారా రోహిత్ తన తదుపరి చిత్రాన్ని స్టార్ డైరక్టర్ గౌతం మీనన్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ తో ఉండబోతోందని సమచారం. ఈ మేరకు కొన్ని సిట్టింగ్స్ జరిగాయని ఓ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం చేస్తున్నారని తెలుస్తోంది. ఏ మాయ చేసావె చిత్రంతో నాగచైతన్యకు హిట్ ఇచ్చిన గౌతం మీనన్...నారా రోహిత్ ను కూడా కమర్షియల్ హీరోగా నిలబెడతాడని ఆశిస్తున్నారు. ప్రస్తుతం గౌతం మీనన్ తమిళంలో సమీరా రెడ్డి ప్రధానపాత్రలో ఓ ధ్లిల్లర్ చేస్తున్నారు. ఆ చిత్రం పూర్తయిన వెంటనే నారా రోహిత్ చిత్రం ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Read more about: నారా రోహిత్, గౌతం మీనన్, బాణం, సమీరా రెడ్డి, నాగ చైతన్య, ఏ మాయ చేసావె, bellamkonda suresh, nara rohit, baanam, gautham menon
Please Wait while comments are loading...

Telugu Photos

Go to : More Photos