twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యాంకర్ సుమ తెలియక మాట్లాడిందా..లేక

    By Srikanya
    |

    హైదరాబాద్ : పెద్ద పెద్ద సినిమాపంక్షన్ ల లో తప్పనిసరిగా కనపడే అందమైన వాచకం, ఫేస్ సుమ. ఆమె యాంకరింగ్ చేస్తే బాగుంటుందని చాలా మంది టాలీవుడ్ పర్శనాల్టీలు భావిస్తూంటారు. అందుకే ఆమె ఎప్పుడూ బిజీగా ఉంటూంటుంది. అయితే ఆమె ఈ బిజీ లో పడి కొన్ని విషయాలు తెలుసుకోకుండా స్టేజీపై మాట్లాడటంతో కొందరకి భాధ కలుగుతోంది.

    https://www.facebook.com/TeluguFilmibeat

    రీసెంట్ గా ఆమె 'గోపాల గోపాల' ఆడియో పంక్షన్ లో... మాట్లాడుతూ... జనవరి ఫస్ట్ రిలీజ్ ఈ చిత్రమే అని అంది. అది విన్న చాలా మంది..అదేంటి జనవరిలో ఇప్పటికే మన కుర్రాళ్ళే, రఘువరన్ బిటెక్, ఎ శ్యామ్ గోపాల్ వర్మ ఫిల్మ్ చిత్రాలు విడుదల అయ్యాయి కదా. అవి సినిమాలు కాదా లేక చిన్న సినిమాలను ఆమె పట్టించుకోదా అంటున్నారు. అంతేకాకుండా ఆమెకు చిన్న చిత్రాలంటే చిన్న చూపు ఉందని అంటున్నారు.

     'Gopala Gopala': Anchor Suma Ignores Small Films?

    అయితే సినిమా పరిశ్రమకు చెందిన అప్ డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోకపోవటం వలన వచ్చిన సమస్య అది అయ్యిండవచ్చు అని కొందరంటున్నారు. కానీ సినిమా పంక్షన్స్ కు వెళ్లి మాట్లాడేటప్పుడు అత్యుత్సాహంతో అక్కడ ఉన్న టీమ్ ని మెప్పించటానికి మాత్రమే కాకుండా ప్రిపేర్ అయ్యి వెళ్లితే ఇలాంటి అపవాదులు పడాల్సిన అవసరం ఉండదని ఆమె అభిమానులు అంటున్నారు.

    పవన్‌ కల్యాణ్‌. ఆయన వెంకటేష్‌తో కలిసి నటించిన చిత్రం 'గోపాల గోపాల'. శ్రియ కథానాయిక. కిషోర్‌ పార్థసాని దర్శకత్వం వహించారు. డి.సురేష్‌బాబు, శరత్‌ మరార్‌ నిర్మాతలు. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రంలోని గీతాలు ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. పవన్‌ కల్యాణ్‌ తొలి సీడీని ఆవిష్కరించారు. త్రివిక్రమ్‌, వెంకటేష్‌ స్వీకరించారు.

    English summary
    Suma was anchoring the audio release event of the film 'Gopala Gopala' and she announced that this movie is January's first release.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X