» 

హీరో రామ్ వివాదం..మళ్లీ మొదలైంది... ఏమవుతుందో

Posted by:
 

హైదరాబాద్ : హీరో రామ్ ...వివాదం ఏంటి అనుకోకండి...అది కొత్తగా మొదలైంది కాదు..బెల్లంకొండ సురేష్ కి, రామ్ కి మధ్య నలుగుతున్నదే....జూన్ 10 కి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వారు వాయిదా వేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు నిన్న(గురువారం) చర్చలు జరిగాయని తెలుస్తోంది. మా అశోశియేషన్ కి, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వద్ద బెల్లంకొండ ఈ కేసుని ఫైల్ చేసారని సమాచారం.

ఈ వివాదం... కందిరీగ 2 (ఇప్పుడు రభస) తో మొదలైంది. అప్పట్లో రామ్ ఈ చిత్రం చేయాల్సింది. ఇందు నిమిత్తం అడ్వాన్స్ గా బెల్లంకొండ సురేష్ కోటిన్నర ఇచ్చారని ఆరోపణ. అడ్వాన్స్ తీసుకుని ఏడాది అవుతున్నా ఇప్పటివరకూ ఆ డబ్బుని వెనక్కి ఇవ్వలేదు...షూటింగ్ కు హాజరు కాలేదని కంప్లైంట్ చేసారని తెలుస్తోంది. అయితే ఈ విషయమై రామ్ స్పందన ఏమిటన్నది తెలియరాలేదు.

Hero Ram: Held against a case by Bellamkonda Suresh

ఎన్నో కథలు విని, ఎంతో మంది దర్శకులును పిలిచి మాట్లాడి చివరకు రామ్ తన తదుపరి చిత్రం ఓకే చేసారు. రామ్ కొత్త చిత్రం ఎనౌన్స్ చేసారు. ఈ సారి రామ్ ని బలుపు తో ఫ్లాప్ లలో ఉన్న రవితేజకు హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని ని దర్శకుడుగా ఎంచుకున్నారు. యునైటెడ్‌ మూవీస్‌ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. పరుచూరి కిరీటి నిర్మాత.

'డాన్‌శీను'తో ఆకట్టుకొన్నారు గోపీచంద్‌ మలినేని. 'బలుపు'తో గతేడాది మరో విజయం అందుకొన్నారు. మధ్యలో వచ్చిన బాడీ గార్డ్ నిరాశరిచినా..బలుపు హిట్ తో ఆయనకి మంచి క్రేజే ఉంది. అల్లు అర్జున్ తో చిత్రం అని స్క్రిప్టు రెడీ చేసుకుని సిద్దమవుతున్న సమయంలో ...రామ్ తో ఎనౌన్స్ చేసి అందిరనీ ఆశ్చర్యంలో ముంచారు.

గోపీచంద్ మలినేని మాట్లాడుతూ ''రామ్‌లోని హుషారుకి తగిన కథ ఇది. మాస్‌, యాక్షన్‌, వినోదం.. ఇవన్నీ కలగలిసి ఉంటుంది. డాన్‌శీను', 'బాడీగార్డ్', 'బలుపు' వంటి హిట్ చిత్రాల తరువాత చేస్తున్న సినిమా ఇది. రామ్ ఎనర్జీకి తగినట్లుగా మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రూపొందించడానికి సబ్జెక్ట్ రెడీ చేశాం. రామ్‌కిది మరో మంచి సినిమా అవుతుంది' అన్నారు. ''అన్నారు.

Read more about: ram, gopichand malineni, balupu, రామ్, గోపీచంద్ మలినేని, బలుపు, పరుచూరి ప్రసాద్
English summary
Ram is alleged to have taken an amount of 1.5crore INR from producer Bellamkonda Suresh for his role in Kandireega-2. Discussions took place over this matter yesterday at the Producers Council and the case is said to be postponed till June 10th for further queries and discussions.
Please Wait while comments are loading...
Your Fashion Voice

Telugu Photos

Go to : More Photos