twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అఖిల్ కి అంతా సెట్ అయ్యింది..అదొక్కటి తప్ప

    By Srikanya
    |

    హైదరాబాద్: అక్కినేని అఖిల్ లాంచింగ్ కోసం అక్కినేని కుటుంబ అభిమానులే కాకుండా తెలుగు సినీ అభిమానులు సైతం ఎదురుచూస్తున్నారు. ఆ క్షణాలు దగ్గరపడ్డాయని సమాచారం. అఖిల్ చివరకు వివి వినాయిక్ దర్శకత్వంలో నే ఫైనల్ చేసారని ఫిల్మ్ నగర్ వార్త. అయితే హీరోయిన్ మాత్రం ఫైనల్ కాలేదని అంటున్నారు. అది కనుక సెట్ అయితే త్వరలోనే ఈ మేరకు అఫీషియల్ గా లాంచింగ్ ప్రకటన రానున్నదని సమాచారం.

    హీరోయిన్ గా ప్రెష్ గా ఉండే అమ్మాయిని తీసుకోవాలని ఒక ఆలోచన ఉంటే, వినాయిక్ మాత్రం రాశిఖన్నావైపు మొగ్గు చూపుతున్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే నాగార్జున మాత్రం హీరోయిన్ హంట్ కొనసాగిస్తున్నారని, ఆ మేరకు ఓ స్పెషల్ టీమ్ ని ఏర్పాటు చేసారని చెప్పుకుంటున్నారు. అఖిల్ ఎత్తు, ఫిజిక్ కి తగ్గట్లుగా ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం.

    బాలీవుడ్ నుంచి హీరోయిన్స్ తీసుకువద్దామని అక్కడి వారితో మాట్లాడితే వారి రెమ్యునేషన్స్ ఆకాశాన్ని అంటేటట్లు ఉండటంతో కొత్త హీరోయిన్ వైపే మ్రొగ్గుచూపుతున్నట్లు చెప్తున్నారు. అఖిల్ తొలి చిత్రం కాబట్టి అందరి దృష్టీ అఖిల్ మీదే ఉంటుందని, హీరోయిన్ కొత్త అమ్మాయి అయినా ఇబ్బంది ఉండదని అంటున్నారు. అలాగే మరో యంగ్ హీరో నితిన్ నిర్మాతగా ఈ చిత్రం రూపొందనుందని సమాచారం.

    Heroine Hunt for Akkineni Akhil

    అఖిల్ లాంచింగ్ గురించి నాగార్జున ఆ మధ్యన మాట్లాడుతూ... '' 'మనం'లో అఖిల్‌ని ముప్పై సెకన్లపాటు చూపించారు విక్రమ్‌. అది అభిమానులకు ఎంతగానో నచ్చింది. 'మనం'లో అఖిల్‌ కనిపించేది 30 సెకన్లే. అది చూసి అంచనాకు రాలేం. 30 సెకన్ల వాణిజ్యప్రకటనలో అందరూ అందంగానే కనిపిస్తారు. పూర్తిస్థాయి హీరోగా ఎలా రాణిస్తాడో చూడాలి అంటున్నారు నాగార్జున. ఆయన రెండో కుమారుడు అఖిల్ హీరోగా లాంచ్ కాబోయే చిత్రం పై అంతటా ఎక్సపెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. ఈ నేపధ్యంలో నాగార్జున పుత్రోత్సాహంతో ఇలా స్పందించారు.

    అలాగే నవ్వుతూ... ''అఖిల్‌ మరో మహేష్‌ అవుతాడు.. అంటుంటే అంతకంటే ఆనందం ఉంటుందా? ఇంకొంతమంది చైతూకి పోటీ వస్తున్నాడా? అని అడుగుతున్నారు. చైతన్య సంగతి పక్కన పెట్టండి. అఖిల్‌కి పోటీగా నేనున్నాను కదా.? నన్ను దాటమనండి.అఖిల్‌కి తనపై తనకు నమ్మకం ఎక్కువ. చిన్నతనం నుంచి ఇలాగే కాన్ఫిడెన్స్‌గా ఉండేవాడు. అఖిల్‌ సినిమాకి నేనే నిర్మాత అని అన్నారు.

    English summary
    Everything is set for the grand launch of Akkineni Akhil under the direction of VV Vinayak. A special team is working on the heroine hunt for Akhil to avoid further delay in this yet to be titled film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X