twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్ 'బ్రూస్ లీ' : ఇలియానా కి ఇచ్చేది ఎక్కువే

    By Srikanya
    |

    హైదరాబాద్ : రీసెంట్ గా చిరంజీవి పుట్టిన రోజు వేడుకలో హాట్ గా సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచిన ఇలియానా త్వరలో రామ్ చరణ్ తాజా చిత్రం బ్రూస్ లీ సాంగ్ లో డాన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజవీ, చెర్రీ ఇద్దరూ స్టెప్పులేసి ఫ్యాన్స్ కు డ్యాన్స్ ట్రీట్ ఇవ్వనున్నారు. ఈ స్పెషల్ సాంగ్ లో చిరంజీవి, చరణ్ తో కలసి డ్యాన్స్ చేయనుందట ఇలియానా. ఈ పాట కోసం ఇలియానా కు కోటిన్నర వరకూ ముట్టచెప్తున్నట్లు సమాచారం. బంటీ ఔర్ బబ్లీ మూవీలో అమితాబ్ బచ్చన్, అభిషేక్, ఐశ్వర్యరాయ్ కాంబినేషన్ లో వచ్చిన కజ్రారే సాంగ్ టైపులో ఈ పాటను ప్లాన్ చేస్తున్నారట దర్శకుడు శ్రీను వైట్ల.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    "వేట ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. మొదలుపెట్టాక, పూర్తయ్యేవరకూ రిక్వెస్ట్‌లు వినపడవ్! రియాక్షన్‌లు కనపడవ్! ఓన్లీ రీసౌండ్!" అంటూ చరణ్ చెప్తూ విడుదల చేసిన ఆయన తాజా చిత్రం డైలాగ్ టీజర్ కు అభిమానులకు పండగే చేసుకున్నారు.

    విడుదలైన మూడు రోజుల్లోనే 1 మిలియన్ (10 లక్షల) వ్యూస్ సాధించి చెర్రీ సినిమా టీజర్ యూట్యూబ్‌లో ముందుకు వెల్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. అక్టోబర్ 15న సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నిర్మాత డీవీవీ దానయ్య ప్లాన్ చేస్తున్నారు.

    తమన్ చెప్తున్న దాని ప్రకారం సెప్టెంబర్ మిడిల్ లో ఈ సినిమా ఆడియోని రిలీజ్ చేయనున్నారు. అంతే కాకుండా ఇప్పటివరకూ జరిగిన షూటింగ్ రషెస్ మరియు టీం స్పీడ్ చూసిన తమన్ సినిమా చాలా బాగా వస్తోందని తెలిపాడు.

    ప్రస్తుతం రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ మరియు ప్రధాన నటీనటులపై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ ...స్టంట్ మ్యాన్ గా కనిపించనున్న సంగతి తెలిసిందే. సినిమాలకు పనిచేసే ఆ స్టంట్ మ్యాన్ తన వృత్తిలో భాగంగా ...అప్పటికే హీరోగా చేస్తున్న బ్రహ్మాజీకి బాడీ డబుల్ గా కనపడి...ఫైట్స్ చేస్తాడన్నమాట. ఈ సీన్స్ ని రీసెంట్ గా శ్రీను వైట్ల చిత్రీకరించారు.

    దర్శకుడు మాట్లాడుతూ ''యాక్షన్‌తో కూడిన కుటుంబ కథా చిత్రమిది. భారీ తారాగణంతో పాటు, అత్యున్నత సాంకేతిక విలువలతో సినిమా తెరకెక్కిస్తాం'' అన్నారు.

    నిర్మాత మాట్లాడుతూ ''విజయవంతమైన కలయికలో రూపొందుతున్న ఈ చిత్రం అందరినీ అలరించేలా ఉంటుంది. శ్రీనువైట్ల మూల కథ అందించారు. శ్రీను వైట్ల, రచయితలు కోన వెంకట్‌, గోపీమోహన్‌ది విజయవంతమైన కాంబినేషన్‌ అనీ, ఆ కాంబినేషన్‌తో ఈ సినిమా రూపొందుతుండటం ఆనందంగా ఉందని నిర్మాత దానయ్య అన్నారు.

    Ileana Offered 1.5 C For Item Number In Bruce Lee?

    ఈ చిత్రానికి కథ: కోన వెంకట్‌, గోపీమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, కూర్పు: ఎ.ఆర్‌. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్‌: అణల్‌ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.

    అలాగే....

    సినిమాలో కథలో భాగంగా.... చిరంజీవి హీరో గా నటిస్తున్న చిత్రానికి రామ్‌చరణ్‌ ఫైట్స్‌ కంపోజ్‌ చేస్తూ కనపడతాడు. రామ్‌చరణ్‌తో ఆయన శ్రీనువైట్ల చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం సెట్స్‌పై ఉంది. ఇందులో చిరంజీవి ఓ అతిథి పాత్రలో తళుక్కున మెరవబోతున్నారు. సినిమా నేపథ్యంలో సాగే కథ ఇది.

    చరణ్‌ ఫైట్‌ మాస్టర్‌ పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో చిరు ఓ 'స్టార్‌' పాత్రలో కనిపించబోతున్నారని, ఆయన నటించే చిత్రానికి చరణ్‌ ఫైట్‌ మాస్టర్‌గా పనిచేసే సన్నివేశం ఒకటుందని తెలుస్తోంది. చిరు కనిపించేది కొద్దిసేపే అయినా ఈ కథకు ఆ సన్నివేశం కీలకం కానుందట.

    ఇది వరకు 'మగధీర'లో చిరంజీవి, రామ్‌చరణ్‌లు కలసి సందడి చేశారు. ఆ తరవాత తెరపై ఇద్దరూ కలిసి కనిపించలేదు. మళ్లీ ఇన్నాళ్లకు చిరు, చరణ్‌ను ఒకే తెరపై చూసే అవకాశం అభిమానులకు దక్కుతోందని వారు ఆనందపడిపోతున్నారు.

    ఈ చిత్రాన్ని ఈ దసరాకు విడుదల చేయాలని టార్గెట్ చేస్తున్నారు. రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. కోన వెంకట్, గోపీ మోహన్ కలిసి స్క్రిప్టు అందిస్తూండగా డివివి దానయ్య నిర్మిస్తున్నారు. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది.

    ఈ చిత్రానికి కథ: కోన వెంకట్‌, గోపీమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, కూర్పు: ఎ.ఆర్‌. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్‌: అణల్‌ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.

    English summary
    Actress Ileana D'Cruz has been reportedly offered Rs.1.5 crore for an item number in Ram Charan's upcoming flick, Bruce Lee. "Ileana was approached with the offer worth Rs.1.5 crore. It was for a special song in Bruce Lee. The actress is yet to give her nod," a source from the film's unit revealed. Being directed by Srinu Vaitla, the film also stars Rakul Preet Singh. In the film, Ram Charan will be seen as a stuntman and is nicknamed Bruce Lee.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X