twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అభిమానులతో కలిసి జూ ఎన్టీఆర్ ఫోటో షూట్!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: నందమూరి యంగ్ హీరో జూ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎన్టీఆర్ కూడా అభిమానులకు చాలా విలువ నిస్తాడు. తాను ఈ స్థాయికి రావడానికి అభిమానులే అని గర్వంగా చెప్పుకునే హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు. అభిమానుల కోసం ఏదైనా చేయాలనే ఆలోచనలో ఉన్న ఎన్టీఆర్ త్వరలో వారితో కలిసి స్పెషల్ ఫోటో షూట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. విశాఖపట్నంలో ఈ కార్యక్రమం జరుగనుందట.

    అయితే ఎప్పుడు? ఎక్కడ? అనేది ఇంకా ఖరారు కాలేదు. డేట్ ఖరారైన తర్వాత నేరుగా ఎన్టీఆర్ అభిమానులకు ఈ విషయం తెలిసే విధంగా ప్లాన్ చేస్తున్నారట. తమ అభిమా హీరో పక్కన ఉండి ఫోటోదిగడం కంటే....అభిమానులు కోరుకునేది ఇంకా ఏముంటుంది చెప్పిండి. ఫ్యాన్స్ ఎంతో సంతోషించే విషయం ఇది.

    Jr NTR photo session with fans

    ప్రస్తుతం జూ ఎన్టీఆర్...పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్టెనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, ఆలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జీ, వెన్నెల కిషోర్‌, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తారు. శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై బండ్ల గణేష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, సినిమాటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఫైట్స్‌: విజయ్‌, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్‌, స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్.

    English summary
    Film Nagar source said, Jr NTR is planning a special photo session with fans soon in the city of Visakhapatnam.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X