twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అంత సీన్ లేదు...ఎన్టీఆర్ ఖచ్చితంగా వస్తాడు

    By Srikanya
    |

    హైదరాబాద్: అదేంటో ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ మూవి పై మొదటి నుంచి ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. దానిక తోడు మీడియాలో ప్రతీసారి సినిమా ఇక ఆగిపోయినట్లే అని వార్తలు వస్తూనే ఉన్నాయి. అదే రూటులో ఈ సారి ఎన్టీఆర్ సినిమాకు టాలీవుడ్ లో జరుగుతున్న స్ట్రైక్ దెబ్బ తగిలిందని, కాబట్టి అనుకున్న సమయానికి అంటే సంక్రాంతికి విడుదల కాకపోవచ్చు అంటూ వార్తలు మొదలయ్యాయి. అయితే పూరి ప్రామిస్ చేసినట్లుగా అంటే జనవరి 9, 2015న ఖచ్చితంగా ఈ చిత్రం విడుదల అవుతుందని అంటున్నారు.

    రీసెంట్ గా గోవా షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చిన ఈ చిత్రం యూనిట్ ఈ సమ్మెతో వెనకబడేదేమీ లేదని అంటున్నారు. ఎన్టీఆర్ రెస్ట్ లెస్ గా పనిచేయాలని నిర్ణయించుకునే ఈ విడుదల తేదీని ఫిక్స్ చేసాడని అంటున్నారు. అలాగే పూరి జగన్నాథ్ సైతం స్పీడుగా సినిమాలు తీయటంలో దిట్ట కావటంతో అనుకున్న సమయానికి ఆగటం అనే సమస్య లేదని, ఆలస్యం ఎట్టి పరిస్ధితుల్లోనూ కాదని అంటున్నారు. రెండు మూడు రోజుల్లో స్ట్రైక్ ఆగుతుంది కాబట్టి మళ్ళీ శరవేగంతో షూటింగ్ జరుగుతుందని యూనిట్ వర్గాలు అంటున్నాయి.

    Jr NTR, Puri Jagan's movie Will Arrive for Sankranthi

    నిర్మాత బండ్ల గణేశ్‌ మాట్లాడుతూ ‘‘ఈ రెండో షెడ్యూల్‌తో సినిమా మొత్తాన్ని పూర్తి చేస్తాం. హైదరాబాద్‌, వైజాగ్‌తో పాటు విదేశాల్లోనూ చిత్రీకరణ జరుపుతాం. జనవరి 9న సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేస్తాం. ఇందులో ఎన్టీఆర్‌ ఓ పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా డెఫినెట్‌గా మ్యూజికల్‌ హిట్టవుతుంది. ఎన్టీఆర్‌, పూరి జగన్నాథ్‌ కెరీర్‌లలోనూ, మా బేనర్‌లోనూ ఇది ప్రతిష్ఠాత్మక చిత్రంగా తయారవుతోంది'' అని చెప్పారు.

    ఎన్టీఆర్‌ హీరోగా పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ఓ చిత్రం రూపొందుతోంది. కాజల్‌ హీరోయిన్ . పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేష్‌ నిర్మాత. తొలి షెడ్యూల్‌ చిత్రీకరణ ఇటీవల పూర్తయింది.

    ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ, వెన్నెల కిశోర్‌, జయప్రకాశ్‌రెడ్డి, సప్తగిరి, కోవై పరళ, రమాప్రభ, పవిత్రా లోకేశ్‌ తారాగణం. ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, ఛాయాగ్రహణం: శ్యామ్‌ కె. నాయుడు, ఫైట్స్‌: విజయ్‌, సమర్పణ: శివబాబు బండ్ల.

    English summary
    NTR-Jagan will surely cover the delay and hit screens on January 9th as promised.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X