twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వరుస ప్లాపుల ఎఫెక్ట్: జూ ఎన్టీఆర్ రెమ్యూనరేషన్లో కోత?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: వరుస హిట్లతో ఒకప్పుడు టాప్ పొజిషన్లో ఉన్న యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్....వరుస ప్లాపులతో వెనకబడి పోతున్నారు. గడించిన నాలుగేళ్లలో ఎన్టీఆర్ సినిమాల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. దీంతో తన రెమ్యూనరేషన్లో కోత విధించుకునే దిశగా ఎన్టీఆర్ ప్లాన్ చేసుకుంటున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.

    2010లో బృంగావనం విజయం తర్వాత...‘శక్తి' రూపంలో కెరీర్లో బిగ్గెస్ట్ ప్లాపు చవిచూసి ఎన్టీఆర్ తర్వాత ఊసరవెల్లి, దమ్ము చిత్రాలతో చతికిల పడ్డాడు. 2013లో వచ్చిన ‘బాద్ షా' చిత్రం ఎన్టీఆర్‌కు కాస్త ఊరట ఇచ్చినా...వెంటనే ‘రామయ్యా వస్తావయ్య' రూపంలో మళ్లీ నిరాశ ఎదురైంది. ఇటీవల విడుదలైన ‘రభస' చిత్రం కూడా ఇక ప్లాపు లిస్టులో చేరినట్లే అని విశ్లేషకులు తేల్చేసారు.

    Jr NTR remuneration in talk

    దీంతో ఎన్టీఆర్ ఆత్మరక్షణలో పడ్డారట. దిద్దు బాటు చర్యలు చేపట్టారట. సాధారణంగా ఎన్టీఆర్ సినిమాలంటే బడ్జెట్ భారీగా ఉంటుంది. అతను తీసుకునే రెమ్యూనరేషన్ కూడా ఎక్కువే. దీనికి తోడు డబ్బులను నీళ్లలా ఖర్చు చేస్తూ ఫారిన్ లోకేషన్లలో షూటింగులు తప్పనిసరి. దరిమిలా బడ్జెట్ భారీగా పెరిగి పోతోంది.

    ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా ఆయన సినిమాలకు ఓపెనింగ్స్ భారీగానే వస్తున్నా....భారీ బడ్జెట్ కారణంగా నిర్మాతలకు లాభాలు మాత్రం మిగలడం లేదు. దీంతో రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అంతే కాకుండా బడ్జెట్ కూడా తగ్గించుకుని సినిమాల చేయాలని, లాభాలు వస్తే వాటా తీసుకునే విధంగా ఇకపై ఒప్పందాలు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ‘రభస' చిత్రం అనుకున్న ఫలితాలు ఇవ్వక పోవడంతో నిర్మాత బెల్లంకొండ....ఎన్టీఆర్‌కు ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం పూర్తి రెమ్యూనరేషన్ ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

    English summary
    Jr NTR remuneration in talk.Apparently, he figured that even if his films had an average run, the producers are not making much money due to high costs. As a part of damage control measures, NTR decided to slash his remuneration.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X