twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కల్యాణ్‌రామ్‌ 'పటాస్‌' కథేంటి? ఇన్ సైడ్ టాకేంటి?

    By Srikanya
    |

    హైదరాబాద్ : కల్యాణ్‌రామ్‌ హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం 'పటాస్‌'. శ్రుతి సోడి హీరోయిన్. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 23న (రేపు) ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపధ్యంలో చిత్రం కథేంటి..అసలు కళ్యణ్ రామ్ కు ఇది కలిసి వచ్చే సినిమా యేనా అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో, అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపధ్యంలో మాకు అందిన సమాచారాన్ని మీకు అందిస్తున్నాం.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ ఓ అవినీతి పోలీస్ అథికారిగా కనిపిస్తారు. అలాగే తన చేష్టలతో తన తండ్రి సీనియర్ పోలీస్ అధికారి(సాయికుమార్)ని ఇబ్బంది పెడుతూంటాడు. తండ్రికి, కొడుకు కు మధ్యన పొసగదు. తండ్రి తనను పట్టించుకోకుండా, తన ఇష్టా ఇష్టాలతో సంభంధం లేకుండా పోలీస్ ను చేసాడని మనస్సులో పెట్టుకుని ఆ కసితో తండ్రికి బ్యాడ్ నేమ్ తెచ్చేలా బిహేవ్ చేస్తూంటాడు. అంతేకాకుండా విలన్స్ దగ్గర డబ్బు తీసుకుని వారికి సాయిం చేస్తూంటాడు. మరో ప్రక్క హీరోయిన్ ఓ జర్నలిస్ట్. ఆమెపై మనస్సు పడి ఏదో ఓ ప్రెస్ మీట్ పెట్టి ఆమెను పిలుస్తూంటాడు. చివరకు అతను ఓ సంఘటన వల్ల మారి..సెకండాఫ్ లో విలన్స్ భరతం పడతాడు. తన తండ్రితో ఉన్న రిలేషన్ ని పునరిద్దించుకుంటాడు. సెకండాఫ్ లో కూడా కామెడీకి మంచి ప్రయారిటీ ఇచ్చారు. ఇది కళ్యాణ్ రామ్ కు గబ్బర్ సింగ్ అంటున్నారు.

    Kalyan Ram’s Patas Story and inside Talk

    ఇక ఈ చిత్రం ఫస్టాఫ్ పూర్తి ఫన్ తో నడుస్తుంది. కామెడీకు ప్రయారిటీ ఇస్తూ, పంచ్ డైలాగులతో సినిమా వెళ్లిపోతుంది. సెకండాఫ్ లో సూర్య సింగం స్టైల్ లో విలన్స్, హీరోకి మధ్య వార్ తో ఎత్తుకు పై ఎత్తులతో పరుగెడుతుంది. అందిన ప్రాధమిక సమాచారం ప్రకారం..సినిమా సక్సెస్ అవుతుందని తెలుస్తోంది. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటుందని చెప్తున్నారు.

    కథ గురించి దర్శకుడు చెప్తూ... ''ఒక అవినీతి పోలీసు అధికారి కథ ఇది. ఎప్పుడూ వసూళ్ల ధ్యాసలోనే గడిపే ఆ పోలీసు ఎలా మారాడన్నది తెరపైనే చూడాలి. పటాస్‌ అంటే టపాకాయ పేరు. అది చాలా గట్టిగా పేలుతుంది. ఇందులో హీరో పాత్ర తీరు కూడా అలాగే ఉంటుంది. ఈ కథలో వినోదమూ కీలకమే. కల్యాణ్‌రామ్‌ తెరపై కనిపించే విధానం కొత్తగా ఉంటుంది'' అన్నారు.

    దర్శకుడు మాట్లాడుతూ ''వినోదం, యాక్షన్‌ అంశాల మేళవింపుతో తెరకెక్కిన చిత్రమిది. పోలీసు అధికారి పాత్రలో కల్యాణ్‌రామ్‌ చేసే సందడి ఆకట్టుకొంటుంది. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన లభించింది. సినిమా ఇంటిల్లిపాదినీ మెప్పిస్తుంది''అన్నారు.

    కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ ''యాక్షన్‌ ప్రధానంగా సాగే చిత్రమిది. కథలో వినోదానికీ చోటుంది. రొమాంటిక్‌ , యాక్షన్‌, మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకొంది. సాయికార్తీక్‌ మంచి సంగీతాన్ని అందించారు. భారీ హంగులతో రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరిస్తుంది'' అన్నారు. శ్రుతి సోధి పంజాబీ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకొంది శ్రుతి. అటు అందంగా కనిపించడంతోపాటు ఇటు నటనలోనూ రాణిస్తోంది. చిత్రంలో కల్యాణ్‌రామ్‌ పోలీసు అధికారిగా కనిపిస్తారు. కథలో మలుపులు రక్తికట్టించేలా ఉంటాయని చిత్రబృందం చెబుతోంది.

    సాయికుమార్‌, బ్రహ్మానందం, అశుతోష్‌ రాణా, ఎమ్మెస్‌ నారాయణ, శ్రీనివాసరెడ్డి, జయప్రకాశ్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: సర్వేశ్‌ మురారి, ఎడిటింగ్‌: తమ్మిరాజు, రచనా సహకారం: ఎస్‌.కృష్ణ, నిర్మాత: నందమూరి కల్యాణ్‌రామ్‌, కథ, మాటలు, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్‌ రావిపూడి.

    English summary
    ‘Pataas’ movie features Kalyan Ram in a dynamic police officer Role. Directed by Anil Ravipudi and Produced by Kalyan Ram under the banner NTR Arts. It stars Sai Kumar, M.S. Narayana and Ashutosh Rana in prominent roles. Shruti Sodhi is the female lead and Sai Karthik composed music.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X