twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కార్తికేయ దర్సకుడు నెక్ట్స్ మరో యంగ్ హీరోతో

    By Srikanya
    |

    హైదరాబాద్ :నిఖిల్ తో చేసిన కార్తికేయ విజయం సాధించటంతో ఉత్సాహంగా ఉన్నదర్శకుడు చందు మొండేటి తన తదుపరి చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఆయన నెక్ట్స్ చిత్రాన్ని యువ హీరో నాగ చైతన్య ఓకే చేసినట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించే అవకాసం ఉంది. స్వామిరారా దర్శకుడు సుధీర్ వర్మ తో ప్రస్తుతం చిత్రం చేస్తున్న నాగ చైతన్య తన తదుపరి చిత్రంగా దీన్ని చేస్తారని తెలుస్తోంది. అలాగే స్వామిరారా చిత్రానికి అసెస్టెంట్ డైరక్టర్ గా చందు పనిచేసిన సంగతి తెలిసిందే. అలా నిఖిల్ తో చేసిన వీళ్లిద్దరూ నాగచైతన్యతో ముందుకు వెళ్తున్నారు.

    Karthikeya director next with established hero

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
    పూర్తి వివరాల్లోకి వెళితే...

    తొలిచిత్రం కార్తికేయతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు దర్శకుడు చందు మొండేటి. ఈ సినిమా విజయంతో ఆయనకు భారీ చిత్రాల ఆఫర్లు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం నాగచైతన్య హీరోగా ఆయన ఓ చిత్రాన్ని చేయబోతున్నట్లు తెలిసింది. ఇటీవలే వీరిద్దరి మధ్య కథా చర్చలు జరిగాయని, చందు మొండేటి చెప్పిన కాన్సెప్ట్‌లోని కొత్తదనం నచ్చడంతో నాగచైతన్య ఈ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది. నవ్యమైన కాన్సెప్ట్‌తో రొమాంటిక్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్డూడియోస్ పతాకంపై నాగార్జున నిర్మిస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం సుధీర్‌వర్మ ర్శకత్వంలో నాగచైతన్య ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఇది పూర్తయిన వెంటనే చందు మొండేటి సినిమా సెట్స్‌మీదకు వెళ్తుందని సమాచారం.

    దర్శకుడు గురించి...

    ''సినిమా విడుదలకు ముందు రిజల్ట్ కోసం టెన్షన్‌గా ఎదురు చూశా. ప్రేక్షకుల స్పందన తెలిశాక హమ్మయ్య అనుకున్నా'' అని దర్శకుడు చందు మొండేటి అన్నారు. నిఖిల్, స్వాతి జంటగా ఆయన దర్శకత్వం వహించిన 'కార్తికేయ' ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. అటు ప్రేక్షకుల్ని ఇటు సినీ పరిశ్రమ వారిని చిత్రం ఆకట్టుకుంటోందంటూ చందు మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. మాది కొవ్వూరు. కానీ, పెరిగిందంతా చెన్నయ్‌లోనే. బీటెక్ చదివాను. సినిమాలంటే ఇష్టమే కానీ.. డెరైక్టర్ అవ్వాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు.

    Karthikeya director next with established hero

    అయితే, సినిమా పరిశ్రమలోనే స్థిరపడాలనుకున్నాను. లైట్‌మేన్‌గా చేరితే.. కెమెరామేన్ కావొచ్చనీ, కథలు రాసుకుంటే రచయితగా స్థిరపడొచ్చనీ అనుకున్నాను. నేను కథ చెప్పే విధానం చూసి, నా స్నేహితులు 'నీలో డెరైక్టర్ లక్షణాలున్నాయి' అనేవారు. కానీ, పెద్దగా పట్టించుకునేవాణ్ణి కాదు. ఓసారి హైదరాబాద్‌లో 10, 15 రోజులుందామని వచ్చాను. ఆ సమయంలోనే సుకుమార్‌గారి 'ఆర్య' విడుదలైంది. 'కొత్త పాయింట్‌తో తీశాడు' అంటూ ఎక్కడ చూసినా సుకుమార్‌గారి గురించే! కొత్తగా తీస్తే, దర్శకుడికి ఇంత పేరొస్తుందా అనిపించింది. అప్పటికే నా దగ్గర కొత్త పాయింట్స్ ఉండటంతో డెరైక్టర్ అవుదామనుకున్నా.

    ఇక్కడ కొంతమంది స్నేహితుల ద్వారా సుధీర్ వర్మ, నిఖిల్‌లతో పరిచయం ఏర్పడింది. అప్పుడు నిఖిల్ కీలక పాత్రలో ఓ సినిమా ఆరంభమైతే, నేనూ, సుధీర్ దర్శకత్వ శాఖలో చేరాం. ఆ చిత్రం ఆగినా, మా స్నేహం మాత్రం కొనసాగుతోంది. ఆ తర్వాత పరశురామ్ దగ్గర 'యువత'కి చేశాను. అలాగే రెండు, మూడు సినిమాలకు రచయితగా వ్యవహరించాను. అప్పుడు 'కార్తికేయ' కథతో దర్శకుడు కావాలనుకున్నాను. 'స్వామి రారా'వంటి వినూత్న కథాంశంతో సుధీర్ హిట్ సాధించడంతో బలమైన కథలకు ఆదరణ ఉంటుందనే నా నమ్మకం ఇంకా పెరిగింది. నిఖిల్ 'కార్తికేయ' కథ వినడం, తనకు నచ్చడంతో వెంటనే మొదలుపెట్టాం.

    'కార్తికేయ' విడుదల తర్వాత ఎంతోమంది ప్రముఖులు ఫోన్ చేసి, అభినందించారు. అల్లు అర్జున్, వినాయక్‌గారు, సుకుమార్‌గారు, సుప్రియ, అశ్వనీదత్‌గారి కుమార్తె ప్రియాంకా దత్ ఫోన్ చేసి, అభినందించారు. ఏవైనా కొత్త కథలుంటే చెప్పమని అందరూ అడుగుతున్నారు. నా దగ్గర నాలుగైదు కథలున్నాయి. వాటిలో ఒకటి నాగార్జునగారికి సరిగ్గా సరిపోతుంది. నేను ఆయన అభిమానిని. అందుకే, ఆయనకు తగ్గ కథ రెడీ చేశాను. ఇకపై డబ్బు తెచ్చిపెట్టే సినిమాలే తీస్తా. 'కార్తికేయ' విడుదలయ్యాక, ఆదరణ బాగుండడంతో ఇంకా థియేటర్లు పెంచాం. ఈ విజయం ఇచ్చిన ప్రోత్సాహంతో నా తదుపరి చిత్రాలను కూడా వినూత్న కథాంశాలతోనే చేస్తా అని అన్నారు.

    ప్రస్తుతం నాగ చైతన్య చేస్తున్న చిత్రం విషయానికి వస్తే....
    'స్వామి రా రా' అంటూ తొలి ప్రయత్నంతోనే ఆకట్టుకొన్నారు సుధీర్‌ వర్మ. 'తడాఖా', 'మనం'... అంటూ విజయాల బాట పట్టారు నాగచైతన్య. వీరిద్దరూ మరో విజయం కోసం జట్టు కట్టారు. నాగచైతన్య కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. కృతిసనన్‌ నాయిక. సుధీర్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మాత. గురువారం ఉదయం హైదరాబాద్‌లో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది.

    Karthikeya director next with established hero

    నాగచైతన్య మాట్లాడుతూ ''సుధీర్‌ వర్మ తీసిన 'స్వామి రా రా' నాకు బాగా నచ్చింది. నా కోసం ఓ మంచి కథ సిద్ధం చేశాడు. తప్పకుండా నా కెరీర్‌లో మంచి చిత్రంగా మిగులుతుందన్న నమ్మకం ఉంది''అన్నారు.

    దర్శకుడు చెబుతూ ''ఈ కథ నాగచైతన్యకు అన్నివిధాలా సరిగ్గా సరిపోతుంది. అన్ని వాణిజ్య అంశాలూ ఉన్నాయి''అన్నారు. ''అత్తారింటికి దారేది' తరవాత మా సంస్థ నుంచి వస్తున్న చిత్రమిది. జులై 2 నుంచి రెగ్యులర్‌ షూటింట్‌ ప్రారంభిస్తున్నాము''అని నిర్మాత చెప్పారు.

    బ్రహ్మానందం, రవిబాబు, రావురమేష్‌, ప్రవీణ్‌, పూజ, సత్య తదితరులు నటిస్తున్నారు. సంగీతం: సన్నీ ఎమ్‌.ఆర్‌, ఛాయాగ్రహణం: రిచర్డ్‌ ప్రసాద్‌, కూర్పు: కార్తీక శ్రీనివాస్‌, కళ: నారాయణరెడ్డి, సాహిత్యం: శ్రీమణి, సమర్పణ: బాపినీడు.బి.

    English summary
    Chnadoo will next team up with Akkineni Naga Chaitanya for an untitled film and the discussion took the place recently.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X