»   » కీర్తి సురేష్ సూపర్ లక్కీ, ఎవరి ప్రక్కన ఓకే అయ్యిందో తెలిస్తే కంగ్రాట్స్ చెప్తారు

కీర్తి సురేష్ సూపర్ లక్కీ, ఎవరి ప్రక్కన ఓకే అయ్యిందో తెలిస్తే కంగ్రాట్స్ చెప్తారు

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అప్పట్లో రామ్ తో దేవదాసులో నటించి ఒక్కసారిగా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయిన ఇలియానా లాగే ఇప్పుడు కీర్తి సురేష్ కూడా దూసుకుపోతోంది. రామ్ హీరోగా తెరకెక్కిన 'నేనూ శైలజ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది కీర్తి సురేష్. ఇప్పుడు నాని హీరోగా రూపొందుతున్న నేను లోకల్ చిత్రంలో చేస్తూ బిజీగా ఉన్న వరస పెట్టి పెద్ద హీరోల సినిమాల్లో ఆఫర్స్ వస్తున్నాయి.

ఫోటో గ్యాలరీ : కీర్తి సురేష్

ఇప్పటికే అల్లు అర్జున్ హీరోగా లింగు స్వామి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో కీర్తి సురేష్ ను హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తుండగా, ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ ఈ అమ్మడిని వరించింది.

Keerthy Suresh in Koratala  Mahesh Babu's film?

ప్రస్తుతం మురగదాస్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న మహేష్ బాబు, ఆ సినిమా తరువాత తెలుగు దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్ లో ఓ భారీ చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా చాలామంది బాలీవుడ్ తారల పేర్లు వినిపించినా, ఫైనల్ గా కీర్తి సురేష్ నే ఫైనల్ చేశారట.

ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ లేకపోయినా ఈ రెండు సినిమాలు కన్ఫామ్ అయితే మాత్రం కీర్తి సురేష్ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా జెండా పాతేస్తుందంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.

Keerthy Suresh in Koratala  Mahesh Babu's film?

గతంలోనే విజయనిర్మల మనవడు హీరోగా తెరకెక్కిన 'ఐనా ఇష్టం నువ్వు' అనే సినిమాలో కీర్తి హీరోయిన్ గా నటించినా.., ఆ సినిమా ఇంత వరకు రిలీజ్ కాలేదు. దీంతో రెండో సినిమాతో తొలిసారిగా టాలీవుడ్ లో మెరిసిన ఈ భామ స్టార్ హీరోల దృష్టిని ఆకర్షించింది. తెలుగులో తొలి సినిమాతోనే టాలీవుడ్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుందీ ఈ మలయాళీ భామ.

English summary
Keerthy Suresh is almost finalised as one of the two female leads in director Koratala, Mahesh Babu's movie.
Please Wait while comments are loading...