twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఖైదీ వల్లే బాలయ్య "రైతు" ఆగిపోయిందా..??

    బాలయ్య కృష్ణవంశీతో చేద్దామనుకున్న 'రైతు' డౌట్‌లో పడినట్టు సంకేతాలు అందుతున్నాయి. 'రైతు' ప్రాజెక్ట్‌ అనుమానంలో పడడానికి కారణం 'ఖైదీ నంబర్‌ 150' అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. .

    |

    గౌతమీపుత్ర శాతకర్ణి అందించిన హిట్ తో సూపర్ ఆనందం లో ఉన్నాడు బాలయ్య. ఊహించిన దానికంటే కూడా ఎక్కువ విజయాన్నే అందించింది ఈ 100వ సినిమా. ఒక మైల్ స్టోన్ అనుకునే స్త్ఘాయి విజయాన్నే సాధించాడు బాలయ్య. అయితే దీని తర్వాతి సినిమాగా కృష్ణవంశీతో చేద్దామనుకున్న 'రైతు' డౌట్‌లో పడినట్టు సంకేతాలు అందుతున్నాయి.

    నిజానికి వాయిదా కాదు ఆగిపోయిందన్న వార్తలూ వినిపించాయి. అయితే అధికారికంగా మాత్రం ఇంకా ఎవరూ దృవీకరించక పోవటం తో ఖచ్చితమైన క్లారిటీ ఎవరిదగ్గరా లేదు. నిజానికి తన వందవ చిత్రంగానే 'రైతు' చేద్దామని డిసైడైన తర్వాత క్రిష్‌ కలిసి 'గౌతమిపుత్ర శాతకర్ణి' ఐడియా చెప్పడంతో మిగిలిన ప్లాన్స్‌ అన్నీ అలా వదిలేసి ఆ చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసారు బాలయ్య. ఈలోగా 'రైతు' కోసం కృష్ణవంశీ తన సన్నాహాల్లో బిజీ అయ్యాడు. అందులో ఒక కీలక పాత్రకోసం అమితాబ్‌బచ్చన్‌ని కూడా కలిసి వచ్చారు.

    ఆ చిత్రంలో అమితాబ్‌ నటిస్తేనే రైతు చేస్తానంటూ బాలకృష్ణ పదే పదే చెబుతున్నారు. కానీ అమితాబ్‌ రైతు చేసేందుకు సుముఖంగా లేరంటూ వార్తలొస్తున్నాయి. అమితాబ్‌తో లింక్‌ పెట్టినప్పటికీ 'రైతు' ప్రాజెక్ట్‌ అనుమానంలో పడడానికి కారణం 'ఖైదీ నంబర్‌ 150' అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. . రైతులపై పోరాటం చేసే ఒక నాయకుడి స్టోరీగా ఇది తెరకెక్కనున్నట్లు, అందులో బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ కూడా ఓ ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది.

    Khaidi is the Reason For Balayya To Ignore Raithu

    అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ అటకెక్కినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఈ ప్రాజెక్టు విషయంలో బాలయ్య అసంతృప్తిగా ఉండటమేనట. ఇప్పటికే ఈ స్టోరీకి కూడా ఓకే చెప్పి జనవరిలోనే ఈ మూవీ సెట్స్‌ మీదకు తీసుకెళ్లాలనుకునే సమయంలో బాలయ్య తన అసంతృప్తిని బయట పెట్టారని టాక్.

    ప్రాజెక్ట్‌ విషయంలో కథని మార్చితే తప్ప సినిమా ముందుకు నడవదు అన్న టాక్ కూడా వినిపిస్తోంది. అయితే అసలు రైతు అన్న టైటిలే రైతుల సమస్యల మీద చరిచించే కథ కాబట్టి ఇక కథని మారిస్తే మొత్తంగా సినిమానే మారిపోతుంది. కానీ ఇదే లైన్ అయితే మాత్రం ప్రేక్షకులు ఇప్పటికే ఖైదీ చూసేసారు కాబట్టి రైతు ని పెద్దగా ఆదరించరేమో అన్న అనుమానం ఉండనే ఉంది అసలు ఏం జరిగింది?? ఇవన్నీ పుకార్లేనా లేక నిజంగానే ఈ ప్రాజెక్ట్ వాయిదా పడనుందా అన్నది ప్రాజెక్ట్ ప్రముఖులనుంచి వస్తే తప్ప చెప్పలేం.

    రైతు సమస్యలపై ఖైదీ నంబర్‌ 150 చిత్రంలోను చర్చించడంతో, ఇప్పుడు ఆ బ్యాక్‌డ్రాప్‌లో ఏమి చేసినా ఆ చిత్రాన్ని కాపీ చేసినట్టు ఉంటుందని బాలకృష్ణ భావిస్తున్నారట. ఇందులో ఎంత నిజముందనేది తెలియదు కానీ రైతు ల సమస్యల మీద చిత్రం అనగానే ఖచ్చితంగా 'ఖైదీ 150' గుర్తుకు వస్తుందన్నది కాదనలేని నిజం. అందుకే కాస్త వెనకాడుతున్నారట. మొత్తానికి ఖైదీ హవా ముగిసే వరకూ రైతు రానట్టేనా...??

    English summary
    Balakrishna not happy with Krishna Vamsi’s tuning narrated sources. There has been a huge communication gap as Balayya was not convinced with the final draft. If sources are to be believed, Rythu has been kept on hold currently.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X