twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లీకైంది : అఖిల్ తొలి చిత్రం కథ గురించి...

    By Srikanya
    |

    హైదరాబాద్ : నాగార్జున రెండో కుమారుడు అక్కినేని అఖిల్ చిత్రానికి రంగం సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. వివి వినాయిక్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంకు వెలిగొండ శ్రీనివాస్ కథ అందిస్తున్నారు. ఈ చిత్రం ఓ సోషియో ఫాంటసీ అని తెలుస్తోంది. 'జగదేక వీరుడు అతిలోక సుందరి' తరహాలో ఈ చిత్రం ఉండబోతోందని వినికిడి. పై లోకం నుంచి వచ్చిన హీరోయిన్ తో ఇక్కడ తిరిగే లోకల్ కుర్రాడు ప్రేమాయణమే కథనం అంటున్నారు. అందులో యాక్షన్ ఎలిమెంట్స్ , కామెడీని సైతం మిక్స్ చేసారంటున్నారు. కోన వెంకట్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించనున్నాడు. వెలిగొండ శ్రీనివాస్ అందించిన కథతో గతంలో నాగార్జున హీరోగా ఢమురకం చిత్రం వచ్చింది. అలాగే రామ్ చేస్తున్న పండుగ చేస్కో చిత్రానికి సైతం వెలిగొండ కథనే అందిస్తున్నారు.

    అక్కినేని అఖిల్ లాంచింగ్ కోసం అక్కినేని కుటుంబ అభిమానులే కాకుండా తెలుగు సినీ అభిమానులు సైతం ఎదురుచూస్తున్నారు. ఆ క్షణాలు దగ్గరపడ్డాయని సమాచారం. అఖిల్ చివరకు వివి వినాయిక్ దర్శకత్వంలో నే ఫైనల్ చేసారని ఫిల్మ్ నగర్ వార్త. అయితే హీరోయిన్ మాత్రం ఫైనల్ కాలేదని అంటున్నారు. అది కనుక సెట్ అయితే త్వరలోనే ఈ మేరకు అఫీషియల్ గా లాంచింగ్ ప్రకటన రానున్నదని సమాచారం.

    హీరోయిన్ గా ప్రెష్ గా ఉండే అమ్మాయిని తీసుకోవాలని ఒక ఆలోచన ఉంటే, వినాయిక్ మాత్రం రాశిఖన్నావైపు మొగ్గు చూపుతున్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే నాగార్జున మాత్రం హీరోయిన్ హంట్ కొనసాగిస్తున్నారని, ఆ మేరకు ఓ స్పెషల్ టీమ్ ని ఏర్పాటు చేసారని చెప్పుకుంటున్నారు. అఖిల్ ఎత్తు, ఫిజిక్ కి తగ్గట్లుగా ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం.

    Kona Venkat joins Akhil's Debut

    మరో ప్రక్క అఖిల్ ఫిజిక్ ని కూడా పికప్ చేయమన్నాడని చెప్తున్నారు. తమ సబ్జెక్టులో అఖిల్ ఫైట్స్ అవీ చేస్తాడు కాబట్టి దానికి తగ్గ ఫిజిక్ ఉంటే బాగుంటుందని, ఫొటో షూట్ చేసిన వినాయిక్ భావించి, ఆ దిసగా అఖిల్ ని ప్రిపేర్ అవమన్నాడని మరో వర్గం అంటోంది. అయితే ఇందులో ఏది నిజమో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

    ఇక ఈ చిత్రాన్ని నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి కో ప్రొడ్యూసర్ గా నిర్మించనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రూపొందనుంది. ఈ చిత్రం కోసం వినాయిక్ 15 కోట్లు వరకూ డిమాండ్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.

    అఖిల్ మాట్లాడుతూ...ఇక ఇప్పటికే నటనలో శిక్షణ పొందాను. థాయ్‌లాండ్‌లో తైక్వాండో శిక్షణ తీసుకున్నాను. రెండేళ్ల నుంచి డ్యాన్స్‌ తరగతుల్లో పాల్గొంటున్నాను. క్రికెట్‌ కూడా ఆడుతున్నాను. డ్యాన్స్‌, క్రికెట్‌ బాడీ స్వింగ్‌కు బాగా ఉపయోగపడతాయి. ఏం చేసినా పరిశ్రమలో అగ్రస్థానానికి చేరాలన్నదే నా కల. అందుకే కాస్త ఆలస్యమైనా అన్నింటా మేటిగా తయారై వస్తున్నాను అన్నారు.

    'మనం'లో అఖిల్‌ కనిపించేది 30 సెకన్లే. అది చూసి అంచనాకు రాలేం. 30 సెకన్ల వాణిజ్యప్రకటనలో అందరూ అందంగానే కనిపిస్తారు. పూర్తిస్థాయి హీరోగా ఎలా రాణిస్తాడో చూడాలి అంటున్నారు నాగార్జున. ఆయన రెండో కుమారుడు అఖిల్ హీరోగా లాంచ్ కాబోయే చిత్రం పై అంతటా ఎక్సపెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. ఈ నేపధ్యంలో నాగార్జున పుత్రోత్సాహంతో ఇలా స్పందించారు.

    అలాగే నవ్వుతూ... ''అఖిల్‌ మరో మహేష్‌ అవుతాడు.. అంటుంటే అంతకంటే ఆనందం ఉంటుందా? ఇంకొంతమంది చైతూకి పోటీ వస్తున్నాడా? అని అడుగుతున్నారు. చైతన్య సంగతి పక్కన పెట్టండి. అఖిల్‌కి పోటీగా నేనున్నాను కదా.? నన్ను దాటమనండి.అఖిల్‌కి తనపై తనకు నమ్మకం ఎక్కువ. చిన్నతనం నుంచి ఇలాగే కాన్ఫిడెన్స్‌గా ఉండేవాడు అని అన్నారు.

    English summary
    Actor-producer Akkineni Nagarjuna roped in Kona Venkat to work on the script of Akhil's maiden film. Dhamarukam writer Veligonda Srinivas to provide story for the socio-fantasy on the lines of Jagadekaveerudu Athilokasundari, Kona Venkat is said to be the latest addition of the team who will pen the screenplay.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X