twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాపీ రైట్స్ ప్లాబ్లం వల్లే వెంకి , క్రిష్ ప్రాజెక్టు ఆపేసారు?

    వెంకటేష్, క్రిష్ ప్రాజెక్టు ఆగిపోయినట్లే అని తెలుస్తోంది.

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఇప్పటికే చిరు 150, బాలయ్య 100 సెన్సేషనల్ గా వార్తల్లో నిలిచి, సూపర్ హిట్స్ అయ్యాయి. దాంతో వెంకటేష్ 75వ సినిమా కూడా అంతే క్రేజ్ సాధించాలని ప్లాన్ చేస్తున్నారు. అందులో వెంకటేష్ గురు తర్వాత చేయబోయే సినిమాకి డైరక్టర్ గా ముందు కిశోర్ తిరుమల అనుకోగా అది కాదని పూరితో గాని క్రిష్ తో గాని చేయాలని ఫిక్స్ అయ్యారు.

    అందులో భాగంగా మొదట దర్శకుడు క్రిష్ తో ముందుకు వెళ్దామనుకున్నారు. దాంతో కొద్ది రోజులు చర్చలు జరిగాయి. శాతకర్ణితో సత్తా చాటిన క్రిష్ ఇప్పుడు వెంకటేష్ తో కూడా భారీ ప్రాజెక్ట్ చేస్తాడని వార్తలు వచ్చాయి. సినిమాలో గ్రాఫిక్స్ కు ఎక్కువ స్కోప్ ఉంటుందని చెప్పుకున్నారు. అయితే ఊహించని విధంగా ఇప్పుడా ప్రాజెక్టు ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి.

    Krish and Venky film shelved!

    అందుకు కారణం స్క్రిప్టుకు సంభందించిన కొన్ని కాపీ రైట్ సమస్యలని చెప్పుకుంటున్నారు. వెంకటేష్ తో చిత్రం చేయటం కోసం ఓ నవల రైట్స్ ని క్రిష్ తీసుకుందామని ప్రయత్నించారని, అయితే ఆ రైట్స్ దొరకకపోవటంతో ఆ ప్రాజెక్టు విరమించుకున్నట్లు వినికిడి. దానికి కోడు గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రం సైతం అనుకున్న స్దాయిలో విజయం సాధించకపోవటం కూడా ఓ కారణంగా చెప్పుకుంటున్నారు.

    ఈ లోగా తాజాగా పూరి జనగణమన కథ కాకుండా వేరే కథను రెడీ చేసుకొని , వెంకీ కి వినిపించాడట. ఆ లైన్ బాగా నచ్చడం తో వెంకీ , పూరి కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. త్వరలోనే దీనికి సంబదించిన ప్రకటన తెలియజేయనున్నారని వినికిడి.

    English summary
    Krish and Venkatesh's project is now shelved and they have both decided to work together later. Part of the story is based on a novel and they tried to get the rights of that particular book, but couldn’t.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X