» 

యాక్షన్ కింగ్ మోహన్ బాబు వల్ల హీరోయిన్ గా ఎదగలేకపోతున్నా...!?

Posted by:

ఇంతకుముందు తెలుగు సినిమాల్లో నటించాలనే కోరిక లేకపోవడంతో ఇన్నాళ్లూ నటనకి దూరంగా ఉన్న మంచు లక్ష్మీ ప్రసన్న, థర్టీ ప్లస్ ఏజ్ లో తెలుగులో తొలి సినిమాచేసింది. నటిగా గుర్తింపు వచ్చేసరికి ఆమెకి అవకాశాలు పెరిగాయి. అయితే మిగిలిన హీరోయిన్లలా గ్లామరస్ పాత్రలు ఆమెని వరించడం లేదు. మహా అయితే విలన్ పాత్రలు, యాక్షన్ లేడీ క్యారెక్టర్లు ఆఫర్ చేస్తున్నారు. అలాగే కంటిన్యూ అయితే తాను కోరుకుంటున్నట్టుగా లక్ష్మి ఎప్పటికి హీరోయిన్ కాలేదు.

పైగా ఆమెకి గ్లామర్ నటిగా అనిపించుకోవడం, గ్లామరస్ డ్రస్ లు వేసుకుని తిరగడమంటే మహా సరదా. అయితే మంచు లక్ష్మిని అలాంటి పాత్రలతో అప్రొచ్ కావడానికి ఎవరికీ ధైర్యం చాలడం లేదు. అలాంటి పాత్రలు ఆఫర్ చేస్తే మోహన్ బాబు ఏమంటాడో, ఎలా రియాక్ట్ అవుతాడోనని ఎవరికీ ధైర్యం చాలడంలేదు. అలాంటి పాత్రలు ఆఫర్ చేస్తే మోహన్ బాబు ఏమంటాడో, ఎలా రియాక్ట్ అవుతాడోనని, కోరుకున్నట్టుగా నటించలేకపోతున్నానని మంచు లక్ష్మి కూడా ఫీలవుతోంది. ఇక ఎవరూ తనని సంప్రదించకపోతే మంచు లక్ష్మి తనే ఓ సినిమా తీసి కోరుకున్నట్టుగా నటించిన మిగతా వాళ్లకీ అలాంటి పాత్రలతో అప్రోచ్ అయ్యే ధైర్యాన్నిచ్చే అవకాశముంది. దాని కోసం కసరత్తు కూడా జరుగుతున్నట్టు తెలిసింది. అయితే రీసెంట్ గా 'గుండెల్లో గోదావరి" సినిమాకి హీరోయిన్ గా అఫర్ వరించింది మరి హీరోయిన్ గా ఎలా నిలబడుతుందో వేచిచూడాల్సిందే...

Read more about: lakshmi prasanna, mohan babu, anaganaga o dheerudu, siddharth, లక్ష్మీ ప్రసన్న, మోహన్ బాబు, అనగా అనగా ఓ ధీరుడు, సిద్ధార్థ
English summary
Though Manchu Lakshmi is flooded with offers of heroine and villain roles, she has just accepted one project as heroine which is named as 'Gundello Godari' to be directed by a debutant. What remains to be seen is, how far Lakshmi will create an impact as heroine?

Telugu Photos

Go to : More Photos