twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లీకైంది: విక్రమ్‌ 'ఐ' కథ ఇదే??(ఫొటో ఫీచర్)

    By Srikanya
    |

    హైదరాబాద్ :విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఐ (తెలుగులో మనోహరుడు) చిత్రం ప్రారంభం నుంచే భారతీయ సినీ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోన్న సంగతి తెలసిందే. ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం చెన్నైలో విడుదల చేసిన ఈ సినిమా ఆడియో మంచి విజయం సాధించి సినిమాపై మరింత క్రేజ్ క్రియేట్ చేసింది. శంకర్, విక్రమ్ సినిమాలకి తమిళం తర్వాత మళ్లీ అదేస్థాయిలో ఫ్యాన్ బేస్, మార్కెట్ వున్న ఏరియా తెలుగు పరిశ్రమ. అందుకే తెలుగు ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించడం కోసం ప్రత్యేకమైన దృష్టిని పెడుతున్నారు.ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథ బయిటకు వచ్చి తమిళ ఫిల్మ్ సర్కిల్స్ లో , తమిళ మీడియాలో నలుగుతోంది. లీకైందంటూ చెప్పబడుతున్న ఈ కథ ఎంతవరకూ నిజమో కాదో అన్నది రిలీజయ్యేదాక తెలియదు.

    కథేమిటంటే...

    ప్రముఖ కండల వీరుడు, హాలీవుడ్‌ నటుడు ఆర్నాల్డ్‌ స్క్వార్జ్‌నెగ్గర్‌ను ఆదర్శంగా తీసుకొని ప్రపంచ మేటి కండల వీరుడు కావాలనేది లింగేశన్‌ అనే యువకుడి కల. దీని కోసం ఎంతో కష్టపడతాడు. తన కల నెరవేరుతుందన్న సమయంలో అనుకోకుండా ఓ అడ్డంకి ఎదురవుతుంది. అదేంటి.. దాన్నుంచి ఎలా బయటపడ్డాడు. తన కలను ఎలా నెరవేర్చుకున్నాడు అనే అంశం ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'ఐ'.

    తమిళ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం స్క్రీన్ ప్లే ఈ క్రింద విధంగా సాగుతుంది...ఇది కరెక్టు కావచ్చు..కాకపోవచ్చు... ఓ లుక్కేయండి..

    స్లైడ్ షోలో....ఆ కథనం...

    విలేజ్ కుర్రాడు...

    విలేజ్ కుర్రాడు...

    విక్రమ్ ఈ సినిమాలో విలేజ్ కుర్రాడుగా కనిపిస్తాడు. దాదాపు 16 సంవత్సరాల తర్వాత ఆమె తన విలేజ్ కు వస్తుంది. అది మరేదో కాదు..విక్రమ్ ఉంటున్న ఊరే. చిన్నప్పటి నుంచి వాళ్ళు బాల్య స్నేహితులు.దాంతో వారు దగ్గరవుతారు.

    మోడల్ అవ్వాలని..

    మోడల్ అవ్వాలని..

    ఆమె మోడలింగ్ ఫొటోలు చూసిన విక్రమ్ ఆమెను ఆరాధంచటం మొదలెడతాడు. అంతేకాదు...తాను ఓ మోడల్ అవ్వాలనుకుంటాడు.

    బ్రాండ్ అంబాసిడర్..

    బ్రాండ్ అంబాసిడర్..

    ఈ లోగా అమీ... ఓ MNC కంపెనీకు బ్రాండ్ అంబాసిడర్ అవుతుంది..అంతేకాకుండా... ఒలింపిక్స్ బీజింగ్ కు ప్రమోషనల్ మోడల్ అవుతుంది. ఆమె ఈ అవకాశాన్ని విలన్ ...ఉపేన్ ని దాటి సంపాదిస్తుంది. అతను అంతకు ముందు ఆ బ్రాండ్ కు అంబాసిడర్.

    కాలిన విలన్...

    కాలిన విలన్...


    అమీ తన ఆఫర్ ని కొట్టుకుపోవటంతో కాలిన విలన్ ఆమె పేరు పోగొట్టాలనుకుంటాడు..దాంతో ఓ స్పామ్ వీడియోను వదులుతాడు.

    అంతేకాకుండా..

    అంతేకాకుండా..


    అమీ ని దెబ్బకొట్టడానికి చేసిన ప్రయత్నంలో తన అందం సైతం పోగొట్టుకుంటాడు విలన్.

    ప్రయోగం...

    ప్రయోగం...

    తిరిగి తన అందం సంపాదించుకోవటానికి తన తండ్రి కెమెకల్ ఫ్యాక్టరీలో ఓ మెడిసన్ ని తయారుచేస్తాడు. దాన్ని టెస్ట్ చేయటానికి ఎవరో ఒకరు కావాలి. అందుకు విక్రమ్ ని ఎంచుకుంటాడు. మోడల్ అవ్వాలనుకున్న అతన్ని రప్పిస్తాడు.

    సక్సెస్...

    సక్సెస్...

    ఆ కెమెకల్ వాడటంతో విక్రమ్ మరింత బాగా తయారవుతాడు. అంతేకాకుండా...టాప్ మోడల్ అవుతాడు.

    అమీ లవ్ లో...

    అమీ లవ్ లో...

    ఇప్పుడు టాప్ మోడల్ గా ఎదిగిన విక్రమ్ తో అమీ ప్రేమలో పడుతుంది. ఆమె తన ప్రేమను వ్యక్తం చేద్దామనుకునే లోగా మరో ట్విస్ట్ పడుతుంది.

    సైడ్ ఎఫెక్టులు

    సైడ్ ఎఫెక్టులు

    విక్రమ్ కు ఎక్కించిన ఆ కెమెకల్ మెల్లిమెల్లిగా సైడ్ ఎఫెక్టులు చూపుతూ ..రివర్స్ అవుతుంది. అతను అంద వికారంగా తయారవుతాడు. ఎవరూ అతన్ని గుర్తు పట్టరు.

    జంతువుగా...

    జంతువుగా...


    ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఈ సన్నివేశాల్లో... నార్మల్ గా ఉండే విక్రమ్ ...జంతువుగా ట్రాన్సఫార్మ్ అవుతాడు.

    అసలు విషయం రివిల్

    అసలు విషయం రివిల్

    ఇలా జరుగుతుందనే విషయం విలన్ కు తెలిసే..తనపై ప్రయోగించాడని తెలుస్తుంది. అంతేకాదు త్వరలోనే అమీకు సైతం అదే ప్రయోగం చేయబోతున్నాడని అర్దమవుతుంది.

    విలన్ కోసం వెతుకులాట

    విలన్ కోసం వెతుకులాట

    దాంతో విలన్ ని చంపాలని అతని కోసం జంతువు గా మారిన విక్రమ్ వెతుకులాట మొదలెడతాడు. అయితే ఎక్కడా అతను కనపడడు.

    ఎంగేజ్ మెంట్...

    ఎంగేజ్ మెంట్...


    జంతువుగా మారిన విక్రమ్ ని చూసి అసహ్యించుకున్న అమీ..ఓ కోటీశ్వరుడుతో ఎంగేజ్ మెంట్ చేసుకుంటుంది.

    కిడ్నాప్..

    కిడ్నాప్..


    అప్పుడు వేరే దారి లేని పరిస్ధితుల్లో అమీని కిడ్నాప్ చేస్తాడు విక్రమ్.

    క్లైమాక్స్

    క్లైమాక్స్

    హీరోయిన్ ని తుదముట్టించాలని విలన్..ఆమెను సేవ్ చేసి తన అసలు రూపం రావటానికి చేసే ప్రయత్నం విక్రమ్...ఈ రెండింటితో క్లైమాక్స్ వస్తుంది.

    తెలుగులో...

    తెలుగులో...

    విక్రమ్‌, అమీజాక్సన్‌ హీరో,హీరోయిన్స్. భారీ చిత్రాల దర్శకుడు శంకర్‌ నుంచి రాబోతున్న చిత్రమిది. ఆస్కార్‌ ఫిల్మ్‌ పతాకంపై వి.రవిచంద్రన్‌ నిర్మించారు. తెలుగులో మెగా సూపర్‌గుడ్‌ ఫిల్మ్స్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది.

    సంక్రాంతికే...

    సంక్రాంతికే...

    వచ్చే నెలలో తెలుగు గీతాలను విడుదల చేస్తారు. తెలుగు, తమిళ, హిందీల్లో రూపొందిన ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, ఛాయాగ్రహణం: పీసీ శ్రీరామ్‌, కూర్పు: ఆంటోని

    దర్శకుడు శంకర్‌ మాట్లాడుతూ ....

    దర్శకుడు శంకర్‌ మాట్లాడుతూ ....

    ''ఈ సినిమా కోసం ప్రత్యేకించి పలు హాలీవుడ్‌ కంపెనీలు పనిచేశాయి. ఆ ప్రతినిధులు షూటింగ్‌ చూసి ఇలాంటి సినిమాల్లో నటించడం విక్రమ్‌లాంటి నటుడికే సాధ్యమన్నారు. అంత అంకిత భావంతో విక్రమ్‌ నటించాడు'' అన్నారు.

    విక్రమ్‌ మాట్లాడుతూ....

    విక్రమ్‌ మాట్లాడుతూ....

    ''శంకర్‌ లాంటి దర్శకుడి చిత్రంలో మళ్లీ నటించడం వరంగా భావిస్తున్నా. ఈ సినిమా ప్రపంచ సినీ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇప్పుడు మీ ముందు కన్పిస్తున్న 'మృగం' వంటి పాత్ర కోసం కనిష్టంగా మూడు గంటల పాటు మేకప్‌ వేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఎంతో ఓర్పుతో మేకప్‌ వేసుకుని కెమెరా ముందుకెళ్లాను. ఇలాంటి సినిమాలో నటించడం ఓ సవాలు లాంటిదే. ఇలాంటి మరో నాలుగు పాత్రల్లో సినిమాలో కన్పిస్తాను. ''అన్నారు.

    మాయాజాలం...

    మాయాజాలం...

    వెండితెరపై సాంకేతిక మాయాజాలాన్ని ప్రదర్శిస్తుంటారు దర్శకుడు శంకర్‌. ప్రతి సన్నివేశం ప్రేక్షకుడిని ముగ్ధుడిని చేస్తుంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో చిత్రాల్ని తీర్చిదిద్దుతుంటారు. విక్రమ్‌తో తీస్తున్న 'ఐ' కోసం పలు విదేశీ కంపెనీలతో కలసి పని చేస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

    English summary
    This is the basic speculations from Kollywood circles about the upcoming film ‘I’ which is recently in post production works.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X