twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రిస్క్ తీసుకుంటున్నారా? అంచనాలు మించిన బడ్జెట్: స్పైడర్ పై 130 కోట్లు??

    ఈ లేటెస్ట్ 10 కోట్లతో కలిపి స్పైడర్ బడ్జెట్ మొత్తం రూ.130 కోట్లకు చేరిందని తెలుస్తోంది. దక్షిణాదిలో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన చిత్రాల్లో ఒకటిగా నిలుస్తోంది స్పైడర్.

    |

    మొన్నటిదాకా బాహుబలి ఫీవర్ తో ఊగిపోయిన టాలీవుడ్ ఇప్పుదిప్పుడే ఆ ప్రభావం నుంచి బయటికి వస్తోంది. ఇప్పటికిప్పుడు వచ్చే మరో రెండు భారీ ప్రాజెక్టు లమీదే ఇప్పుడు అందరి దృష్ఠీ ఉంది. ఒకటి స్పైడర్ అయితే రెండోది అల్లు అర్జున్ DJ దువ్వాడ జగన్నాధం., మురుదగాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న స్పైడర్.. హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న డీజే చిత్రాలు.. బాక్సాఫీస్ ను షేక్ చేస్తాయనే అంచనాలున్నాయి...

    దువ్వాడ జగన్నాధం జూన్ 23న

    దువ్వాడ జగన్నాధం జూన్ 23న

    ఇప్పటికే దువ్వాడ జగన్నాధం తాను జూన్ 23న వస్తున్నాను అంటూ ఒక క్లారిటీ ఇచ్చేసాడు. ఎటొచ్చీ స్పైడర్ విడుదల మీదే అందరికీ అనుమానం. మొదటి నుంచీ ఈ సినిమా టైమ్ విషయం లో మాటమీద నిలబడక పోయింది. ఫస్ట్ లుక్ విషయం లోనే అభిమానులకు చిరాకు వచ్చే దాకా చేసుకున్నారు.

    మరో 10 కోట్లు పెంచారట.

    మరో 10 కోట్లు పెంచారట.

    ఆ సంగతలా ఉంచి తే ఇప్పుడు వచ్చిన మరో న్యూస్ కాస్త భయపెట్టేదే... మనల్ని కాదు నిర్మాతలను. గ్రాఫిక్స్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ అయినా బాహుబలి2 తో పోలిక వచ్చేస్తుందనే విషయం స్పైడర్ యూనిట్ కి బాగానే అర్ధమైంది. అందుకే విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా.. బడ్జెట్ ను మరో 10 కోట్ల రూపాయల మేర పెంచారట.

    మొదలు పెట్టేటప్పుడే 80 కోట్ల బడ్జెట్

    మొదలు పెట్టేటప్పుడే 80 కోట్ల బడ్జెట్

    అంటే ముందు అనుకున్న బడ్జెట్ ఇప్పుడు ఈ పదికోట్లతో 130 కోట్లకు చేరింది. ఒకరకంగా ఇది బాహుబలి ఫస్ట్‌పార్ట్ బడ్జెట్ తో సమానం (140 కోట్లు) అసలు మొదలు పెట్టేటప్పుడే 80 కోట్ల బడ్జెట్ అని చెప్పటం అందరికీ అంత భారీ బడ్జెట్ రిస్క్ ఏమో అనిపించింది. అయితే మహేష్ చరిష్మా, మురుగ దాస్ ట్రాక్ రికార్డ్ చూసి ఓకే అనుకున్నారు. తర్వాత కొన్నళ్ళకే ఈ లెక్కలు 100 కోట్లు దాటాయ్.

    బాహుబలికి వర్క్ చేసిన మకుట

    బాహుబలికి వర్క్ చేసిన మకుట

    అదే ఎక్కువేమో అనుకుంటే ఇప్పుడు ఈ పెరిగిన బడ్జెట్ ఇంకా ఎక్కువ అన్న ఫీలింగ్ తెచ్చేసింది. ఇప్పటికే టాకీ పార్ట్ షూట్ మొత్తం పూర్తయిపోగా.. ఇంకా రెండు పాటలను మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది. ఈ రెండు పాటల్లో ఒకటి ఫారిన్ లొకేషన్స్ లోను.. రెండో పాటను హైద్రాబాద్ లోని స్టూడియోలో సెట్స్ వేసి తెరకెక్కించనున్నారు. బాహుబలికి వర్క్ చేసిన మకుట సంస్థకే ఈ వర్క్ కూడా అప్పగించడం విశేషం.

    దక్షిణాదిలో అత్యంత భారీ బడ్జెట్

    దక్షిణాదిలో అత్యంత భారీ బడ్జెట్

    ఈ లేటెస్ట్ 10 కోట్లతో కలిపి స్పైడర్ బడ్జెట్ మొత్తం రూ.130 కోట్లకు చేరిందని తెలుస్తోంది. దక్షిణాదిలో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన చిత్రాల్లో ఒకటిగా నిలుస్తోంది స్పైడర్. జూన్ 2తో స్పైడర్ పాటల షూటింగ్ కూడా పూర్తయిపోనుందని తెలుస్తోంది. షూటింగ్ పూర్తయిపోవడం బాగానే ఉంది కానీ.. సినిమా రిలీజ్ పై మాత్రం దర్శకుడు మురుగదాస్ నుంచి చిత్ర యూనిట్ ఎవరూ నోరు మెదపడం లేదు.

    ఏమాత్రం రిజల్ట్ అటూ ఇటైనా

    ఏమాత్రం రిజల్ట్ అటూ ఇటైనా

    ఇందుకు కారణం.. ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ ఇంకా బ్యాలెన్స్ ఉండడమే. ఇప్పుడు గ్రాఫిక్స్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ అయినా పడుతుందని భావిస్తున్నారు యూనిట్. అందుకే ఎక్కడా కాంప్రమైజ్ కావటం లేదు అయితే ఇక్కడి వరకూ బాగానే ఉంది గానీ ఏమాత్రం రిజల్ట్ అటూ ఇటైనా బ్రహ్మోత్సవం లాంటి పెద్ద దెబ్బ ఎదుర్కోవలసి వస్తుంది.

    తమిళ సినిమా మల్లన్న విషయం

    తమిళ సినిమా మల్లన్న విషయం

    గతం లోనూ ఇలాంటి హైప్ తోనే వచ్చిన తమిళ సినిమా మల్లన్న విషయం లోనూ ఇలాగే జరిగింది. హాలీవుడ్ జేమ్స్ బాండ్ రేంజ్ అంటూ విపరీతమైన బడ్జెట్ పెట్టారు (అప్పటి లెక్కల ప్రకారం అది భారీ బడ్జెట్టే) తర్వాత వచ్చిన రిజల్ట్ పెద్ద దెబ్బ వేసింది. విపరీతంగా పెరిగిన అంచనాలని అందుకోలేక చతికిల బడింది.

    మురుగ దాస్ వ్యూహం ఫలిస్తే

    మురుగ దాస్ వ్యూహం ఫలిస్తే

    ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుందని అనలేం గానీ బాహుబలి లాంటి ప్రాజెక్ట్ ని చూసి అలానే ఆదరిస్తారనుకుంటే మాత్రం కాస్త ఆలోచించుకోవాలి. మహేష్ చరిష్మాకి సినిమా బలం కూడా తోడై మురుగ దాస్ వ్యూహం ఫలిస్తే మాత్రం ఓకే గానీ లేదంటే కష్టాలు తప్పవు మరి...

    English summary
    Mahesh Babu Starrer SPYder budget has just ranked to Rs 130 Its almost equal to Bahubali budget was almost Rs 140 crore for first Part. AR Murugadoss is directing the film and the film makers are not compromising at any state
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X