twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ కు 'హ్యాండ్ వెయిట్ ' ఎక్కువా?

    By Srikanya
    |

    హైదరాబాద్ : నీకు హెడ్ వెయిట్ ఉంటే...నాకు హ్యాండ్ వెయిట్ ఎక్కవ చూస్తావా అనే డైలాగు ..మహేష్ తాజా చిత్రం శ్రీమంతుడులో ఉందటూ ప్రచారం జరుగుతోంది. విలన్ తో ఈ డైలాగు చెప్తాడని చెప్పుకుంటున్నారు. అయితే ప్రతీ సారి పెద్ద హీరోల చిత్రాల రిలీజ్ కు ముందు ఇలా ఆ చిత్రంలో లీక్ డైలాగులు అంటూ రావటం, తర్వాత అవి సినిమాలో కనిపించకుండా పోవటం జరుగుతున్నాయి. కొందరు క్రియేటివిటి పాళ్లు కాస్త ఎక్కువ ఉన్నవాళ్లు వీటిని ప్రచారంలోకి తీసుకురావటం జరుగుతోంది. అలాగే..మనుషుల్లో మంచి పోయి కృత్రిమత్వమే మిగిలింది సార్ అనేది కూడా ఈ చిత్రంలో డైలాగే అంటున్నారు. నిజంగా ఈ రెండు డైలాగులు ఉన్నాయో లేవో తెలియాలంటే సినిమా రిలీజ్ దాకా ఆగాల్సిందే.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    చిత్రం తాజా అప్ డేట్స్ విషయానికి వస్తే..

    Mahesh 'Hand Weight'Dialogue

    మహేష్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ సినిమాలో నటించే అవకాశం యంగ్ హీరో రాహుల్‌ను వరించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సినిమాను మలుపుతిప్పే ఓ కీలకపాత్రలో రాహుల్ నటిస్తున్నారు. మలేషియాలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌లో రాహుల్ ఇప్పటికే జాయిన్ అయ్యారు. మహేష్ తో పనిచేయటం చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు.

    మహేష్‌బాబు సినిమా అంటేనే ఇంటిల్లిపాదీ చూసేలా ఉంటుంది. కుర్రకారుకి నచ్చే యాక్షన్‌, పెద్దవాళ్లని మెప్పించే భావోద్వేగాలూ, అందరూ ఇష్టపడే వినోదం... ఇలా దేనికీ లోటు చేయరు. ఇప్పుడు మరోసారి అలాంటి కథతోనే సందడి చేయనున్నారు. 'శ్రీమంతుడు' అనే పేరు పరిశీలనలో ఉంది. అయితే చిత్రబృందం ఇంకా అధికారికంగా ధ్రృవీకరించలేదు.

    ఓవర్ సీస్ లో లీడింగ్ డిస్ట్రిబ్యూటర్స్ సౌత్ ఇండియన్ క్లాసిక్ ఎంటర్టైన్మెంట్ వారు ఈ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. ఓవర్ సీస్ లోనూ భారీగ ఈ చిత్రం విడుదల కానుంది.

    Mahesh 'Hand Weight'Dialogue

    నిర్మాతలు మాట్లాడుతూ...''భారీ హంగులతో తెరకెక్కుతున్న చిత్రమిది. మహేష్‌ శైలికి తగ్గట్టుగా మాస్‌ అంశాల్ని మేళవించి కథను సిద్ధం చేశారు దర్శకుడు. అందరికీ నచ్చే ఓ మంచి సినిమా అవుతుంది''అని చెబుతున్నారు . ఓవర్సీస్ లో అత్తారింటికి దారేది వంటి భారీ సినిమాలు పంపిణీ చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

    కథపై పూర్తి కసరత్తు చేసి మరీ కొరటాల శివ కసిగా రంగంలోకి దిగాడంటున్నారు. హిట్ ఖాయం అనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది.
    శ్రీమంతుడు అనే టైటిల్ అనుకుంటున్న ఈ చిత్రంలో మహేష్ బాబు పాత్ర ఓ ప్లే బోయ్ అని, బోర్న్ రిచ్ అని ప్రచారం జరుగుతోంది. ఎప్పుడూ సిటీ దాటని వాడు... ఓ గ్రామం ను దత్తత తీసుకుని..అక్కడ పరిస్దితులు చక్కబెడతాడని అంటున్నారు.

    ఆ ఊరు పరిస్ధితులు బాగోలేక జనం ఖాళీ చేసి వెళ్లిపోతుంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్ధితుల్లో అక్కడికి ప్రవేసించిన మహేష్... ఆ ఊరుతో అనుబంధం పెంచుకుంటాడని అంటున్నారు. ముఖ్యంగా సినిమాలో అక్క సెంటిమెంట్ ప్రధానంగా సాగుతుందని అంటున్నారు. అయితే ఇది ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న ఊహాగానం మాత్రమే. ఎంతవరకూ నిజమో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

    దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, సుకన్య, అలీ, వెన్నెల కిషోర్‌, సితార, తులసి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.సంగీతం:దేవిశ్రీప్రసాద్,ఫోటోగ్రఫిః మది, ఫైట్స్: అరసు, ఎగ్జిక్యూటివ్ ప్రసాద్:అశోక్, నిర్మాతలుః ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సివియమ్. ఛాయాగ్రహణం: ఆర్‌.మది, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు.

    English summary
    Some of the dialogues of "Srimanthudu” have been leaked online and doing rounds on web.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X