twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఆగడు' కీ అదే వరస...తప్పటం లేదు

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఓవర్ బడ్జెట్ అనేది పెద్ద సినిమాలకు కామన్ గా మారింది. గతంలో '1 నేనొక్కడినే' తో ఈరోస్ వారి సాయిం తీసుకోవాల్సి వచ్చిన 14 రీల్స్ వారు అనుకున్న బడ్జెట్ పెరగటంతో మరోసారి ఫైనాన్స్ తీసుకున్నట్లు సమాచారం. మొదట 'ఆగడు' ప్రాజెక్టుని 38 కోట్లతో ప్లాన్ చేసారు. అయితే తర్వాత రకరకాల కారణాలతో 15 కోట్ల వరకూ బడ్జెట్ పెరగటం జరిగింది. బడ్జెట్ 55 కోట్లకు చేరింది. దాంతో వారు ఈ రోస్ వారి వద్ద లోన్ తీసుకున్నట్లు ట్రేడ్ వర్గాల్లో వినపడుతోంది. అయితే మహేష్ కు ఉన్న క్రేజ్ తో బిజినెస్ ఓ రేంజిలో జరుగుతూండటంతో ఆ సమస్య కనపడటం లేదని అంటున్నారు.

    'పోకిరి'.. 'దూకుడు'.. మహేష్‌ పోలీసు చిత్రాల వరుస ఇది. సినిమా సినిమాకి పోలీసు పాత్ర నిడివి పెరుగుతోంది. సినిమా సత్తా పెరుగుతోంది. తాజాగా 'ఆగడు' అంటూ మరోసారి బాక్సాఫీసు దగ్గరకు రాబోతున్నాడు. సంభాషణలతోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించారు. మరో పది రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    Mahesh's Aagadu Over Shot By 15 Crores?

    ఖచ్చితంగా మరో హిట్ తో వస్తామని శ్రీను వైట్ల పూర్తి నమ్మకంగా ఉన్నారు. ఇంతకాలం శ్రీను వైట్లతో కలిసి పని చేసిన గోపీ మోహన్, కోన వెంకట్ సొంతగా దర్శకత్వం వైపు అడుగులు వేయడంతో.... ‘ఆగడు' సినిమాకు సొంతగా స్క్రిప్టు రాసుకుని దిగారు శ్రీను వైట్ల. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బేనర్లో ‘దూకుడు' సినిమా చేసిన మహేష్ బాబు.....అదే బానర్లో సుకుమార్ దర్శకత్వంలో సినిమాకు చేసారు. ఆ సినిమా వెంటనే మళ్లీ ఇదే బేనర్లో శ్రీను వైట్లతో ‘ఆగడు' సినిమా చేయడానికి రెడీ కావడం గమనార్హం.

    మహేష్ బాబు మాట్లాడుతూ... ''దూకుడు' సమయంలో తమన్‌ కెరీర్‌ ఆరంభంలో ఉంది. ఇప్పుడు 50వ సినిమాగా 'ఆగడు' చేస్తున్నాడు. మేం 50 సినిమాలు చేయాలంటే ఎన్నేళ్లు పడుతుందో? తనకి ఈ చిత్రం ప్రత్యేకం అవుతుంది. మంచి పాటలు అందించాడు. భాస్కరభట్ల, శ్రీమణి సాహిత్యం చాలా బాగుంది. ఛాయాగ్రాహకుడు గుహన్‌తో నేను చేస్తున్న ఐదో సినిమా ఇది. తను నన్ను తెరపై బాగా చూపిస్తాడు. ప్రేమ్‌రక్షిత్‌ ఈ సినిమాలోని అన్ని పాటలకూ నృత్యాలు సమకూర్చారు. ఇలా సాంకేతిక బృందమంతా కలిసి కట్టుగా ఈ సినిమాని పూర్తి చేసింది.

    'దూకుడు' అప్పట్లో నా కెరీర్‌కి ఓ పెద్ద మలుపునిచ్చింది. ఇప్పుడు 'ఆగడు' ఇంకో మలుపు అవుతుంది. శ్రీనువైట్లతో సినిమా చేయడం చాలా హాయిగా ఉంటుంది. ప్రతీ సన్నివేశాన్నీ, ప్రతీ రోజునీ ఆస్వాదిస్తుంటాను. నిర్మాతలు ఈ సినిమాకోసం చాలా కష్టపడ్డారు. వాళ్లతో మళ్లీ మళ్లీ సినిమాలు చేస్తాను. సెప్టెంబరు 19న 'ఆగడు'ని విడుదల చేస్తున్నాం. పండగ రెండు రోజుల ముందే జరుపుకొంటున్నాం''. అన్నారు. సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: కె.వి. గుహన్‌, కళ: ఎ.ఎస్‌.ప్రకాశ్‌, కూర్పు: ఎం.ఆర్‌.వర్మ, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: పరుచూరి కోటి.

    English summary
    Mahesh's 'Aagadu' movie was initially planned at a budget of 38 crores . However during production all the costs have gone overboard with an excess 15 crores spun into the shootings. Total budget has finally shot up to 55+ Crores, forcing the producers to seek help from EROS Group again.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X