»   »  కాశీ లో మహేష్ మకాం : మిగతా పుణ్య క్షేత్రాల్లో కూడా (ఫొటోలతో)

కాశీ లో మహేష్ మకాం : మిగతా పుణ్య క్షేత్రాల్లో కూడా (ఫొటోలతో)

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ బాబు త్వరలో పుణ్య క్షేత్రాలను దర్శించనున్నారా అంటే అవుననే వినపడుతోంది. అయితే ఆయన వ్యక్తిగత పర్యటన కాదు. తన చిత్రం బ్రహ్మోత్సవం... షూటింగ్ నిమిత్తం వారణాసి, తిరుపతి, హరిద్వార్ వంటి పుణ్య క్షేత్రాల సందర్శించనున్నారని తెలుస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం కాశీకు వెళ్లారని సమచారం.

అందుతున్న సమాచారం ప్రకారం...మహేష్‌బాబు ప్రస్తుతం శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో చేస్తున్న చిత్రం 'బ్రహ్మోత్సవం'. ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇక్కడ షూటింగ్ పూర్తవగనే నార్త్ ఇండియాలో మేజర్ సీక్వెన్స్ లు ప్లాన్ చేసారు.


ముఖ్యంగా అక్కడ పవిత్రమైన ప్రదేశాల్లో ఈ చిత్రం షూటింగ్ జరగనుంది. అందుకోసం వారణాసి, హరిద్వార్ వంటి పుణ్య క్షేత్రాలను ఎంపిక చేసారు. సినిమా కథ..తిరుపతిలోని బ్రహ్మోత్సవం...కుటుంబ బంధాల చుట్టూ సాగుతుంది. అంతేకాదు ఉదయపూర్ లో ఓ పాటను సైతం చిత్రీకరించనున్నారు.చిత్రం ఆన్ లొకేషన్ ఫొటోలు..మరిన్ని విశేషాలతో...


మహేష్ కాశీలోనే మకాం

 


బ్రహోత్సవం షూటింగ్‌లో భాగంగా కాశీలోనే మహేష్ ఉండబోతున్నారు.


 


షెడ్యూల్

 


ఇటీవలే హైదరాబాద్‌ షెడ్యూల్‌ పూర్తిచేసుకున్న బ్రహ్మోత్సవం.. ఈనెల 2నుంచి కాశీలో తాజా షెడ్యూల్‌ జరగనుంది.


 


కీసీన్స్..

 


కాశీలో ముఖ్యమైన సన్నివేశాలు చిత్రించనున్నారు.


 


బీచ్ సాంగ్

 


ఈ ఫ్యామిలీ సినిమాలో బీచ్ సాంగ్ ఒకటి ఉండబోతోందని సమాచారం.


 


మాల్దీవుల్లో

 


బీచ్ సాంగ్ కోసం మాల్దీవులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.


 


హైలెట్స్ లో

 


బీచ్ సాంగ్ సినిమాలో హైలెట్ గా ఉంటుందని చెప్తున్నారు.


 


కానీ..

 


కాజల్, మహేష్ మధ్య బీచ్ సాంగ్ ప్లాన్ చేసారు. అయితే సమయం సరిపోకపోతే మాత్రం ఇక్కడే సెట్స్ లో లాగించేస్తారు.


 


క్రేజ్

 


ఈ చిత్రానికి జనవరి నెలలో నూతన సంవత్సరం సందర్బంగా విడుదల చేసిన టీజర్ తో మంచి క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే.


 


ఓవర్ సీస్ లోనూ...

 


ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓవర్ సీస్ బిజినెస్ ఓ రేంజిలో జరిగిందని సమాచారం.


 


నిర్మాత

 


ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి.సినిమాస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌ నిర్మిస్తున్నారు.


 


కాశీ లో మహేష్ మకాం : మిగతా పుణ్య క్షేత్రాల్లో కూడా (ఫొటోలతో)

 


మహేష్ బాబు కోసం ఈ సారి శ్రీ కాంత్ అడ్డాల విజయవాడ బ్యాక్ డ్రాప్ ని ఎంచుకున్నాడు.


 


ముగ్గురు

 


ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు.


 


ఫ్యామిలీస్

 సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్లు తరహాతో ఈ చిత్రం చక్కటి కుటుంబ కథా చిత్రంగా వుంటుందని చిత్ర యూనిట్‌ తెలియజేస్తుంది.


 


13 కోట్లకు..

 


‘బ్రహ్మోత్సవం' ఓవర్సీస్ రైట్స్ ను అమెరికాకు చెందిన క్లాసిక్ ఎంటర్ టైన్ మెంట్స్ 13 కోట్లకు కొనుక్కున్నారు.


 


భారీ విజయం...

 


‘శ్రీమంతుడు' భారీ విజయం సాధించడంతో అదే ఊపుతో ‘బ్రహ్మోత్సవం' సినిమా మొదలు పెట్టారు.


 


మహేష్‌బాబు మాట్లాడుతూ...

 


''శ్రీకాంత్‌ అడ్డాల చెప్పిన కథ బాగా నచ్చింది. 'శ్రీమంతుడు' తర్వాత ఇంత మంచి కుటుంబ కథా చిత్రంలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది.


 


మహేష్ కంటిన్యూ చేస్తూ.. కాశీ లో మహేష్ మకాం : మిగతా పుణ్య క్షేత్రాల్లో కూడా (ఫొటోలతో)

 


అన్ని వర్గాల ప్రేక్షకులతో పాటు నా అభిమానుల్ని అలరించే చక్కటి కుటుంబ కథా చిత్రమవుతుంది''అన్నారు.


 


కొనసాగుతాయి

 


''సంగీత్‌ సాంగ్‌తో పెద్ద ఎత్తున చిత్రీకరణ మొదలుపెట్టాం. ఈ వేడుకలు ఇలానే కొనసాగుతాయ''న్నారు దర్శకుడు.


 


కొనసాగుతాయి

 


''సంగీత్‌ సాంగ్‌తో పెద్ద ఎత్తున చిత్రీకరణ మొదలుపెట్టాం. ఈ వేడుకలు ఇలానే కొనసాగుతాయ''న్నారు దర్శకుడు.


 


ప్రసాద్‌ వి. పొట్లూరి మాట్లాడుతూ...

 


''తిరుమల బ్రహ్మోత్సవాలు మొదలైన రోజునే మా చిత్రం ప్రారంభం కావడం ఆనందంగా ఉంది. . వేసవి కానుకగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు


 


దృష్టి మొత్తం

 


మహేష్ బాబు ఇక తన దృష్టంతా బ్రహ్మోత్సవం సినిమాపై పెట్టి చేస్తున్నాడు


 


మరోప్రక్క

 


షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా జరుగుతోంది.


 


సెంటిమెంట్ రిపీట్


మహేష్ బాబు - శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ సెంటిమెంట్ ని ఈ సారి కూడా రిపీట్ చేయనున్నారు.


విభేదాలు

 


ఆ మధ్యన దర్శకుడుకి, హీరోకు మధ్య విభేదాలు వచ్చాయని వినిపించాయి. అయితే అవి పెద్దవి కాకుండానే ముగిసిపోయాయని తెలుస్తోంది.


 


రిలీజ్

 


ఈ చిత్రాన్ని మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు ని దృష్టిలో పెట్టుకుని మే 31 న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.


 


కూతురు ఎంట్రీ


ఈ చిత్రంలో మహేశ్‌బాబు కుమార్తె సితార తెరంగేట్రం చేస్తుందన్న వార్త ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తోంది.


భారీగానే

 


నిమిత్తం మహేష్ కు భారీగానే ఆఫర్ చేసినట్లు చెప్తున్నారు. అందుకు కారణం..మహేష్ ని భాగస్వామిగా వద్దనుకోవటమే అంటున్నారు.


 


చెమట్లు

 


శ్రీమంతుడు చిత్రం తర్వాత మహేష్ మార్కెట్ రెట్టింపు అయ్యింది. ముఖ్యంగా ఓవర్ సీస్ లో ఆయన మార్కెట్ మిగతా హీరోలకు చెమట్లు పట్టిస్తోంది.


 


మొదట

 


‘బ్రహ్మోత్సవం' చిత్రానికి కూడా ‘శ్రీమంతుడు' తరహాలోనే సహనిర్మాతగా ఉండాలని మహేష్ బాబు భావించారు.


 


వద్దనుకుని..

 


మహేష్ బాబు భాగస్వామ్యం ఇష్టం లేని నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి మహేష్ బాబుతో చర్చలు జరిపారట. సినిమాను పూర్థి స్థాయిలో తానే నిర్మిస్తానని చెప్పారట.


 


మిగతా ముఖ్యపాత్రల్లో

 


ఈ సినిమాలో సత్యరాజ్, రేవతి, జయసుధ, నరేష్ లు ముఖ్య పాత్రలు పోషించనున్నారు.


 


టెక్నికల్ గా ...

 


ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఆర్‌.రత్నవేలు, కూర్పు: శ్రీకర ప్రసాద్‌, సంగీతం: మిక్కీ.జె. మేయర్‌


 


English summary
Brahmotsavam unit will leave for North India to can some major sequences in holy places in North India. Varanasi and Haridwar have been selected for the shoot.
Please Wait while comments are loading...