Don't Miss!
- Sports DC vs GT: రఫ్ఫాడించిన ముఖేష్ కుమార్.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన ఢిల్లీ!
- News హైదరాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: ఖమ్మంలో హీరో వెంకటేష్ వియ్యంకుడు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సంపూర్ణేష్ బాబు...ఇంకో సినిమా కమిటయ్యాడు
హైదరాబాద్ : హృదయ కాలేయం చిత్రంతో పరిచయమైన సంపూర్ణేష్‌బాబు హీరో గా మరో సినిమా కమిటయ్యారని సమాచారం. సింగం 123 టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మంచు విష్ణు తమ 24 ఫ్రేమ్స్ పతాకంపై నిర్మించనున్నట్లు చెప్పుకుంటున్నారు. పూర్తి కామెడీతో ఈ చిత్రం దర్శకుడు ఎవరు...మిగతా కాస్టింగ్ ఏమిటనే వివరాలు త్వరలో తెలియనున్నాయి. తమిళ హిట్ సింగం కి స్పూఫ్ లా ఉంటుందని వినికిడి.
ప్రస్తుతం సంపూర్ణేష్ బాబు...కొబ్బరి మట్ట అనే చిత్రం చేస్తూ బిజీగా ఉన్నాడు. అలాగే...సంపూర్ణేష్ బాబు హీరోగా... వైరస్ డాట్ కామ్ అనే పేరుతో ఓ వినూత్న చిత్రం తెరకెక్కుతోంది. (బి వేర్) అనేది ఉపశీర్షికతో వస్తున్న ఈ చిత్రానికి సీ.హెచ్. శివరామకృష్ణ దర్శకత్వం వహించనున్నారు. విజయదశమి రోజున లాంఛనంగా ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని ఎ.ఎస్.ఎన్ ఫిల్మ్స్ పతాకంపై సలీం, ఎ.జె. రాంబాబు సంయుక్తంగా నిర్మించనున్నారు. దర్శకుడు మాట్లాడుతూ సంపూర్ణేష్‌బాబు నుంచి ప్రేక్షకులు ఏ తరహా వినోదాన్ని కోరుకుంటున్నారో అది ఈ సినిమాలో వంద శాతం వుంటుంది.
కథకు తగ్గ హీరో కుదిరారు. ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కించనున్నాం అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ నేటి వాస్తవ పరిస్థితులని ప్రతిభింబిస్తూ..నేటి యువతరాన్ని ఉత్తేజపరుస్తూ ఆద్యంతం వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించాలని సన్నాహాలు చేస్తున్నాం. అక్టోబర్, నవంబర్ నెలల్లో చిత్రీకరణ పూర్తి చేసి చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.