Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎన్టీఆర్- పూరి చిత్రానికి మణిశర్మ బ్యాగ్రౌండ్?
హైదరాబాద్: నందమూరి యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి తొలుత అనూప్ రూబెన్స్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా అనుకున్పటికీ అతన్ని పక్కకు తప్పించి దేవిశ్రీ ప్రసాద్‌తో మ్యూజిక్ చేయిస్తున్నారు. తాజాగా అందుతున్న మరో విషయం ఏమంటే... ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించబోతున్నారట.
ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో బిజీయెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న మణి శర్మ...యువ సంగీత దర్శకుల రాకతో కాస్త వెనకబడి పోయారు. హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ బ్యాగ్రౌండ్ ఇవ్వడంలో మణిశర్మను మించిన వారు లేరనే చెప్పొచ్చు. అందుకే ప్రత్యేకంగా ఆయనతో బ్యాగ్రౌండ్ స్కోర్ కొట్టిస్తున్నారు పూరి జగన్నాథ్.
యాక్షన్ ఎంటర్టెనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, ఆలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జీ, వెన్నెల కిషోర్, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తారు. శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, ఫైట్స్: విజయ్, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగ