twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్లాఫ్ ఇచ్చినా అదే దర్శకుడుతో మంచు మనోజ్

    By Srikanya
    |

    హైదరాబాద్:మంచు మనోజ్, నాగేశ్వరరెడ్డి కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'కరెంట్‌ తీగ' . ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద వర్కువుట్ కాలేదు. అయినా మరో సారి ఈ కాంబినేషన్ లో సినిమా రూపొందనుంది. మంచు విష్ణు నిర్మాతగా రూపొందే ఈ చిత్రం 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై రూపొందనుంది. ఇది ఓ యాక్షన్ కామెడీ అని చెప్తున్నారు. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. ఈ చిత్రం అఫీషియల్ ప్రకటన త్వరలో రానుందని సమాచారం.

    పాండవులు పాండవులు తుమ్మెద చిత్రంలో హిట్ కొట్టి ఉత్సాహంలో ఉన్న మంచు మనోజ్ తన తదుపరి చిత్రం కరెంట్ తీగతో ప్లాఫ్ ఇచ్చారు. ఇప్పుడు మరో చిత్రానికి సిద్దమవుతున్నారు. ఈ చిత్రం టైటిల్ సన్నాఫ్ పెద రాయుడు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. రమేష్ పుప్పాల నిర్మిస్తున్న ఈ చిత్రం పూర్తి ఎంటర్టైన్మెంట్ తో నడుస్తుందని చెప్తున్నారు.

    Manoj, Nageswara Reddy to team up again

    మోహన్‌బాబు కెరీర్‌లో కలికితురాయి లాంటి సినిమా ‘పెదరాయుడు'.బాక్సాఫీస్‌ వద్ద సంచలన వసూళ్లను సాధించిన గొప చిత్రమిది. అంతేకాదు డైలాగ్‌కింగ్‌ని ఓ రేంజులో చూపించారీ చిత్రంలో. ఈ సినిమాకి సీక్వెల్‌ ‘సన్నాఫ్‌ పెదరాయుడు'.కొత్త దర్శకుడు సాగర్‌ పసల దర్శకత్వం వహిస్తారని, అమెరికా షెడ్యూల్‌ మొదలవుతోందని తెలుస్తోంది. ఎల్లో ఫ్లవర్స్ అధినేత రమేష్ పుప్పాల ఈ భారీ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

    నిర్మాత రమేష్ పుప్పాల మాట్లాడుతూ-‘‘హాలీవుడ్‌లో మోషన్ పిక్చర్ ఇనిస్టిట్యూట్‌లో దర్శకత్వంలో శిక్షణ పొంది, హాలీవుడ్‌లో ‘డార్క్ ఫీల్డ్స్' చిత్రానికి అసిస్టెంట్ దర్శకుడుగా పనిచేసి, తెలుగులో ‘కిక్' సురేందర్‌రెడ్డి వద్ద పలు చిత్రాలకు పనిచేసిన పి.సాగర్‌ని ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. మంచు మనోజ్‌తో నిర్మిస్తున్న ఈ ‘సన్నాఫ్ పెదరాయుడు' అతి త్వరలో ప్రారంభం అవుతుంది. మనోజ్ కెరీర్‌ని కొత్త మలుపు తిప్పే వైవిధ్యమైన కథతో ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే తెలియజేస్తాం''అన్నారు.

    English summary
    Manoj Manchu and director Nageswara Reddy duo fresh from ‘Current Theega’ box office success is now ready to shoot another rocking action-comedy film under 24 Frames Factory banner.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X