twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మేము సైతం’ పోగ్రాం: అత్యాక్షరి ఈ హీరోలతో...

    By Srikanya
    |

    హైదరాబాద్ : హుద్‌హుద్‌ తుపాను బాధితుల కన్నీళ్లు తుడవడానికి చిత్రసీమ యావత్తూ కదలివస్తోంది.'మేము సైతం -వి లవ్‌ వైజాగ్‌' అంటూ చేయూత నివ్వబోతోంది. ఈ వేడుక నవంబర్ 30న హైదరాబాద్ లో జరగనుందని, ఇది 13 గంటల పాటు కంటిన్యూగా జరిగే లైవ్ ప్రోగ్రాం ఇది. ఇందులో భాగంగా బాలకృష్ణ, వెంకటేష్, చిరంజీవి, నాగార్జునలతో అంత్యాక్షరిని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అలాగే బాలకృష్ణ, ఎన్టీఆర్ లతో కలిసి ఓ స్కిట్ ని సైతం బోయపాటి డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్టుతో పవన్ , మహేష్ బాబులు కలిసి స్కిట్ చేయనున్నారు.అలాగే దాదాపు 100 మంది సెలబ్రెటీలతో ఛారెటీ డిన్నర్ సైతం జరగనుందని సమచారం.

    డి.సురేష్‌బాబు మాట్లాడుతూ ''నవంబరు 30న 'మేము సైతం' పేరుతో ఓ వినూత్న వినోద కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో చేపడతాం. దాదాపు పన్నెండు గంటలపాటు సుదీర్ఘంగా సాగుతుంది. ఆ రోజు చిత్ర పరిశ్రమకు సెలవు ప్రకటించాం. వినోద కార్యక్రమాల్లో అగ్రతారలు, దర్శకులు, రచయితలు, మిగిలిన సాంకేతిక నిపుణులు అందరూ పాల్గొంటారు. ఆటపాటలూ, సరదా సన్నివేశాలతో అల్లుకొన్న నాటికలు ప్రదర్శిస్తాం. క్రికెట్‌ కూడా ఉంటుంది. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తాం. రూ.500 అంతకు మించి విరాళాల్ని అందించిన వారందరిలో నూటనాలుగు మందిని నవంబరు 27న లాటరీ ద్వారా ఎంపిక చేస్తాం. వాళ్లకు బహుమతులు అందిస్తామ''న్నారు.

    ‘Memu Saitam’ : Chiru,Venky, Nag, Balayya anthyakshari

    అల్లు అరవింద్‌ చెబుతూ ''దేశ, విదేశాల్లో ఉన్న తెలుగువాళ్లంతా విరాళాలను అందించవచ్చు. అన్నిరకాల ప్రసార మాధ్యమాలనీ ఈ కార్యక్రమం కోసం ఉపయోగించుకొంటున్నాం. ఎప్పటి కప్పుడు 'మేముసైతం' వివరాల్ని మా వెబ్‌సైట్‌లో ఉంచుతామ''న్నారు. పరిశ్రమలోని తారలు, దర్శకనిర్మాతలే కాకుండా పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు అంతా దీనిలో పాలుపంచుకొంటారని ఎన్‌.వి. ప్రసాద్‌ చెప్పారు.

    ''గతంలో ప్రకృతి వైపరిత్యాలు ఎదురైనప్పుడు తమవంతు బాధ్యతగా పరిశ్రమ సహాయాన్ని అందించింది. ఈసారీ అంతకు మించి అండదండలు అందించేందుకు సమాయాత్తం అవుతోంది. తమిళ, కన్నడ, హిందీ తదితర భాషలకు చెందిన తారలు, సాంకేతిక నిపుణులూ పాలుపంచుకోనున్నార''న్నారు మురళీమోహన్‌.

    ‘మేము సైతం' ప్రోగ్రాంని ప్రత్యక్ష ప్రసారం చేసే రైట్స్ కోసం తెలుగులో నాలుగు టాప్ 4 ఎంటర్టైనింగ్ చానల్స్ అయిన ఈ టీవీ, మా టీవీ, జెమిని టీవీ మరియు జీ టీవీ భారీ ఎత్తున పోటీ పడుతున్నాయి. ఈ పోటీలో చివరికి జెమిని టీవీ వారు మేము సైతం ప్రత్యక్ష ప్రసార రైట్స్ ని ఓ భారీ మొత్తానికి దక్కించుకున్నారు.

    చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్.టి.ఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మోహన్ బాబు మొదలైన అందరు హీరోలు హాజరు కానున్నారు. అందులో పలువురు హీరోలు లైవ్ పెర్ఫార్మన్స్ కూడా ఇవ్వనున్నారు.

    English summary
    Tollywood's ‘Memu Saitam’, marathon entertainment program on Nov, 30th for hudhud victims is getting nearer day by day. Chiranjeevi, Balakrishna, Venkatesh, Nagarjuna will be playing Antyakshari. There will be charity dinner in which more than 100 celebrities will be participating.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X