twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాన్న మృతి... 'నాన్నకు ప్రేమతో' ఆడియో పోస్ట్ పోన్

    By Srikanya
    |

    హైదరాబాద్ : సుకుమార్‌ దర్శకత్వంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'నాన్నకు ప్రేమతో'. రీసెంట్ గా యుకె లో 90 రోజుల పాటు కంటిన్యూ గా షూటింగ్ లో జరుపుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.,

    ఈ నేపధ్యంలో ఈ సినిమా ఆడియో డిసెంబర్ 23న విడుదల చేయటానికి సన్నాహాలు మెదలుపెట్టినా, ప్రస్తుతం వాటిని నిలిపేసారు. దేవిశ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి మరణించడం వలన అందరు షాక్ కు గురైయ్యరు..దీనితో అనుకోకుండా ఈ సినిమా ఆడియో పోస్ట్ పోన్ అయ్యిందని సమాచారం. అయితే ఈ విషయమై అఫీషియల్ సమాచారం లేదు.

    చిత్రం విశేషాలకు వస్తే...ఇంకా రెండు పాటలు షూటింగ్ జరగాల్సి ఉంది. దీనితో నిర్మాతలకి జనవరి 13వ విడుదలపై కూడా సందేహం కలుగుతోంది. ఇప్పటికే ఆడియోని పోస్ట్ పోన్ చేసారు. అభిమానులు మాత్రం ఈ సినిమా గురించి ఆత్రంగా ఎదురుచుస్తున్నారు.

    Naannaku premato Audio Postponed

    నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ....'విజయదశమి కానుకగా విడుదలైన 'నాన్నకు ప్రేమతో..' టీజర్‌కు ప్రపంచ వ్యాప్తంగా ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. దీపావళి కానుకగా ఈ చిత్రానికి సంబంధించి పోస్టర్‌ను రిలీజ్‌ చేశాం. లండన్‌లో 60 రోజులపాటు ఓ భారీ షెడ్యూల్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించిన సన్నివేశాలు ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చాయి ఇక సంక్రాంతి కానుకగా వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం' అని అన్నారు.

    దర్శకుడు మాట్లాడుతూ ''ఎన్టీఆర్‌ని కొత్త తరహా పాత్రలో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆయన తెరపై కనిపించే విధానం భిన్నంగా ఉంటుంది. ఇదివరకటితో పోలిస్తే మరింత స్త్టెలిష్‌గా కనిపిస్తారు. ఎన్టీఆర్‌ కోసం ప్రత్యేకంగా ఓ బైక్‌ని తయారు చేయించాం. అది చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది''అన్నారు. ఈ చిత్రాన్ని తమిళంలో డబ్బింగ్ చేసి అదే రోజు విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు జరగుతున్నట్లు సమాచారం.

    English summary
    Sudden demise of music director Devi Sri Prasad's father Satyamurthy, has come to a shocker to Nannaku Prematho team and this might lead audio function of the movie getting postponed to december 23rd.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X