Don't Miss!
- News నాకు అండగా, చీకటిలో వెలుగుగా..
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్‌బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్‌న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
నాని నానుస్తున్నాడనే నాగ చైతన్య తో... ?
హైదరాబాద్ : ఒక హీరోతో అనుకున్న సినిమాలు మరో హీరోతో మొదలవటం,హిట్ కొట్టడం సాధారణంగా జరిగేదే. స్క్రిప్టులోని పొటెన్షియల్ ని అంచనా వేయలేక చాలా సార్లు హీరోలు తన దగ్గరకు వచ్చిన వాటిని రకరకాల కారణాలు చెప్పి, మార్పులు చెప్పి వదులుకుంటూంటారు. ఆ తర్వాత ఆ స్క్రిప్టు మరో హీరోతో సినిమా రూపం దాల్చి హిట్ కొడితే...అరే మిస్సైపోయామే అని భాధపడతారు. అలా కాకుండా సినిమా ఫ్లాఫ్ అయితే తమ జడ్జిమెంట్ కరెక్టు అనుకుంటూంటారు. తాజాగా నానికు అనుకున్న స్క్రిప్టు ఒకటి నాగ చైతన్య దగ్గరకు వచ్చిందని సమాచారం. ఆ దర్శకుడు మరెవరో కాదు మారుతి.
దర్శక,నిర్మాత మారుతి కు కొత్త జంట ఫ్లాఫ్ దారుణంగానే దెబ్బ కొట్టింది. అయితే తర్వాత చాలా మంది హీరోలతో అనుకుని నాని తో ఫైనల్ అయ్యిందనుకున్నాడు. అయితే నాని ఎంతకీ తేల్చకపోయేసరికి ఇప్పుడు ఇలా నాగైచైతన్య తో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడంటున్నారు. నాగచైతన్య ని తన కథ, డైలాగులతో ఆకట్టుకున్నాడని, క్లీన్ ఎంటర్టైనర్ ని, తక్కువ బడ్జెట్ లో తీసి ఇచ్చానని హామీ ఇచ్చి దిగుతున్నాడని సమాచారం.
రీసెంట్ గా నాగ చైతన్య ని కలిసి కథ వినిపించిన మారుతి అతని నుంచి గ్రీన్ సిగ్నల్ పొందాడని చెప్పుకుంటున్నారు. ఫక్తు ఎంటర్టైన్మెంట్ తో ఎక్కడా డబుల్ మీనింగ్ లు లేకుండా స్క్రిప్టు ని రూపొందించి వినిపించాడని దాంతో చైతూ ఓకే అన్నాడని తెలుస్తోంది. అలాగే ఎప్పటిలాగే క్వాలిటీకి పెద్ద పీట వేస్తూ ...బడ్జెట్ ని చాలా కంట్రోలుగా చేస్తానని, తక్కువ రోజులు డేట్స్ ఇస్తే చాలు అన్నాడని చెప్పుకుంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని UV క్రియేషన్స్ వారు నిర్మించనున్నారు.
ఇక ఈ ప్రాజెక్టుని మొదట నాని తో చేద్దామనుకుంటే అది మెటీరియలైజ్ కాలేదని తెలుస్తోంది. నాని బాగా నానుస్తున్నాడని అందుకే నాగ చైతన్య తో ముందుకు వెళ్తున్నట్లు ఫిల్మా్ నగర్ సమాచారం. ఈ సబ్జెక్టు యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఇక నాగ చైతన్య సైతం లవ్ ఎంటర్టైనర్ల తో యూత్ ని ఆకట్టుకుందామనే ఆలోచనతో అవే తరహా స్క్రిప్టులను ఎంచుకుంటున్న సంగతి తెలిసిందే.