» 

భయపడ్డ నాగార్జున...పూర్తి జాగ్రత్తలు

Posted by:

హైదరాబాద్ :నాగార్జున ఎన్నడూ లేనిది తన కెరీర్ లో తొలి సారిగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు. తాను నమ్మి చేసిన గ్రీకు వీరుడు,భాయ్ చిత్రాలు రెండూ భాక్సాఫీస్ వద్ద భారీగా డిజాస్టర్స్ గా నమోదు కావటంతో ఆయన తదుపరి చిత్రాల విషయంలో ఆచి తూచి అడుగులు వేయాలని డిసైడ్ అయ్యారని సమాచారం. దాంతో ఆయన దర్శకుడు సీనియారిటి కన్నా కథ, దాన్ని చెప్పే విధానం,చెప్పినట్లు తీసి పెట్టగలడా లేదా అన్నది చూసుకునే దిగదలుచుకున్నారు. అవతలి వారు ఎంత పెద్ద డైరక్టర్ అయినా ఇదే థీరిని ఆయన ఫాలో అయ్యి మళ్లీ ఫామ్ లోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. దాంతో ఏ కథకీ ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం లేదు.

అలాగే నాగార్జున తదుపరి చిత్రంలో పాటలు ఉండబోవని సమాచారం. స్వామి రారా చిత్రంతో పరిచయమైన సుధీర్ వర్మ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. రెగ్యులర్ రొటీన్ సినిమాల కన్నా విభిన్నమైన క్రియేటివ్ చిత్రం చేయాలని నాగార్జున చేయాలని ప్లాన్ చేసి,ఈ ప్రాజెక్టు ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున చేయనున్నారు.

ఇక అక్కినేని కుటుంబంలోని మూడు తరాల హీరోలైన అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, అక్కినే నాగచైతన్య ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం 'మనం'. ఈ చిత్రానికి 'ఇష్క్' ఫేం విక్రమ్‌కుమార్ దర్శకుడు. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం అనుకున్నదానికంటే సినిమా అద్భుతంగా వస్తోందని యూనిట్ వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి.


తాత, తనయుడు, మనవడు... ఒకేసారి తెరపై సాక్షాత్కరించడం అటు అక్కినేని అభిమానులకే కాక, సగటు ప్రేక్షకులకు కూడా కనుల పండుగ కానుందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హర్షవర్దన్ కథ, సంభాషణలు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలువనున్నాయని తెలుస్తోంది. నాగార్జునకు జోడీగా శ్రీయ నటిస్తున్న ఈ చిత్రంలో నాగచైతన్య సర సన సమంత నటిస్తున్నారు. అనూప్‌రూబెన్స్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తుండటం విశేషం.

Read more about: nagarjuna, bhai, greeku veerudu, naga chaitanya, manam, నాగార్జున, భాయ్, గ్రీకు వీరుడు, నాగచైతన్య, మనం
English summary
Two of Akkineni Nagarjuna films have fared badly at the box-office this year. Greekuveerudu and Bhai have had a awful run and due to this Nagarjuna has become cautious.Nag has many proposals to give his nod, but he has been extremely careful in giving green signal for them. Looks like the actor is excising caution and saving himself from flops.
Please Wait while comments are loading...