twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ బాధపడుతున్నాడట..కారణాలు ఇవే

    By Srikanya
    |

    హైదరాబాద్: ఓ ప్రక్క ఎన్టీఆర్ అభిమానులు తన అభిమాన హీరో...నాన్నకు ప్రేమతో చిత్రంతో ఎన్టీఆర్ యాభై కోట్ల క్లబ్ లో చేరారని ఆనందోత్సాహాల్లో ఉన్నారు. అయితే ట్రేడ్ లో మాత్రం డిస్ట్రిబ్యూటర్స్ పాయింటాఫ్ వ్యూ నుంచి చూస్తే ఫ్లాఫ్, జస్ట్ ఓకే, యావరేజ్ అని తేల్చి చెప్తున్నారు.

    వారు చెప్పేదేమిటంటే..సినిమా కు ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యినంతగా కలెక్ట్ చేయలేదని చెప్తున్నారు. ఓవర్ సీస్ లో పెద్ద హిట్ అయ్యింది. కానీ తెలంగాణా, ఆంధ్రా రాష్ట్రాల్లో మాత్రం యావరేజ్ రిజల్ట్ ఇచ్చింది. లాంగ్ రన్ లో ఓకే అనిపించుకుంది. కొన్ని జిల్లాలు తప్పితే...సీడెడ్, నైజాం లలో బ్రేక్ ఈవెన్ రాలేదు.

    క్లోజింగ్ కలెక్షన్స్ ని... ధియేటర్ ప్రీ రిలీజ్ బిజినెస్ ని పోల్చి చూస్తే సక్సెస్ కాదు అని అంటున్నారు. అయితే ఎన్టీఆర్ కు మాత్రం ఈ సినిమా అద్బుతంగా నచ్చిందట. ముఖ్యంగా ఆయన ఈ సినిమాని తన హృదయానికి దగ్గరగా ఉన్న సినిమాగా ఫీలయ్యారు. దాంతో ట్రేడ్ సర్కిల్స్ లో ఈ సినిమా గురించి అంటున్న మాటలు హర్ట్ చేస్తున్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రం యాభై రోజుల సెలబ్రేషన్స్ పట్ల హ్యాపీగా లేడని చెప్తున్నారు.

    అలాగే ఈ చిత్రం కన్నా అదే సమయంలో రిలీజ్ అయిన ఇంత కన్నా తక్కువ బడ్జెట్ తో రెడీ అయిన సోగ్గాడే చిన్ని నాయినా హై సక్సెస్ ఫుల్ మూవీ గా నమోదు చేసింది. అంతేనా శర్వానంద్..ఎక్సప్రెస్ రాజా చిత్రం సైతం సంక్రాంతి విన్నర్ అయ్యింది. ఈ చిత్రం పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభం తెచ్చిపెట్టింది. ఈ యూనిట్ కొద్ది రోజుల క్రితమే ఈ సెలబ్రెషన్స్ ని బ్యాంకాక్ లో జరుపుకున్నారు.

    సినిమా ఎంతో బాగుందని అంటున్నా, ఎన్టీఆర్ బెస్ట్ ఫెరఫార్మెన్స్ అని చెప్తున్నా, సాంగ్స్ హైలెట్ అయినా, నాన్నకు ప్రేమతో అనుకున్న స్దాయి అందుకోలేకపోవటానికి రకరకాల కారణాలు.. ట్రైడ్ వినపడుతున్నవి ఈ క్రింద..

    స్లైడ్ షోలో

    మొదటి రోజు..మార్నింగ్ షో టాక్

    మొదటి రోజు..మార్నింగ్ షో టాక్

    ఈ సినిమాకు మొదటి రోజు, మార్నింగ్ షోకు జస్ట్ ఓకే టాక్ వచ్చింది. కేవలం ఇంటలెక్చువల్స్ కు అర్దమయ్యే సినిమా అని అన్నారు. అది చాలా ఎఫెక్టు చూపించింది.

    బి,సిల్లో

    బి,సిల్లో

    మల్టిఫ్లెక్స్ లు, ఎ సెంటర్లలో ఈ సినిమా వర్కవుట్ అయినట్లుగా బి,సి సెంటర్లను చేరలేకపోయింది. అక్కడ ప్రేక్షకులు ఇది తమ సినిమాగా భావించలేదు

    రివ్యూలు సైతం

    రివ్యూలు సైతం

    ఈ సినిమాకు వచ్చిన రివ్యూలు...సినిమా చాలా స్టైలిష్ గా,తెలివితేటలకు ఉందని అన్నారు, అది కొందరని ధియేటర్స్ వైపు లాక్కెళ్లిగలిగితే, మిగతావాళ్లను ఆలోచనలో పడేసింది.

    మాస్ హీరోకాదు

    మాస్ హీరోకాదు

    ఎన్టీఆర్ బేసిక్ గా మాస్ హీరో ... కానీ ప్రోమోలు, పోస్టర్లు, టైటిల్ దగ్గర నుంచి అన్నీ సినిమా క్లాస్ గా ప్రెజెంట్ చేసాయి.

    ఆప్షన్

    ఆప్షన్

    ఈ సినిమాకు పోటీగా సంక్రాంతికి విడుదలైన సినిమాలు అన్నీ హిట్ టాక్ తెచ్చుకోవటం జరిగింది. దాంతో ఈ సినిమాకే ఖచ్చితంగా వెళ్లాలి అనిపించలేదు. ఈ సినిమా ఓ ఆప్షన్ అయిపోయింది.

    వాళ్లు లేరా

    వాళ్లు లేరా

    బ్రహ్మానందం,అలీ వంటి కమిడియన్స్ లేకపోవటం ఈ సినిమాకు ఫ్రెష్ లుక్ తీసుకు వస్తే..అదే సమయంలో కొందరు వాళ్లు కూడా లేరా,కామెడీ ఉండదా అని పెదవి విరిచారు

    భారీ రేట్లకే

    భారీ రేట్లకే

    సుకుమార్ కు ఉన్న క్రేజ్, ఎన్టీఆర్ స్టామినా, పెరిగిన బడ్జెట్ చూపి ఈ సినిమాని భారీ రేట్లుకు అమ్మారు. దాంతో రికవరీ అవటానికి కష్టమవుతోంది

    వన్.. నేనొక్కిడినే

    వన్.. నేనొక్కిడినే

    మహేష్ తో సుకుమార్ చేసిన 1 నేనొక్కిడినే ఫలితం కూడా కొంతలో కొంత ఈ సినిమాపై పడిందనే చెప్పాలి. మళ్లీ అలాంటి కన్ఫూజన్, సైక్లాజికల్ డ్రామానే తీసాడని చాలా మంది ఆలోచనలో పడ్డారు.

    పేరొచ్చింది

    పేరొచ్చింది

    ఇవన్నీ ప్రక్కన పెడితే ఎన్టీఆర్ కు మాత్రం ఈ సినిమాలో అద్బుతమైన నటన చూపించాడని పేరు వచ్చింది.

    మేకింగ్ అదుర్స్

    మేకింగ్ అదుర్స్

    సుకుమార్ ఈ సినిమాతో ఒక్కసారిగా పది మెట్లు ఎక్కారు. మేకింగ్ వైజ్ ఈ సినిమా ఓ లెస్సన్ లా తీర్చి దిద్దారు

    స్టైల్

    స్టైల్

    ఎన్టీఆర్ ని కొత్త ఆహార్యంతో ప్రెజెంట్ చేయటం కూడా తర్వాత లాంగ్ రన్ కు ప్లస్ అయ్యింది.

    టైం పట్టింది

    టైం పట్టింది

    మొదట వచ్చిన నెగిటివ్ టాక్ నుంచి కోలుకుని సినిమాకు పాజిటివ్ టాక్ రావటానికి టైం పట్టింది. ఈ లోగా సంక్రాంతి సీజన్ వెళ్లిపోయింది.

    రన్...

    రన్...

    సంక్రాంతి కానుకగా విడుదలైన చిత్రం " నాన్నకు ప్రేమతో ". ఈ చిత్రం మార్చి 2 వ తేదీతో యాభై రోజుల రన్ పూర్తి చేసుకుంది.

    కేక్ కట్ చేసి

    కేక్ కట్ చేసి

    50 రోజులు పూర్తి చేసుకోవటంతో అభిమానుల ఆనందానికి అంతేలేదు. హైదరాబాద్ సుదర్శన్ ధియోటర్ లో నిర్మాత ప్రసాద్ కేక్ కట్ చేసి ఈ ఆనందాన్ని పంచుకున్నారు.

    నాన్నకు ప్రేమతో 50 డేస్ సెంటర్స్ లిస్టు ఇదే :

    నాన్నకు ప్రేమతో 50 డేస్ సెంటర్స్ లిస్టు ఇదే :

    1) హైదరాబాద్ క్రాస్ రోడ్
    2) కుకట్ పల్లి pvr
    3) మల్కాజ్గిరి సినీ పోలిస్
    4) విశాఖపట్నం (వైజాగ్)
    5) గాజువాక
    6) కాకినాడ
    7) విజయవాడ
    8) చిలుకులూరి పేట
    9) తిరుపతి
    10) చితూర్
    11) అనంతపూర్
    12) బళ్ళారి
    13) కర్నూల్
    14) కర్నూల్ INOX
    15) ఆదోని
    16) ఎమ్మిగనూర్

    English summary
    Nannaku Prematho is very close to NTR's heart. He is not happy with the trade writing it off as a flop says the buzz.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X