» 

నయనతార... అదే తప్పు మళ్లీ చేస్తోందా?

Posted by:

హైదరాబాద్ : మిగతావారికి భిన్నంగా సెకండ్‌ ఇన్నింగ్స్‌లో శరవేగంతో దూసుకుపోతున్న నటి నయనతార. ఈ క్రమంలో ఆమె అనామిక అంటూ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం చేసింది. ఇప్పుడు మరో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం కమిటైందని సమాచారం. అది మరేదో కాదు... మారుతి దర్శకత్వంలో చిత్రం అని చెప్తున్నారు. దానయ్య దగ్గర ఆమె డేట్స్...రాధ చిత్రం కోసం తీసుకున్నవి ఉండటంతో అవి ఇలా ఎడ్జెట్ చేస్తోందని చెప్పుకుంటున్నారు. అయితే హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు తెలుగులో వర్కవుట్ కావటం లేదు. దానికి తోడు మారుతి హవా సైతం తగ్గింది. ఈ నేపధ్యంలో నయనతార ...హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం ఒప్పుకుని మొత్తం సినిమా భారాన్ని ఎంత వరకూ లాగ గలదు అంటున్నారు.

ఇక నయనతార ఓ కుర్రహీరో సరసన తొలిసారిగా నటించే అవకాశాన్ని కూడా కొల్లగొట్టింది. తమిళంలో ఇప్పటికే విజయ్‌, అజిత్‌, సూర్య, ధనుష్‌, శింబు లాంటి హీరోలతో నటించిన నయనతార జయంరవితో కలిసి నటించలేదు. అయితే జయం రాజా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'తని ఒరువన్‌'లో ఆమె నటిస్తోంది. అంతేనా.. వివాదాలతో విడిపోయిన శింబు సరసన ఏడేళ్ల తర్వాత 'ఇదు నమ్మఆళు'లో నటిస్తుంది. అయితే వీరిద్దరు ఇదివరకే 'వల్లవన్‌' అనే చిత్రంలో నటించారు.

అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనూ ఘన విజయాలు అందుకుంటున్న నటి నయనతార. అయితే ఆమెతో కలిసి నటించేందుకు సీనియర్‌ హీరోలు ఉత్సాహం చూపుతున్నా.. కొత్త హీరోలు మాత్రం ఆమెతో కలిసి నటించేందుకు విముఖతగానే ఉన్నారట. దీంతో పెద్ద హీరోల చిత్రాల తర్వాత తనకు పరిస్థితులు ప్రతికూలంగా మారే అవకాశముందని, టాలీవుడ్‌పై దృష్టి సారించేలా అక్కడి నిర్మాతలకు అందుబాటులో ఉండేందుకు హైదరాబాద్‌కు మకాం మార్చేందుకు సిద్ధమైనట్లు కోలీవుడ్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఆమె సన్నిహితవర్గాలు కూడా ఈ వార్తలను సమర్థిస్తున్నాయి.

కొందరు సన్నిహితులు మాట్లాడుతూ నయనతారకు కోలీవుడ్‌లోనూ కాదు.. టాలీవుడ్‌లోనూ ఎంతో మంది సన్నిహితులు, శ్రేయేభిలాషులు ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం ఆమె తమిళంలో మూడు చిత్రాల్లో నటిస్తోందని, తనకు ఎంతో గుర్తింపు ఉన్న టాలీవుడ్‌లోనూ కనీస సంఖ్యలో సినిమాలు చేసేందుకు నిర్ణయించుకుందని పేర్కొంటున్నారు. అక్కడి నుంచి కూడా మంచి అవకాశాలు ఆమె తలుపుతడుతున్నాయని తెలిపారు. వాటిని సద్వినియోగం చేసుకునేలా.. హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పరచుకోనుందని పేర్కొన్నారు.

సెకండ్ ఇన్నింగ్స్ గురించి నయనతార మాట్లాడుతూ... ''చిత్ర పరిశ్రమకి నేనెప్పుడూ దూరం కాలేదు. అందుకే కెరీర్‌ని మళ్లీ కొత్తగా ప్రారంభించానని నాకెప్పుడూ అనిపించలేదు. అందరూ అంటున్నారు కాబట్టి నేను కూడా రెండో ఇన్నింగ్స్‌ మొదలు పెట్టాననే చెబుతున్నాను. నాపై ప్రేక్షకులు ఎప్పట్లాగే ఆదరణ చూపిస్తుండడం మాటల్లో చెప్పలేనంత అనుభూతినిస్తోంది. దర్శకులకు కూడా నాపై మరింత నమ్మకం పెరిగిందేమో మరి. అందరూ ప్రాధాన్యమున్న పాత్రలను అప్పజెబుతున్నారు. ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?'' అని చెప్పుకొచ్చింది.

Read more about: nayantara, aarambham, raja rani, anamica, maruthi, నయనతార, ఆరంభం, రాజా రాణి, అనామిక, మారుతి
English summary
Maruthi made a hero-ine oriented script to prove his capacity. He is keen on to rope Nayanthara for his movie and keeping his best to get in touch with her.
Please Wait while comments are loading...