» 

ఎన్టీఆర్ ని ఫోన్ చేసి తెగ విసిగిస్తోంది

Posted by:

ప్రియమణికి ఇప్పుడు టైమ్ బాగోలేనట్లుంది. తెలుగులో దాదాపు ఫేడవుట్ అయిపోయే స్టేజీకి వచ్చింది. ఆమె చేతిలో జగపతి బాబుతో చేస్తున్న క్షేత్రం మినహా మరో చిత్రం చేతిలో లేదు. దాంతో బెంగపెట్టుకున్న ఆమె ఇటీవల ఓ షూటింగ్ లో జూనియర్‌ ఎన్టీఆర్‌ని కల్సింది. తమ కాంబినేషన్ లో వచ్చిన యమదొంగ చిత్రం ఎంత హిట్టో గుర్తు చేసి, మళ్లీ ఆ సక్సెస్ ని రిపీట్ చేద్దామంది. అంతేగాక ఎన్టీఆర్ కి సినిమాకన్నా ముందు కంటిన్యూగా వస్తున్న ఫ్లాపులను గుర్తు చేసిందట. అలాగే ప్రస్తుతం కూడా వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఇద్దరం కలిసి చేస్తే మరోసారి సూపర్ హిట్ కొట్టి కెరీర్ లు ను ఒడ్డున పడేసుకోవచ్చునని చెప్పింది. అయితే ఎన్టీఆర్ మాత్రం ఏ సమాధానం చెప్పక చూద్దాం.. తప్పకుండా చేద్దాం వంటి పొడిపొడి మాటలతో కట్ చేసాడట.

దాంతో దమ్ము చిత్రంలో అయినా తనను తీసుకుంటాడనుకున్న ఆశలు అడుగంటిన ఆమె జూనియర్ ని ఫోన్ లలో సైతం విసిగిస్తోందిట. అయితే బయిటకు మాత్రం ఎన్టీఆర్ మరో ఛాన్స్ ఇస్తానన్నాడు అని చెప్తోందిట. ఇదిలా ఉంటే ఆమె తన మార్కెటింగ్ స్టాటజీని వదలక కనపడ్డ ప్రతీ హీరోని వేషం అడుగుతోంది. నిర్మాతలతో యంగ్ హీరోల ప్రక్కన బుక్ చేస్తే రెమ్యునేషన్ లో రిబేట్ ఇస్తానని ప్రకటిస్తోంది. అయినా ఎవ్వరూ ఆమె గోడు వినిపించుకోవటం లేదు. మరి ఎన్టీఆర్ ఏం చేస్తాడో చూడాలి.

Read more about: priyamani, jr ntr, yamadonga, ప్రియమణి, జూ ఎన్టీఆర్, క్షేత్రం
English summary
Priyamani is said to have contacted Jr. NTR who starred along with her in the film Yamadonga for offers.
Please Wait while comments are loading...