twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బాహుబలి' తర్వాత... : ఇంటర్నెట్ లో 'రుద్రమదేవి' లీక్

    By Srikanya
    |

    హైదరాబాద్: రాజమౌళి 'బాహుబలి' సినిమా దృశ్యాలు బయటకు వచ్చిన ఘటన మరవకముందే మరో లీకేజీ కలకలం తెలుగు సినిమా పరిశ్రమకు షాక్ లా తగిలింది.దర్శకుడు గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'రుద్రమదేవి' సినిమా ఆడియో లీకైనట్టు అంతటా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఆడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఆడియో బయటకు ఎలా లీకయిందో తెలుసుకునేందుకు సినిమా యూనిట్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    రీసెంట్ గా 'బాహుబలి'కి సంబంధించిన 13 నిమిషాల నిడివిగల ఎడిట్ చేసిన సినిమా లీకైన అవటం నుంచి తేరుకోక మునుపే ఈ సంఘటన అందరినీ షాకయ్యేలా చేస్తోంది. బాహుబలి కేసులో మకుట విజ్‌వల్‌ సంస్థలో విజువల్స్‌ ఎఫెక్ట్‌ మేనేజర్‌గా పనిచేసిన వర్మ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు 'అత్తారింటికి దారేటి' సినిమా విడుదలకు ముందే లీకవడంతో సంచలనం రేగింది. ఇలా పెద్ద సినిమాలు విడుదలకు ముందే బయటకు లీకవుతుండడం పట్ల నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు.

    Now Rudramadevi audio leaked

    'రుద్రమదేవి' గురించి...

    అనుష్క ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'రుద్రమదేవి'. రానా ముఖ్య పాత్రధారి. గుణశేఖర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. దేశంలో తొలిసారిగా స్టీరియోస్కోపిక్‌ త్రీడీ విధానంలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం మార్చి చివరి వారంలో విడుదల చేయాలని దర్శక,నిర్మాత గుణశేఖర్ నిర్ణయించి ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా తెలియచేసారు.

    దాదాపు 45 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో తనకే సాధ్యమైన రీతిలో ఎవరూ వంక పెట్టలేని విధంగా రూపొందించాలని గుణ శేఖర్ కష్టపడుతున్నారు. బిజినెస్ కూడా అదే రేంజిలో జరుగుతుందని భావిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఎంట్రీ కలవటం కూడా సినిమాకు ప్లస్ అయ్యింది.

    దర్శుడు మాట్లాడుతూ... ''కాకతీయుల కాలం నాటి వైభవాన్ని కళ్లకు కట్టేలా ఈ సెట్‌లు ఉండబోతున్నాయి. వీటి కోసం తోట తరణి 400 స్కెచ్‌లు వేశారు. నాటి సంప్రదాయలు, జీవన స్థితిగతులను ప్రతిబింబించేలా చిత్రబృందం ఎంతో శ్రమించి వీటికి రూపు తీసుకొస్తోంది. ఇప్పటికే కొన్ని సెట్‌లలో షూటింగ్‌ చేశాం. మిగిలిన వాటిలో త్వరలోనే చిత్రీకరణ జరుపుతాం'' అన్నారు.

    Now Rudramadevi audio leaked

    రాణీ రుద్రమది ఓ అద్భుతమైన ప్రయాణం. ప్రపంచ చరిత్రలో ఆమె స్థానం పదిలం. ఈ తరానికి ఆమె కథ తెలియాలి. సాధ్యమైనంత వరకూ చరిత్రను వక్రీకరించకుండా ఉన్నది ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. సాంకేతికంగా ఈ సినిమాని అత్యున్నత స్థాయిలో తీర్చిదిద్దుతున్నాం. అనుష్క కెరీర్‌లో అత్యుత్తమ చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది . రాణీ రుద్రమ కదనరంగంలోనే కాకుండా కళా రంగంలోనే గొప్ప కళాకారిణి అని, కత్తిపట్టినా, కాళ్ళకు గజ్జె కట్టినా ఆమెకు సాటి ఆమేనని ఈ చిత్రంలో దర్శకుడు తెలియజేయనున్నాడు.

    అమ్మాయిలంటే అందాల రాశులే కాదు, వీరనారీలు కూడా. ప్రేమ, కరుణ విషయంలో సున్నితమనస్కులే. కానీ శత్రు సంహారం చేయాల్సినప్పుడు అపరకాళీ అవతారం ఎత్తుతారు. రుద్రమదేవి కథ కూడా అలాంటిదే. రుద్రమదేవి తెగువ, ధైర్యం స్త్రీ జాతికే గర్వకారణం. ఆమె సాహసాలకు మేం తెర రూపం ఇస్తున్నాం అంటున్నారు గుణశేఖర్‌.

    భారత చలన చిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ‘రుద్రమదేవి' చిత్రాన్ని రూపొందించాలన్న పట్టుదలతో ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో ఇంటర్నేషనల్ స్టాండర్స్‌తో తీస్తున్నామని దర్శకుడు గుణశేఖర్ చెప్పుకొచ్చారు.

    Now Rudramadevi audio leaked

    ప్రస్తుతం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరోవైపు గ్రాఫిక్ వర్క్ జరుగుతోంది. తెలుగుజాతి గర్వించే కాకతీయ వైభవాన్ని కళ్లకు కట్టే సినిమా ఇది. దేశ చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రీతిలో ‘రుద్రమదేవి'ని తెరకెక్కించాలన్నదే నా లక్ష్యం. అందుకే ఏ విషయంలోనూ రాజీపడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం అంటున్నారు గుణశేఖర్.

    ఈ చిత్రంలో రాణీ రుద్రమగా....అనుష్క, చాళుక్య వీరభద్రునిగా.... రానా, గణపతిదేవునిగా.... కృష్ణంరాజు, శివదేవయ్యగా... ప్రకాష్‌రాజ్, హరిహరదేవునిగా.... సుమన్, మురారిదేవునిగా... ఆదిత్యమీనన్, నాగదేవునిగా.... బాబా సెహగల్, కన్నాంబికగా.... నటాలియాకౌర్, ముమ్మడమ్మగా.... ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేం జరాషా, మదనికగా.... హంసానందిని, అంబదేవునిగా.... జయప్రకాష్‌రెడ్డి, గణపాంబగా.... అదితి చంగప్ప, కోటారెడ్డిగా.... ఆహుతి ప్రసాద్, టిట్టిబిగా..... వేణుమాధవ్,ప్రసాదాదిత్యగా .....అజయ్ కనిపించనున్నారు.

    ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'

    English summary
    After Rajamouli's Bahubaali now it is the turn of Gunasekhar's period drama Rudramadevi. Rudramadevi's audio was leaked and it has been going viral in the social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X