twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రక్తపు మరకలు పడకుండా జూ ఎన్టీఆర్? రిస్కేనా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ సినిమా అంటే...ఏదో ఒక సీన్లో కత్తులతో నరకడాలు ఉండాల్సిందే... రక్త పాతం జరుగాల్సిందే. యంగ్ టైగర్ నటించిన చాలా సినిమాల్లో ఇదే ఉంది. అయితే త్వరలో ఎన్టీఆర్ ఇందుకు పూర్తిగా భిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఫిల్మ్ నగర్.

    మళయాలంలో హిట్ అయిన ‘బెంగుళూరు డేస్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించబోతున్న ఈచిత్రంలో ఎన్టీఆర్ నటించే అవకాశం ఉందని అంటున్నారు. దిల్ రాజు, పివిపి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నారు. మరి ఈ వార్తలో నిజం ఎంతో తేలాల్సి ఉంది.

    NTR in Bangalore Days Movie Remake

    ఈ మధ్య ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాలన్నీ రొటీన్ కమర్షియల్ మసాలాతో ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనను తాను కొత్తగా తెరపై ఆవిష్కరించుకోవాలనే ఆలోచనకు వచ్చిన ఎన్టీఆర్ ‘బెంగుళూరు డేస్' తెలుగు రీమేర్‌పై ఆసక్తి చూపుతున్నట్లు టాక్. అయితే ఉన్నట్టుండి...మరీ ఇంత సాఫ్ట్‌గా రిస్కే అంటున్నారు విశ్లేషకులు. మరి ఏం జరుగబోతోందో చూడాలి.

    యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా విషయానికొస్తే...మాస్ యాక్షన్ ఎంటర్టెనర్ గా రూపొందుతోన్న ఈచిత్రంలో జూ ఎన్టీఆర్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి వక్కతం వంశీ కథ అందిస్తున్నారు. పూరి జగన్నాధ్ తన ట్రేడ్ మార్క్ డైలాగ్స్, ఫాస్ట్ స్క్రీన్ ప్లే ని జోడించాడు. గతంలో వక్కంతం వంశీ..ఎన్టీఆర్ నటించిన అశోక్, ఊసరవెల్లి చిత్రాలకు కథలు అందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పై బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందించిన బండ్ల గణేష్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

    English summary
    As per latest buzz, Tollywood actor Jr NTR might star in the Telugu remake of super-hit Malayalam film 'Bangalore Days'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X